Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. మీకు.. ఊబకాయం వస్తుందా?
ADVERTISEMENT 

మీకు.. ఊబకాయం వస్తుందా?

National Sakshi User Sakshi Sakshi Time Jul 24, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
obesity.jpg

ఊబకాయం ముప్పును బాల్యంలోనే పసిగట్టేలా 

500 సంస్థలు చేపట్టిన ప్రపంచస్థాయి అధ్యయనం 

ఇందులో చేతులు కలిపిన ‘సీఎస్‌ఐఆర్‌–సీసీఎంబీ’ 

వివిధ దేశాల ప్రజల జన్యు సమాచారంపై పరిశోధన 

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఊబకాయం.. దాదాపు ప్రతి ఇంటా వింటున్న ఆరోగ్య సమస్య. ఇదొక్కటే ఉండదు.. గుండెజబ్బులు, కేన్సర్లు, మధుమేహం లాంటి వాటినీ ఒంటికి తీసుకొస్తుంది. మరి, అలాంటి స్థూలకాయం మనకు వస్తుందో రాదో బాల్యంలోనే తెలిసిపోతే? ఎంచక్కా నివారణ చర్యలు తీసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం సంస్థ, హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌–సీసీఎంబీ భాగస్వామిగా ఉన్న ప్రపంచస్థాయి అధ్యయనం ఈ విషయంలో విజయం సాధించింది. వీళ్లు రూపొందించిన పాలిజెనిక్‌ రిస్క్‌ స్కోర్‌ (పీఆర్‌ఎస్‌).. స్థూలకాయం ముప్పును ముందే పసిగడుతుంది. పెరిగి పెద్దయ్యాక ఊబకాయం వస్తుందా రాదా అనే విషయాన్ని బాల్యంలోనే తెలుసుకునే కిటుకు దొరికింది. 

అంటే.. చిన్నప్పుడే తెలిస్తే.. భవిష్యత్తులో స్థూలకాయం రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చన్నమాట. ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా సాగిన సుదీర్ఘ అధ్యయనం సాధించిన విజయం. ఇందులో భాగంగా స్థూలకాయానికి జన్యుపరమైన కొత్త కారణాలు తెలుసుకునే తెలుసుకునేందుకు, ఐదు సంవత్సరాల వయసు నుంచే ఊబకాయం వచ్చే అవకాశాన్ని అంచనా వేయగల పాలిజెనిక్‌ రిస్క్‌ స్కోర్‌ను (పీఆర్‌ఎస్‌) రూపొందించారు. ఇందులో మనదేశం నుంచి మైసూరు, ముంబై, పుణే నగరాలకు చెందినవారు పాల్గొన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 51 లక్షల మంది వ్యక్తుల జన్యు సమాచారాన్ని ఉపయోగించి పీఆర్‌ఎస్‌ మోడల్‌ రూపొందించారు. గతంలో రూపొందించిన మోడల్స్‌ కంటే ఇది రెండింతలు ప్రభావవంతంగా ఉందని తేలింది.  సీఎస్‌ఐఆర్‌–సీసీఎంబీతో సహాఊబకాయంపై చేపట్టిన ఈ అధ్యయనంలో హైదరాబాద్‌ కు చెందిన సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీఎస్‌ఐఆర్‌– సీసీఎంబీ), ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసు పత్రి, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ సహా ప్రపంచ వ్యాప్తంగా 500 ప్రముఖ సంస్థలకు చెందిన 600 మందికి పైగా శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. 

ఈ అధ్యయనంలో పాల్గొన్న 51 లక్షల మందిలో.. ఆఫ్రికన్లు (4.6%ప్రజలు), అమెరికన్లు (14.4%), తూర్పు ఆసియా (8.4%), ఐరోపా (71.1%), దక్షిణాసియా వాసులు(1.5%) ఉన్నారు. ప్రముఖ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. జన్యువుల కారణంగానే ఊబకాయం ముప్పు అత్యధికంగా ఉందని వెల్లడించింది. అంటే తల్లి/తండ్రికి ఈ సమస్య ఉంటే వారసత్వంగా వచ్చే అవకాశాలే అధికం. కానీ వీరు జీవనశైలి మార్పులతో దీన్ని దూరం చేసుకోవచ్చు. అంటే శారీరక శ్రమ చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వంటివి చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ వీరు మానేస్తారో మళ్లీ వెంటనే తిరిగి బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది.

ముందస్తు హెచ్చరికగా..
ఐదు సంవత్సరాల వయసులో ఉన్న ఒకరికి.. వారు యుక్త వయసుకు వచ్చేసరికి ఊబకాయం వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని అంచనా వేయగల సామర్థ్యం ఈ స్కోర్‌కు ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ముందస్తు హెచ్చరిక సాధనంగా పీఆర్‌ఎస్‌ పనిచేస్తుంది. అంటే సమస్య వస్తుందని తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచే సరైన ఆహారం, వ్యాయామం ద్వారా సమస్య నుంచి గట్టెక్కవచ్చన్నమాట. ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత విస్తృత విభిన్న తరాల అధ్యయనాలలో ఇది ఒకటి. 

యూరోపియన్లలో ఊబకాయానికి కారణమైన జన్యు రకాలు.. భారతీయులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఈ అధ్యయనంలో గుర్తించారు. భవిష్యత్తులో భారతీయులకు ప్రత్యేకంగా పీఆర్‌ఎస్‌ రూపొందించాలని మన శాస్త్రవేత్తలు భావించారు. అంతేకాదు, ఈ స్కోరుతో కేవలం ఊబకాయమే కాదు.. గుండె సంబంధ సమస్యలనూ పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, అందుకు పరిశోధనలు చేయాల్సి ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నవారి సంఖ్య 1990లో 92.9 కోట్లు. 2021 నాటికి 260 కోట్లకు పెరిగిందని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ళీ    2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువు, ఊబకాయం బారిన పడవచ్చని ప్రపంచ ఊబకాయ సమాఖ్య హెచ్చరించింది.

అధిక బరువు, ఊబకాయం ఉన్న పెద్దలలో సగం కంటే ఎక్కువ మంది చైనా, భారత్, యూఎస్, బ్రెజిల్, రష్యా, మెక్సికో, ఇండోనేషియా, ఈజిప్ట్‌ దేశాలలో నివసిస్తున్నారు.ళీ    2035 నాటికి 79% పెద్దలు, 88% మంది పిల్లలు ఊబకాయం, అధిక బరువుతో తక్కువ–మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తారు. 7% దేశాలు మాత్రమే ఊబకాయంతో ముడిపడిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి తగిన ఆరోగ్య వ్యవస్థలను కలిగి ఉన్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
obesity
study
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

పాపులర్‌ వెయిట్‌ లాస్‌ మందులు, షాకింగ్‌ స్టడీ

పాపులర్‌ వెయిట్‌ లాస్‌ మందులు, షాకింగ్‌ స్టడీ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.