Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Health
  3. ఆలింగనంలో అపరిమితమైన ఆరోగ్య శక్తి!
ADVERTISEMENT

ఆలింగనంలో అపరిమితమైన ఆరోగ్య శక్తి!

Health Sakshi User Sakshi Sakshi Time Oct 11, 2026 04:48 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
spl.jpg

ఆరోగ్యం కోసం మనం అనేక హెల్త్‌ సప్లిమెంట్లు, వ్యాయామం, వివిధ ఆరోగ్య సలహాలపై ఎంతో శ్రద్ధ పెడు­తుంటాం. కానీ మనిషికి అత్యంత ప్రా­థమిక అవసరాల్లో ఒకటైన ఆప్యాయ­త, అనుబంధం గురించి మాత్రం కొన్ని­సార్లు మర్చిపోతుంటాం. ఈ ఆప్యా­యత అనుబంధాలను వ్యక్తపరిచే ఆలింగనం ఆరోగ్యకర జీవితానికి చాలా కీలకమని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మనిషిని మనిషికి దగ్గరగా చేసే భావోద్వేగ వ్యక్తీకరణ అయిన ఆలింగ­నంలో అపరిమితమైన శక్తి దాగి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాసేపు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం లేదా కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. 

ప్రేమపూర్వకంగా తాకడం, ఆప్యాయంగా హత్తుకోవడం అనే ప్రక్రియ శరీరం ఒత్తిడికి స్పందించే తీరును మార్చగలదని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన ఒత్తిడి కలిగే పరిస్థితి తర్వాత ఓ కౌగిలింత లేదా ఓ ఆత్మీయ స్పర్శ వల్ల దేహంలో విడుదలయ్యే కార్టిసాల్‌ (స్ట్రెస్‌ హార్మోన్‌) మోతాదులు తగ్గుతాయని.. ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

గత రెండేళ్లుగా దాదాపు 137 అధ్యయన ఫలితాలను విశ్లేషించిన మెటా–అనాలిసిస్‌లో ఆప్యాయకర శారీరక స్పర్శ కలిగే ప్రయోజనాలు ఒత్తిడి తగ్గించడమే కాకుండా నొప్పి, ఆందోళన, డిప్రెషన్‌ లక్షణాల వంటివి కూడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. అందుకే మన మనసుకు నచ్చిన వ్యక్తిని కాస్త దగ్గరగా హత్తుకోవడం ద్వారా అతడికీ, మనకూ పైసా ఖర్చులేకుండా ఆరోగ్యం సమకూరితే అంతకంటే కావాల్సిందేముంటుంది అంటున్నారు పరిశోధకులు.

స్క్రీన్‌లకు అతుక్కుపోయే యువతలో డిప్రెషన్‌ !
రోజూ గంటల తరబడి స్క్రీన్‌­లను చూడటం యువత మాన­సిక ఆరోగ్యంపై దుష్ప్ర­భావం చూపవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ దురలవాటు యువతలో డిప్రెషన్, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యల ముప్పును రెట్టింపు చేయవచ్చని ఓ కొత్త పరిశోధన సూచిస్తోంది. దాదాపు 90 లక్షల మందికిపైగా వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించిన ఈ అధ్యయనంలో టీవీ, కంప్యూటర్, మొబైల్‌ స్క్రీన్‌లను ఎక్కువ సేపు చూసే వారిలో తమను తాము గాయపరుచుకునే ధోరణి, ప్రవర్తనా సమస్యలు, నిద్ర సమస్యలు కూడా ఎక్కువగా కనిపించినట్లు తేలింది. 

అయితే కేవలం స్క్రీన్‌లను ఎక్కువగా ఉపయోగించడమే ఈ సమస్యలకు కారణమని ఈ అధ్యయనం నిరూపించనప్పటికీ స్క్రీన్‌ టైమ్‌కు, మానసిక సమస్యలకు మధ్య సంబంధం కనిపిస్తుండటంతో ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు డిజిటల్‌ ఉత్పత్తులపై మరింత నియంత్రణపూర్వకమైన ధోరణిని అనుసరించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు సూచిస్తున్నారు. యువతను ఈ ముప్పు నుంచి రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ ఒప్పందం అవసరమన్నది కూడా వారి అభిప్రాయం.

ఇష్టమైన సంగీతంతో నొప్పుల తగ్గుదల?
ఎమ్మారై స్కాన్‌ కోసం సూది గుచ్చినప్పుడు కలిగే నొప్పిని ఇష్టమైన సంగీతం వినడం తగ్గించవచ్చని ఒక అధ్యయనం సూచిస్తోంది. అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్యకు ఏ రకమైన సంగీతం ఎక్కువగా ఉపయోగపడుతుందనే విషయంలో పరిశోధకుల మధ్య ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మారై స్కాన్‌ సమయంలో రక్తనాళంలోకి సూది (ఇంట్రావీనస్‌ కాన్యులేషన్‌) గుచ్చేటప్పుడు కలిగే నొప్పిపై సంగీతం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోడానికి పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. 

వైద్య ప్రక్రియల సమయంలో నొప్పిని తగ్గించేందుకు రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం కొంత వరకు ఒక సరళమైన, ఉపయోగకరమైన మార్గం కావచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ అధ్యయనంలో భాగంగా వాలంటీర్లను నాలుగు బృందాలుగా విభజించారు. మొదటి బృందానికి మొజార్ట్‌ సంగీతాన్ని, రెండో టీమ్‌కు వారు ఇష్టపడే సంగీతాన్ని, మూడో బృందానికి వాళ్ల మనసుకు ప్రశాంతత కలిగించే సంగీతాన్ని వినిపించారు. నాలుగో బృందానికి ఎలాంటి సంగీతాన్నీ వినిపించలేదు. సూది గుచ్చాక ఆ నాలుగు బృందాల వారికి ఎంత నొప్పి కలిగిందో నమోదు చేశారు. 

ఇందుకోసం విజువల్‌ అనలాగ్‌ స్కేల్‌ అనే పద్ధతిని ఉపయోగించారు. ఇందులో వ్యక్తులు తమకు కలిగిన నొప్పి తీవ్రతను ఒక స్కేల్‌పై తెలియజేస్తారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... తాము ఇష్టపడే సంగీతాన్ని విన్నవారిలో సూది గుచ్చిన 30 సెకన్ల నుంచి రెండు నిమిషాల తర్వాత నొప్పి గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మొజార్ట్‌ సంగీతం విన్నవారిలోనూ నొప్పి తగ్గుదల కనిపించింది. వైద్య ప్రక్రియల సమయంలో సంగీతం నొప్పిని తగ్గించడంలో కొంత వరకు ఉపయోగపడవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
study
Health
hug
Depression
music
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!

పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ఈ విషయాలు తెలుసుకోండి!

కదలకుండా కూర్చుంటే కష్టాలే!

కదలకుండా కూర్చుంటే కష్టాలే!

బలవంతపు నవ్వైనా.. బోలెడంత రిలీఫ్‌... ఓసారి నవ్వి చూడండి!

బలవంతపు నవ్వైనా.. బోలెడంత రిలీఫ్‌... ఓసారి నవ్వి చూడండి!

ఏది ఎంత తినాలి? ఎన్‌ఐఎన్‌ చెబుతున్నదేంటంటే?

ఏది ఎంత తినాలి? ఎన్‌ఐఎన్‌ చెబుతున్నదేంటంటే?

మరిన్ని వార్తలు

84 ఏళ్లకు స్పైన్‌ సర్జరీ.. 48 గంటల్లోనే వాకింగ్‌!

84 ఏళ్లకు స్పైన్‌ సర్జరీ.. 48 గంటల్లోనే వాకింగ్‌!

జపనీస్‌ చెట్టు వేర్ల నూనెతో సుఖనిద్ర!

జపనీస్‌ చెట్టు వేర్ల నూనెతో సుఖనిద్ర!

తరచూ గుండెల్లో మంటా..?  జీఈఆర్‌డీ కావచ్చు!

తరచూ గుండెల్లో మంటా..? జీఈఆర్‌డీ కావచ్చు!

మీ డాక్టర్‌ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్‌?

మీ డాక్టర్‌ 4-5 ట్యాబ్లెట్లు రాసిస్తున్నారా? WHO ప్రమాణాలు ఎలా ఉన్నాయ్‌?

ఒంటరిగా భోజనం చేస్తున్నారా?

ఒంటరిగా భోజనం చేస్తున్నారా?

డయాబెటిస్‌?... ఈ పరీక్షలు మేలు చేస్తాయి!

డయాబెటిస్‌?... ఈ పరీక్షలు మేలు చేస్తాయి!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft