ADVERTISEMENT
TS Assembly Constituencies
హైదరాబాద్: శాసనసభ ఎన్నికలలో నోటా ఓట్లు కీలకమని మరోసారి రుజువైంది. బరిలోకి దిగిన అభ్యర్థులు నచ్చకపోతే నన్ ఆఫ్ ది ఎబౌ (నోటా) గుర్తును నొక్కే అవకాశం ఉండటంతో ఈసారి నోటాకు ఓట్లు బాగానే...
నల్గొండ: ఉమ్మడి జిల్లాలో నోటాకు భారీగానే ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మొత్తం 11,297 ఓట్లు నోటాకు వచ్చాయి. భువనగిరి నియోజకవర్గంలో 882, ఆలేరు 659, సూర్యాపేట 760, నకిరేకల్...
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పోలీసు అధికారులకు...
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును ఎవరు కూడా ఆపలేరు. అంగ బలం,అర్థ బలం అన్ని ఉన్న నేను అవలీలగా...
నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుల కుమారులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డికి ప్రచారంలో అగ్రబాగాన నిలిచారు. సీనియర్ నాయకుడు యడవెల్లి రంగశాయిరెడ్డి కుమారుడు యడవెల్లి వల్లభ్‌రెడ్డి...
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు...
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి...
ఇల్లందకుంట/వీణవంక/కమలాపూర్: ‘ఓ వ్యక్తిని నమ్మి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేంటీ.. కేసీఆర్ దయతో మంత్రి పదవి అనుభవించిండు.. కానీ స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయం చేసిండు. ఒక్క అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపండి...
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ...
కామారెడ్డిటౌన్: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్’అంటూ రిటర్నింగ్ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం...
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం...
నిడమనూరు: తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాన్‌ఆయకట్టు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని ఊట్కూర్‌లో...
మహబూబాబాద్: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తా అని ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపూర్, రామారావుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బుర్గుపేట...
ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మొత్తం 3,11,000 ఓటర్లు ఉన్నారు...ఇందులో కమ్మ, మైనార్టీ, కాపు ఓట్లు ఏక్కువగా ఉన్నాయి. వీరిలో రెండు సామాజిక వర్గాలు ఎటువైపు చూస్తే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్-బీఆర్ఎస్లు...
మునుగోడు నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: భువనగిరి రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524 పురుషులు: 124,473 మహిళలు: 123,996 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి...
మరో రెండు వారాల్లోనే పోలింగ్ జరగనుంది. కానీ ఓ ప్రధాన పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు రాష్ట్రస్థాయిలో ప్రచారానికి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే కూర్చొని ప్రతీరోజు మీడియా సమావేశాలతోనే కాలం వెళ్లబుచ్చుతుండటం ఆ పార్టీ...
సినిమాలో... ‘‘తిన్నవా?’’ ‘‘ఆ... తిన్న...నువ్వు?’’ ‘‘నేనూ తిన్న... మీ ఇంట్ల ఏం కూర?’’ ‘‘తమాట పప్పు..ఇప్పుడు మీ గడియారంల టైమెంతయ్యింది?’’ ‘‘మా తాన పదకొండున్నరయ్యింది’’ ‘‘అరె... మాతన ఇంకా పదకొండు ఇరవైయయ్యిదే !!’’ సినిమాలోని...
హన్మకొండ: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 71 ఇళ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఐదవ వార్డు పరిధి లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది...
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల కంటే ముందే గులాబీ బాస్ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. గతంలో మాదిరిగానే...
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను ఉద్దేశించి ప్రతి ఓటరు ఈ అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును...
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చే తామే అంటూ కామెంట్స్ చేస్తూ...
‘‘ఆర్టీసీ బస్సులకూ..ఎన్నికలకూ ఎంతో సంబంధముంది. మరీ ముఖ్యంగా బస్సుల్లో రాసి ఉండే సూక్తులు, ఉపదేశాలతో’’ ఓ పెద్ద బాంబునే పేల్చాడు మా రాంబాబుగాడు. ‘‘మా మానాన మేము మాడిపోయిన మసాలా దోశె తింటుంటే..నువ్వొచ్చి ఎలక్షన్లకూ...
ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి తొలినుంచీ కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ చేదు అనుభవాలే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనను ధిక్కరించిన...
స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు గరంగరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. బ్యాలెట్ పోరులో ప్రజా తీర్పే ఇక మిగిలిఉంది. అధికార పార్టీకి అడ్డాగా ఉన్న ఘనపూర్ లో ఆ పార్టీలోనే గడబిడ...
ఇల్లందు బీఆర్ఎస్ అసమ్మతి మంటలు కాకరేపుతున్నాయి.. ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి మధ్య వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యా గొడవతో హైకమాండ్ సీన్లోకి ఎంటరైంది. అసమ్మతి నేతల బుజ్జగింపులూ మొదలయ్యాయి...
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల ఖర్చు ఏ మేరకు ఉండాలి, పరిమితిని ఎలా విధించాలి, అనే అంశంపై ఎన్నో ఏళ్ళుగా చర్చ నడుస్తోంది. ఈ దిశగా అభిప్రాయాలు చెప్పండంటూ.. కేంద్ర...
హైదరాబాద్: నాపై నమ్మకం ఉంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సాయన్న కుటుంబం మా కుటుంబమే...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ...
భద్రాచలం (ఎస్టి) నియోజకవర్గం భద్రాచలం గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో పొడెం వీరయ్య మూడోసారి విజయం సాదించారు .గతంలో ఆయన ములుగు నియోజకవర్గంలో 1999,2004లలో కాంగ్రెస్ ఐ పక్షాన గెలవగా,ఈసారి భద్రాచలం నుంచి విజయం సాదించడం...
అశ్వారావుపేట (ఎస్టి) అశ్వారావుపేట గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలంగాణ లో ఈ పార్టీ గెలిచిన రెండు సీట్లలో ఇది ఒకటి. మరొకటి సత్తుపల్లి. నాగేశ్వరరావు తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది...
కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ ఐ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంలో నాలుగోసారి విజయం సాదించారు. గతంలో ఆయన 1989, 1999, 2004లలో గెలుపొందారు. ఈసారి ఆయన టిఆర్ఎస్ ప్రత్యర్ది...
సత్తుపల్లి (ఎస్సి) నియోజకవర్గం సత్తుపల్లి రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి పక్షాన సండ్ర వెంకట వీరయ్య మరోసారి గెలిచారు. దీంతో ఆయన నాలుగోసారి గెలిచినట్లయింది. గతంలో ఒకసారి సిపిఎం తరపున, ఆ తర్వాత టిడిపి పక్షాన...
వైరా (ఎస్టి) నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో సుజాతనగర్ నియోజకవర్గం రద్దై వైరా నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. వైరా గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీచేసిన లావుడ్యా రాములు విజయం సాదించారు...
మధిర (ఎస్సి) నియోజకవర్గం మధిర రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క మూడోసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది లింగాల...
పాలేరు నియెఓజకవర్గం పాలేరు నియెఓజకవర్గంలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన కందాళ ఉపేందర్ రెడ్డి తొలిసారి గెలిచారు. ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాదించారు...
ఖమ్మం నియోజకవర్గం ఖమ్మంలో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పువ్వాడ అజయ్ కుమార్ టిడిపి అభ్యర్ది, మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరావుపై 10991 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అజయ్ కుమార్...
ఇల్లెందు (ఎస్టి) నియోజకవర్గం ఇల్లెందు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్ధిగా పోటీచేసిన బానోత్ హరిప్రియ నాయక్ గెలుపొందారు. ఆమెకు 2907 ఓట్ల ఆదిక్యత వచ్చింది. ఇల్లెందు సిటింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్ది...
పినపాక (ఎస్టి) నియోజకవర్గం పినపాక రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పార్టీ తరపున పోటీచేసిన రేగ కాంతరావు రెండోసారి విజయం సాదించారు. ఆయన 2009లో తొలిసారి గెలవగా, 2018లో తన సమీప టిఆర్ఎస్...
ములుగు (ఎస్టి) నియోజకవర్గం ములుగు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన దళవాయి అనసూయ ఉరఫ్ సీతక్క రెండోసారి గెలిచారు. 2009లో ఆమె టిడిపి పక్షాన ఒకసారి గెలవగా, 2018లో కాంగ్రెస్ ఐలో...
భూపాలపల్లి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో శాయంపేట నియోజకవర్గం రద్దై భూపాలపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి రెండోసారి గెలిచారు. స్పీకర్ పదవిలో...
వర్దన్నపేట (ఎస్సి) నియోజకవర్గం వర్ధన్న పేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆరూరి రమేష్ రెండోసారి విజయం సాదించారు.ఆయనకు 97670 ఓట్ల ఆదిక్యత వచ్చింది. 2014లో ఆయనకు 86వేలపైచిలుకు మెజార్టీ వస్తే...
వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన నన్నపునేని నరేందర్ విజయం సాదించారు. వరంగల్ మేయర్‌గా ఉన్న నరేందర్ 2018లో అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన...
వరంగల్ వెస్ట్ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన వినయ్ భాస్కర్ మరోసారి విజయం సాదించారు. ఒక ఉప ఎన్నికతో సహా ఆయన నాలుగుసార్లు గెలిచినట్లు అయింది. వినయ్ భాస్కర్ తన...
పరకాల నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన చల్లా దర్మారెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ధర్మారెడ్డి టిడిపి తరపున గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. 2018లో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి...
నర్సంపేట నియోజకవర్గం నర్సంపేటలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన పెద్దిరెడ్డి సుదర్శనరెడ్డి తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డిపై 16949 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టిఆర్ఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న సుదర్శనరెడ్డి...
మహబూబాబాద్ (ఎస్టి) నియోజకవర్గం మహబూబాబాద్ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన శంకర్ నాయక్ రెండోసారి విజయం సాదించారు. ఈయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి బలరామ్...
డోర్నకల్ (ఎస్టి) నియోజకవర్గం డోర్నకల్ రిజర్వుడ్ నియోజకవర్గంలో గిరిజన నేత డి.ఎస్.రెడ్యా నాయక్ ఆరోసారి విజయం సాదించారు. గతంలో ఈ నియోజకవర్గం జనరల్ సీటుగా ఉన్నప్పుడు ఈయన నాలుగు సార్లు గెలవడం ఒక ప్రత్యేకతగా...
పాలకుర్తి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చెన్నూరు నియోజకవర్గం రద్దై పాలకుర్తి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. పాలకుర్తిలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు మరోసారి విజయం సాదించడం ద్వారా...
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్ వస్తుందా...
జనగామ నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో చేర్యాల నియోజకవర్గం రద్దై జనగామ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. జనగామ నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప...
ఆలేరు నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం నుంచి టిఆర్ ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన గొంగిడి సునీతారెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆమె తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 32062 ఓట్ల...
తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి రిజర్వుడు నియోజకవర్గంలో విద్యార్ది నేత గాదరి కిషోర్ రెండోసారి విజయం సాదించారు. ఆయన కాంగ్రెస్ ఐ అభ్యర్ది అద్దంకి దయాకర్ ను ఓడిరచారు. దయాకర్ కూడా తెలంగాణ ఉద్యమంలో జెఎసిలో...
నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో రామన్నపేట నియోజకవర్గం రద్దై నకిరేకల్ (ఎస్సి) నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. నకిరేకల్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన చిరుమర్తి లింగయ్య...
భువనగిరి నియోజకవర్గం భువనగిరి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన పైళ్ల శేఖర్ రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది కుంభా అనిల్‌కుమార్ రెడ్డిపై 24063 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు...
మునుగోడు నియోజకవర్గం మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి...
నల్గొండ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన కంచర్ల భూపాల్ రెడ్డి సంచలన విజయం సాదించారు. నల్గొండలో స్ట్రాంగ్ మాన్‌గా పేరొందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆయన 23698 ఓట్ల ఆదిక్యతతో...
సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేటలో టిఆర్ఎస్ పక్షాన మరోసారి పోటీచేసిన మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాదించారు. దీంతో ఆయన రెండుసార్లు గెలిచినట్లు అయింది. ఆ తర్వాత మళ్లీ కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు...
కోదాడ నియోజకవర్గం కోదాడ నియోజకవర్గంలో అనూహ్యంగా బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టిడిపి నుంచి టిఆర్ఎస్లోకి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే...
హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ నియోజకవర్గంలో పిసిసి అద్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి 2018లో ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో కోదాడ నుంచి రెండుసార్లు, తదుపరి హుజూర్నగర్ నుంచి వరసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు...
మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారిగెలిచారు. ఆయన 2014లో కాంగ్రెస్ ఐ టిక్కెట్‌పై విజయం సాదించి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీచేసి...
నాగార్జున సాగర్ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి 2018లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ది నోముల నరసింహయ్య తన సమీప ప్రత్యర్ది, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డిపై విజయం సాదించినా, ఆయన అనతికాలంలో అనారోగ్యంతో...
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం దేవరకొండ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆర్.రవీంద్ర కుమార్ మూడోసారి విజయం సాదించారు.2004,2014లలో సిపిఐ పక్షాన గెలిచిన రవీంద్ర కుమార్ 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 2014లో...
కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ అంతటా 2018 ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజనం వీచినా కొల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత, అప్పటి వరకు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసిన...
షాద్ నగర్ నియోజకవర్గం షాద్‌నగర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే సి.ప్రతాప్ రెడ్డిపై 20556...
కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జైపాల్ యాదవ్ మూడోసారి గెలిచారు. గతంలో రెండుసార్లు టిడిపి పక్షాన గెలిచిన యాదవ్, టిఆర్ఎస్ లో కి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. జైపాల్...
అచ్చంపేట (ఎస్సి) నియోజకవర్గం అచ్చంపేట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రెండోసారి గెలిచారు. టిఆర్ఎస్ పక్షాన మళ్లీ పోటీచేసిన బాలరాజు తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే...
నాగర్ కర్నూల్ నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డిపై 54354 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు...
అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గం అలంపూర్ రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మల్లెపోగు అబ్రహం గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన ఒకసారి గెలిచిన అబ్రహం 2018లో టిఆర్ఎస్లో చేరి పోటీచేసి విజయం సాదించారు...
గద్వాల నియోజకవర్గం గద్వాల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి డి.కె.అరుణపై 28260 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గద్వాలలో గట్టి నేతగా...
వనపర్తి నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయం సాదించారు. ఆయన మొదటి సారి గెలిచారు. 2014 నుంచి ఐదేళ్ళ తెలంగాణ ప్రణాళికా అభివృద్ది మండలి ఉపాద్యక్షుడుగా...
మక్తల్ నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి మూడోసారి విజయం సాదించారు. గతంలో ఆయన ఒక ఉప ఎన్నికతో సహా రెండు సార్లు కాంగ్రెస్ఐ పక్షాన పోటీచేసి గెలిచారు...
దేవరకద్ర నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అమరచింత నియోజకవర్గం రద్దై దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది దేవరకద్ర నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది...
జడ్చర్ల నియోజకవర్గం మంత్రి పదవిలో ఉంటూ టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మూడోసారి విజయం సాదించారు. కాని 2018లో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. లక్ష్మారెడ్డి తన సమీప...
మహబూబ్‌నగర్ నియోజకవర్గం గెజిటెడ్ అదికారుల సంఘం అధ్యక్షుడుగా తెలంగాణ ఉద్యమంలో ఒక భూమిక పోషించిన మహబూబ్‌నగర్ సిటింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ రెండోసారి విజయం సాదించారు. ఆ తర్వాత ఆయనకు కెసిఆర్ క్యాబినెట్లో మంత్రి...
నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాజేంద్రరెడ్డి రెండోసారి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి తరపున పోటీచేసి గెలిచి, తదుపరి పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. రాజేందర్ రెడ్డి తన...
కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన పట్నం నరేంద్రరెడ్డి, కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డిపై 9319 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేంద్ర రెడ్డిని...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం కంటోన్మెంట్ని రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి జి.సాయన్న ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఈసారి టిఆర్ఎస్ తరుపున గెలిచారు. 2014లో ఆయన టిడిపి అభ్యర్దిగా...
సికింద్రాబాద్ నియోజకవర్గం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న పద్మారావుగౌడ్ 2018లో మూడోసారి గెలిచారు. ఆయన ఈసారి మంత్రి పదవిని పొందలేకపోయారు. అయితే ఉపసభాపతి పదవి దక్కించుకున్నారు. పద్మారావు గౌడ్ 2018...
బహదూర్‌పుర నియోజకవర్గం బహదూర్‌పుర నియోజకవర్గంలో నాలుగోసారి మజ్లిస్ నేత మౌజం ఖాన్ విజయం సాదించారు. గతంలో ఉన్న అసిఫ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలోను, ఆ తర్వాత బహదూర్‌పుర నియోజకవర్గం నుంచి మూడుసార్లుగా...
యాకూత్‌పుర నియోజకవర్గం యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి మజ్లిస పక్ష అభ్యర్దిగా అహ్మద్ పాషా ఖాద్రి నాలుగోసారి గెలిచారు. ఆయన అంతకుముందు మూడుసార్లు చార్మినార్ నుంచి విజయం సాదించారు. యాకుత్‌పుర నుంచి ఐదుసార్లు గెలిచిన ముంతాజ్...
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం శాసనసభలో మజ్లిస్ పక్ష నేత, మజ్లిస్ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి ఐదోసారి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరసగా 1999 నుంచి...
చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ...
గోషామహల్ నియోజకవర్గం గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ది, సిటింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెండోసారి గెలిచారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది,మాజీ ఎమ్మెల్యే...
కార్వాన్ నియోజకవర్గం కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ అభ్యర్ధి, సిటింగ్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ది, బిజెపి నేత అమర్‌సింగ్‌పై 49692 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు...
నాంపల్లి నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో అసిఫ్‌నగర్ నియోజకవర్గం రద్దై నాంపల్లి నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. నాంపల్లి నియోజకవర్గంలో మజ్లిస్ నేత జాఫర్ హుస్సేన్ రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్...
సనత్ నగర్ నియోజకవర్గం సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి గెలిచారు. దీనితో ఆయన ఐదుసార్లు గెలిచినట్లయింది. ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు సికింద్రాబాద్ నుంచి, రెండుసార్లు సనత్‌నగర్...
జూబ్లిహిల్స్ నియోజకవర్గం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి పక్షాన పోటీచేసి గెలుపొందారు. కాని తరుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో...
ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఈ సారి మాజీ మంత్రి దానం నాగేందర్ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది, 2014లో గెలిచిన చింతల రామచంద్రారెడ్డిపై...
అంబర్‌పేట నియోజకవర్గం 2009లో నియోజకవర్గ పునర్ విభజనలో హిమాయత్‌నగర్ నియోజకవర్గం రద్దై అంబర్‌పేట నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. అంబర్‌పేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డిని టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన...
మలక్‌పేట నియోజకవర్గం మలక్‌పేట సిటింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ నేత అహ్మద్ బలాలా మూడోసారి గెలు పొందారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది ముజఫర్ అలీపై 17572 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బలాలాకు 53281...
ముషీరాబాద్ నియోజకవర్గం ముషీరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ముఠా గోపాల్ ఎన్నికయ్యారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది అనిల్‌కుమార్‌పై 36888 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజెపి పక్షాన...
తాండూరు నియోజకవర్గం తెలంగాణ అంతటా టిర్ఎస్ గాలివీస్తే తాండూరులో మాత్రం 2018 ఎన్నికల సమయం వరకు మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి ఓటమి పాలవడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో బలమైన నేతగా తయారైన ఆయన...
వికారాబాద్ (ఎస్సి) నియోజకవర్గం వికారాబాద్ రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ది డాక్టర్ మెతుకు ఆనంద్ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ ఐ నేత, మాజీ మంత్రి ప్రసాదకుమార్‌పై 3122 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సిటింగ్...
పరిగి నియోజకవర్గం పరిగి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన కొప్పుల మహేష్ రెడ్డి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కుమారుడు. హరీశ్వర్ రెడ్డి గతంలో ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు...
చేవెళ్ల (ఎస్సి ) నియోజకవర్గం చేవెళ్ల రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కాలె యాదయ్య మరోసారి గెలిచారు. ఆయ తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి కె.ఎస్. రత్నంపై 33747 ఓట్ల మెజార్టీతో గెలిచారు...
శేరీలింగంపల్లి నియోజకవర్గం శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాందీ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గాందీ...
రాజేంద్ర నగర్ నియోజకవర్గం రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన టి.ప్రకాష్ గౌడ్ తన సమీప టిడిపి ప్రత్యర్ది గణేష్ గుప్త పై 57331 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. మహాకూటమిలో...
మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాలుగోసారి విజయం సాదించి తన సత్తా చాటారు. హైదరాబాద్ పరిసరాలలో మొత్తం టిఆర్ఎస్ హవా కొనసాగగా మహేశ్వరంలో మాత్రం కాంగ్రెస్ ఐ పక్ష...
ఎల్బి నగర్ నియోజకవర్గం ఎల్బినగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన డి.సుధీర్ రెడ్డి 17251 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ ప్రత్యర్ది రామ్మోహన్ గౌడ్‌పై గెలుపొందారు. సుధీర్ రెడ్డి 2009లో మొదటి సారి...