Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ రానున్నది ఎవరు..?
ADVERTISEMENT 

ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థికి హ్యాట్రిక్ అవకాశం...మరి నెక్స్ట్ రానున్నది ఎవరు..?

Politics Sakshi User Sakshi Sakshi Time Aug 17, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kha.jpg

ఖమ్మం నియోజకవర్గం

ఖమ్మంలో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన పువ్వాడ అజయ్‌ కుమార్‌ టిడిపి అభ్యర్ది, మాజీ ఎమ్‌.పి నామా నాగేశ్వరావుపై 10991 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. అజయ్‌ కుమార్‌ గతసారి కాంగ్రెస్‌ ఐ పక్షాన గెలిచి ఆ తర్వాత కాలంలో టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2018లో  టిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ పై మరోసారి గెలిచారు. అజయ్‌కుమార్‌కు 102760 ఓట్లు రాగా, నామా నాగేశ్వర రావుకు 81738 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన మిగిలిన అభ్యర్దులకన్నా నోటాకు 3500 ఓట్లు రావడం విశేషం.

అజయ్‌ కుమార్‌  2018లో గెలిచిన తర్వాత కెసిఆర్‌ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. కాగా నామా నాగేశ్వరరావు టిడిపికి గుడ్‌ బై చెప్పి టిఆర్‌ఎస్‌లో చేరి 2019లో ఖమ్మం నుంచి లోక్‌ సభకు పోటీచేసి గెలిచారు. తదుపరి లోక్‌ సభలో టిఆర్‌ఎస్‌ పక్ష నేత అయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో 2014లో  సీనియర్‌ టిడిపి నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం చెందారు. కాంగ్రెస్‌ ఐ  తరపున పోటీచేసిన పువ్వాడ అజయ్‌ చేతిలో 5609 ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. పువ్వాడ అజయ్‌ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరావు కుమారుడు. ఆయన కొంతకాలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో ఉన్నారు.

తెలంగాణ ఏర్పాటు ప్రకటన తర్వాత అజయ్‌ కాంగ్రెస్‌ ఐలో చేరి ఖమ్మం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి 2018లో కూడా గెలిచారు. తుమ్మల గతంలో సత్తుపల్లి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. సత్తుపల్లి రిజర్వుడ్‌ కావడంతో ఖమ్మంకు మారి రెండువేల తొమ్మిదిలో విజయం సాధించారు. కాని 2014లో  ఓడిపోయారు. తదుపరి తుమ్మల టిఆర్‌ఎస్‌లోకి మారి ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టారు. తదుపరి పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. 2018లో పాలేరులో ఓటమి చెందారు. తుమ్మల గతంలో ఎన్‌.టి.ఆర్‌., చంద్రబాబుల క్యాబినెట్‌లలో, కెసిఆర్‌ క్యాబినెట్‌లోను మంత్రిగా ఉన్నారు.

కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా ఉన్న ఖమ్మంలో10సార్లు వామపక్షాలు గెలుపొందాయి. 1952, 57లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. పిడిఎఫ్‌, సిపిఐ కలిసి ఐదుసార్లు, సిపిఎం నాలుగుసార్లు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ఐ  నాలుగుసార్లు టిడిపి ఒకసారి, టిఆర్‌ఎస్‌ ఒకసారి గెలుపొందాయి. 2009లో ఖమ్మం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్‌ ఐ  టిక్కెట్‌ కోసం ప్రయత్నించిన సత్తుపల్లి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలగం వెంకటరావు టిక్కెట్‌ రాకపోవడంతో తిరుగుబాటుచేసి ఇండిపెండెంటుగా పోటీచేశారు. 2014లో టిఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై కొత్తగూడెంలో పోటీచేసి గెలుపొందారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం ఒకసారి శాసనసభకు, మరోసారి లోక్‌ సభకు గెలుపొందారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గతంలో పనిచేసిన ప్రముఖ నేత నల్లమల గిరిప్రసాద్‌ ఖమ్మంలో ఒకసారి గెలుపొందారు. ఆయన ఒకసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. సిపిఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు రెండుసార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 1967,72లలో ఖమ్మంలో గెలిచిన మహ్మద్‌ రజబ్‌ అలీ, ఆ తర్వాత సుజాతనగర్‌లో నాలుగుసార్లు గెలిచి జిల్లాలో ఆరుసార్లు గెలుపొందిన నేతగా నమోదయ్యారు.

1957లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తేళ్ళ లక్ష్మీకాంతమ్మ 1978లో హైదరాబాద్‌ నగరంలో మరోసారి గెలిచారు.  ఆమె ఖమ్మం నుంచి మూడుసార్లు లోక్‌సభకు కూడా నెగ్గారు. టిడిపి 1983 నుంచి ఆయా సందర్భాలలో మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చినప్పటికీ స్వయంగా మొదటిసారిగా 2009లో ఖమ్మంలో గెలిచింది. ఆ తర్వాత రెండు ఎన్నికలలో ఓటమి చెందింది. మంచికంటి రామకిషన్‌రావు సిపిఎం పక్షాన రెండుసార్లు గెలిచారు. ఖమ్మంలో తొమ్మిది సార్లు కమ్మ, ఒకసారి రెడ్డి, రెండుసార్లు బ్రాహ్మణ, మూడుసార్లు ముస్లింలు గెలుపొందారు.

ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Khammam Assembly Constituency
TS Assembly Constituencies
Khammam Common Districts
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

ఈ అభ్యర్థులు మాకు నచ్చలే..

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

Nalgonda: నోటాకు 11,297 ఓట్లు

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

పొలిటీషియన్‌ను ఓడించిన పోలీస్‌

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

బాల్క సుమన్‌ను అదే ముంచేసిందా?

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

కాంగ్రెస్‌లో ‘సన్నాఫ్‌ సీనియర్లు’

ఖమ్మంలో ఎవరిదో పైచేయి?

ఖమ్మంలో ఎవరిదో పైచేయి?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.