Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Politics
  3. బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
ADVERTISEMENT 

బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

Politics Sakshi User Sakshi Sakshi Time Mar 23, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BRS_20MP_204.jpg

మాట వినని వారిని లొంగదీసుకునేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు

ఎన్‌డీఏ పదేళ్ల పాలనలో దేశవ్యాప్తంగా 2,954 దాడులు

ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా, సురేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వద్దిరాజు

సాక్షి, న్యూఢిల్లీ: ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలను, నేతల్ని లొంగదీసుకునే రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆరోపించారు. దేశంలో జరుగుతున్న దాడులను ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

గత యూపీఏ హయాంలో కంటే ఎక్కువ దాడులు ప్రస్తుత ఎన్‌డీఏ హయాంలో జరిగాయని ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న పాలసీలో అవినీతి జరిగిందని, ఆధారాల్లేకుండా ఎమ్మెల్సీ కవితను రాత్రికి రాత్రి అరెస్టు చేయడం అప్రజాస్వామికమని నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకే కవిత అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్‌ పాలసీ లాంటి ఎన్నో పాలసీలను కేంద్ర ప్రభుత్వం సైతం ప్రవేశపెట్టిందన్నారు. 

ఎన్‌డీఏ హయాంలో 2,954 దాడులు

టీవీ సీరియల్‌ మాదిరిగా సాగదీసిన కేసులో ఎన్నికలు వచ్చేసరికి ఈడీ హుటాహుటిన కవితను అరెస్టు చేయడం ఎంత అక్రమమో తెలుస్తోందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. యూపీఏ çపదేళ్ల కాలంలో ఈడీ 200 కేసులు నమోదు చేస్తే.. ఎన్‌డీఏ పాలనలో 2,954 కేసులు బనాయించిందని ఆరోపించారు. ఇలా సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ నేతలను బెదిరింపులకు గురిచేస్తూ లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. లిక్కర్‌ కేసులో కవిత బాధితురాలే తప్ప.. బాధ్యురాలు, నిందితురాలు కాదన్నారు.

ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో దాడులు చేయించడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఎంపీ సురేశ్‌ రెడ్డి అన్నారు. కవితకు డబ్బు ముట్టినట్లుగా గానీ, ఆమె ఇచ్చిన ట్లుగా గానీ ఎక్కడా ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఓ పక్క శక్తి అంటూ మాట్లాడుతున్న ప్రధాని మోదీ మహిళలపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. మోదీ తెలంగాణ, ఢిల్లీపై దాడి చేయిస్తూ ఇటు కవితను, అటు కేజ్రీవాల్‌ను దొంగల్లా అరెస్టు చేయించారని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. న్యాయ స్థానాలపై తమకు నమ్మకం ఉందని ఈ వ్యవహారంపై ఎందాకైనా పోరాడతామన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఎంపీలు ధీమా వ్యక్తం చేశారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Nama Nageswara Rao
BRS
Lok Sabha Elections 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలికకు న్యాయం జరగడం లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

గులాబీ గూటిలో 'కొత్త లెక్కలు'!

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

ఈ విషయాన్ని కేసీఆర్ చెప్పమన్నారు: కేటీఆర్‌

దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది

దాన్యం కొనుగోళ్ల నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది

‘సర్‌’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర

‘సర్‌’ ముసుగులో ఓట్ల తొలగింపు కుట్ర

‘రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు’

‘రేవంత్ మన ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారు’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.