Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం
ADVERTISEMENT 

12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babu_0_0.jpg

11న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం

మంత్రివర్గ కూర్పుపై ఊహాగానాలు

తొలి విడతలో కొందరికే అవకాశం

సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆ రోజున రాజధాని ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

తొలి విడతలో 10 మందికి మంత్రులుగా అవకాశం..
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి విడతగా కొందరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. సుమారు పది మందికి తొలి విడతలో అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఐదారుగురు, జనసేన, బీజేపీ నుంచి నలుగురు ఆ జాబితాలో ఉండే అవకాశం ఉంది. తొలి విడతలో కింజరాపు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పి.నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు వంటి వారికి అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

జనసేన నుంచి పవన్‌కళ్యాణ్‌ మంత్రివర్గంలో చేరతారా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరితే చంద్రబాబుతోపాటే ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అలాగే, నాదెండ్ల మనోహర్‌ కూడా తొలివిడతలోనే ఛాన్స్‌ దక్కించుకోనున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున సుజనాచౌదరికి తొలి విడతలోనే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయమని చెబుతున్నారు. మంత్రి పదవులకు డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో తొలి విడతలో ముఖ్యులకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది సమయం తీసుకుని సామాజిక సమీకరణలు, సీనియారిటీ, జిల్లాల ప్రాతిపదికన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. 

టీడీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి?
మరోవైపు.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల్లో ప్రధాన పార్టీగా ఉండడంతో టీడీపీ లోక్‌సభ స్పీకర్‌ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ అగ్రనేతలు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్పీకర్‌ పదవిని తన వద్దే ఉంచుకోవాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఆ పదవి కావాలని గట్టిగా పట్టుబడితే ఏమైనా నిర్ణయం మారే అవకాశం ఉందంటున్నారు.

కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఐదుకి పైగా స్థానాలు కోరుతుండడం, కీలకమైన జల్‌శక్తి, రవాణా వంటి శాఖలు అడుగుతుండడంతో దానిపైనా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పౌర విమానయాన, ఉక్కు శాఖలను టీడీపీకి ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. శుక్రవారం జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం తర్వాత దీనిపై ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అసెంబ్లీ స్పీకర్‌గా ‘ఆనం’..?
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ స్పీకర్‌గా ఆనం రామనారాయణరెడ్డిని నియమించే యోచనలో టీడీపీ ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనైతే సభను హుందాగా నడిపిస్తారనే ఆలోచన ఉన్నట్లు భావిస్తున్నారు. ‘ఆనం’ కాదనుకుంటే గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పదవి తనకు కావాలని ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణరాజు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అందుకు చంద్రబాబు అంత సుముఖంగా లేరని సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Chandrababu Naidu
take oath
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.