Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది: వైఎస్‌ జగన్‌
ADVERTISEMENT

ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది: వైఎస్‌ జగన్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 31, 2026 08:29 PM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Untitled_20Design_20_284_29.jpg

సాక్షి, తాడేపల్లి: నారా చంద్రబాబు నాయుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అత్యంత ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న వరుస ఉల్లంఘనలను ఆయన గుర్తు చేశారు.

స్థానిక ఎన్నికల్లో జరుగుతున్న ఉల్లంఘనలన్నీ నామినేషన్ల దశలోనే జరుగుతున్నాయన్న విషయాన్ని మరచి పోకూడదన్నారు వైఎస్‌ జగన్‌. అలాంటిది పోలింగ్ ముగిసి, ఫలితాలు ప్రకటించే సమయానికి ఇంకెంతటి పరిణామాలు చోటుచేసుకోవచ్చో ఊహించుకోవచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు వైఎస్‌ జగన్‌.

ఇది అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది
‘‘ఎన్నికల్లో పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే మొత్తం ఎన్నికల ప్రక్రియను ఎలా నిర్వీర్యం చేయవచ్చో ‘విజనరీ’ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు చూపించారు. ప్రతిపక్ష అభ్యర్థులను అసలు ఎన్నికల బరిలోకే రానివ్వకుండా అడ్డుకోవడం అత్యంత ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది పలుకుతోంది. ఇలాంటి విధానాలు దేశమంతటా విస్తరిస్తే ప్రజాస్వామ్య పునాదులకే ముప్పు వాటిల్లుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

నామినేషన్ల రిగ్గింగ్‌తో దౌర్జన్యాల పర్వం..
ఏ ఎన్నికలైనా నామినేషన్లతోనే ప్రారంభమవుతాయని, నామినేషన్‌ లేకపోతే పోటీ ఉండదన్నారు. ‘‘పోటీ లేకపోతే ఓటరుకు ఎవరిని ఎన్నుకోవాలనే అవకాశం ఉండదు. కానీ, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ ప్రక్రియలోనే దౌర్జన్యాల పర్వం మొదలైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం, వారిపై బైండోవర్‌ చర్యలు చేపట్టడం, మా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వారెవ్వరూ బయటకు వెళ్లకుండా నిరోధించడంతోనే అక్రమాలు మొదలయ్యాయి. 

మరోవైపు నామినేషన్‌ కేంద్రాల చుట్టూ పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు స్వేచ్ఛగా గుమిగూడేందుకు అనుమతించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై మాత్రం ఆంక్షలు విధించి, వారితో పాటు కేవలం ఇద్దరు లేదా ముగ్గురిని మాత్రమే వెళ్లనిచ్చారు. దీంతో అప్పటికే అక్కడ గుమిగూడిన టీడీపీ మూకల మధ్య వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది.

దీంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా దాడులు చేశారు. వారి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించివేశారు. చివరికి మహిళా అభ్యర్థులను కూడా వదిలి పెట్టలేదు. పోలీసులు, రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలోనే ఏకంగా  ఎంపీలు, మాజీ మంత్రులపైనా దాడులు జరిగాయి. ఈ ఘటనలన్నీ తమ కళ్లెదుటే జరుగుతున్నా పోలీసులు, రిటర్నింగ్‌ అధికారులు చూస్తూ ఉండిపోయారు. టీడీపీ గూండాలకు వారు సహకరించడంతో అవన్నీ కొనసాగాయి. ఫలితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్నే కోల్పోయారు’’ అని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు
గతంలో ఎప్పుడూ చూడని మరో ఆందోళనకరమైన పరిణామం ఏమిటంటే, టీడీపీ సానుభూతిపరులు తాము వైఎస్సార్‌సీపీ తరఫున నిలబెట్టిన అభ్యర్థులమని తప్పుడు ప్రకటనలు చేస్తూ నామినేషన్లు దాఖలు చేయడమని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘ఒకవైపు వైఎస్సార్‌సీపీ నిజమైన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూనే, మరోవైపు ఇలాంటి నకిలీ నామినేషన్ల ద్వారా ప్రతిపక్ష పార్టీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం పొందిందనే భ్రమ కల్పించారు. అన్ని పార్టీలకూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించినట్లు ప్రజలను, న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించడమే దీని ఉద్దేశం. పార్టీ అధికారిక అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నప్పుడు, కేవలం వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు ఉన్నంత మాత్రాన అక్కడ నిష్పక్షపాతమైన ఎన్నిక జరుగుతుందని చెప్పలేం. పార్టీ అసలైన అధికారిక అభ్యర్థి ఎవరనేది నిర్ధారించే ఫారం–ఏ, ఫారం–బీలను కూడా పట్టించుకోలేదు’’ అని మండిపడ్డారు.

పక్షపాత స్క్రూటినీ.. బలవంతంగా ఉపసంహరణలు
అన్ని అడ్డంకులు ఎదుర్కొని ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే.. ఆ తర్వాత వారిపై విపరీతమైన ఒత్తిళ్లు కొనసాగాయని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థులను బెదిరించారు. బలవంతం చేశారు. ఆ బెదిరింపులకు లొంగని అభ్యర్థుల నామినేషన్లను స్క్రూటినీ పేరుతో చిన్న చిన్న, అర్థంలేని కారణాలు చూపిస్తూ తిరస్కరించారు. నామినేషన్‌ పత్రాలతో పాటు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు తొలగించడం లేదా వాటిని తారుమారు చేయడం జరిగింది. అనంతరం అవసరమైన పత్రాలు లేవనే కారణంతో రిటర్నింగ్‌ అధికారులు ఆ నామినేషన్లను తిరస్కరించారు. అంటే, అన్ని పత్రాలను పూర్తిగా సమర్పించి, వాటికి అధికారిక రసీదు కూడా పొందిన అభ్యర్థులనే, ఆ పత్రాలు అధికారుల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఏర్పడిన లోపాలకు బాధ్యులను చేశారు’ అని తెలిపారు.

ఫోర్జరీ సంతకాలు.. వేరే వ్యక్తులతో నామినేషన్ల ఉపసంహరణ 
మరికొన్ని ఘటనల్లో అభ్యర్థులు తాము అంగీకరించకపోయినా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చూపించారని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ‘‘అందుకు అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి ఉపసంహరణ పత్రాలను చూపారు. వాటిని అధికారులు గుడ్డిగా ఆమోదించారు. దీంతో అసలైన అభ్యర్థులకు తెలియకుండానే, వారి సమ్మతి లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసే హక్కును హరించారు. అంటే బెదిరింపులు, దాడులు, స్క్రూటినీ పేరుతో ఎదురైన అడ్డంకులన్నింటినీ అధిగమించిన అభ్యర్థిని కూడా చివరకు మోసపూరిత ఉపసంహరణ ద్వారా ఎన్నికల బరి నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడింది.

ఈ ప్రక్రియ మొత్తంలో పోలీసులు, రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల యంత్రాంగం కుమ్మక్కయ్యారు. అలా ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించేందుకు టీడీపీ చేసిన కుట్రకు అంతా సహకరించారు. వాస్తవానికి ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రతి ఓటరుకు తనకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే హక్కు పరిరక్షించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. అందుకే ప్రతి ఫిర్యాదుపైనా స్వతంత్ర దర్యాప్తు జరగాలి. నామినేషన్‌ పత్రాలు, స్క్రూటినీ రికార్డులు, ఉపసంహరణ పత్రాలు, వీడియో ఫుటేజీని భద్రపరిచి క్షుణ్ణంగా పరిశీలించాలి. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే పరిస్థితి..
అన్యాయంగా ఎన్నికల బరి నుంచి తప్పించిన అభ్యర్థులకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలి. ప్రజల మద్దతు తమకే ఉందని చంద్రబాబునాయుడికి నమ్మకం ఉంటే, మరి ఆయన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఎందుకు అడ్డుకుంటోంది? తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాన్ని ఓటర్లకు ఎందుకు నిరాకరిస్తోంది? నామినేషన్ల దాఖలు, ఆ తర్వాత ఉపసంహరణ దశలోనే ఇంతటి అరాచక పరిస్థితులు నెలకొంటే.. ఇక పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన సమయంలో ఇంకేం జరుగుతుందోనన్న తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయి.

రేపటి (నవంబరు 1, ఆదివారం) నుంచే స్థానిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొనేలా, పోలింగ్‌ ఏజెంట్లు తమ విధులను నిర్వర్తించేలా, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్టమైన, స్వతంత్ర పర్యవేక్షణ అత్యంత అవసరం. ఇన్ని దౌర్జన్యాలతో ఎన్నికల ప్రక్రియను ఇంత దారుణంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటే, ప్రమాదంలో పడేది ప్రజాస్వామ్యమే అనేది వాస్తవం’’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

 

Democracy in Andhra Pradesh under @ncbn Garu is passing through a deeply disturbing phase. 𝗢𝗻𝗲 𝘀𝗵𝗼𝘂𝗹𝗱 𝗻𝗼𝘁 𝗳𝗼𝗿𝗴𝗲𝘁 𝘁𝗵𝗮𝘁, 𝗮𝗹𝗹 𝘁𝗵𝗲𝘀𝗲 𝘃𝗶𝗼𝗹𝗮𝘁𝗶𝗼𝗻𝘀 𝗮𝗿𝗲 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗻𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝘀𝘁𝗮𝗴𝗲 𝗶𝘁𝘀𝗲𝗹𝗳, 𝘁𝗵𝗲𝗻 𝗼𝗻𝗲 𝗰𝗮𝗻 𝗶𝗺𝗮𝗴𝗶𝗻𝗲 𝘄𝗵𝗮𝘁 𝗺𝗶𝗴𝗵𝘁 𝘂𝗻𝗹𝗲𝗮𝘀𝗵 𝗯𝘆 𝘁𝗵𝗲 𝘁𝗶𝗺𝗲 𝗽𝗼𝗹𝗹𝘀 𝗮𝗿𝗲 𝗰𝗼𝗻𝗰𝗹𝘂𝗱𝗲𝗱 𝗮𝗻𝗱 𝗿𝗲𝘀𝘂𝗹𝘁𝘀 𝗮𝗿𝗲 𝗱𝗲𝗰𝗹𝗮𝗿𝗲𝗱! Complete details and case studies are attached- https://t.co/NzzoV9preS @rashtrapatibhvn @narendramodi @AmitShah @indSupremeCourt @ECISVEEP @governorap @CEOAndhra

— YS Jagan Mohan Reddy (@ysjagan) October 31, 2026

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
YS Jagan Mohan Reddy
YSRCP
ap local body elections 2026
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మీరు చేసే నిర్బంధాలు దుర్మార్గం.. మీ పాలన హేయం: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అరాచ‌కం

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అరాచ‌కం

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ.. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అరాచ‌కం

ఏపీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీడీపీ అరాచ‌కం

విజయాన్ని ఆస్వాదించలేకపోతున్న వెన్నుపోటుపార్టీ

విజయాన్ని ఆస్వాదించలేకపోతున్న వెన్నుపోటుపార్టీ

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft