Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. అటకెక్కుతున్న ఆర్టీఐ చట్టం!
ADVERTISEMENT

అటకెక్కుతున్న ఆర్టీఐ చట్టం!

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2026 03:36 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
rti.jpg

దేశమంతటా సమాచార హక్కు చట్టం క్రమంగా బలహీనపడుతోంది. ప్రజా స్వామ్య పాలనలో పారదర్శకతకు ప్రాణం పోయడానికి వచ్చిన చట్టం, ఇప్పుడు తానే ‘ప్రాణాపాయ’ స్థితిలో కొట్టు మిట్టాడుతోంది. 21 యేళ్ల కింద (2005 అక్టోబర్‌ 11) ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చినపుడు ‘‘ప్రజా సమాచారాన్ని ప్రజ లకు సులభంగా అందుబాటులోకి తెచ్చే ఒక పక్కా వ్యవస్థ ద్వారా పారదర్శక సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టం వచ్చిన ఆరంభం నుంచి అటు అడిగేవారు, ఇటు ఇచ్చేవారు... ఇరుపక్షాల్లో అవగాహన పెరుగుతున్న క్రమంలోనే పారదర్శక వాతావరణం బలపడుతూ వచ్చింది. 

మొదట్లో సమాచార కమిషన్లు కూడా క్రియాశీలంగా పని చేశాయి. సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, కార్పొరేట్‌ ప్రత్యేక సెల్స్‌ స్థాయి దాటి సామాన్యుల వరకు కూడా ఈ చట్టం, దాని గొప్పదనం పరిచయమైంది. ప్రభుత్వ, పాలనా వ్యవస్థల్లోని సమాచారం సులభంగా ప్రజాబాహుళ్యంలోకి రావడం మొదలైంది. ఆర్టీఐ దరఖాస్తులు పెట్టడం, సమాచారం లభించని చోట అప్పీళ్లు, రెండో అప్పీళ్ల వరకూ వెళ్లింది.

అప్పీళ్ల తర్వాతా న్యాయం జరుగకుంటే న్యాయస్థానాల తలుపు తట్టిన సందర్భాలు కోకొల్లలుగాఉండేవి.ఆర్టీఐ ద్వారా సమాచారం పొంది, తమకు చట్టబద్దంగా, రాజ్యాంగం పరిధిలో రావాల్సిన ప్రయోజనాలను, జరగకుండా పోయిన మేలును పట్టుబట్టి పౌరులు సాధించుకోవడం కథలు కథలుగా పలు విజయగాథలు మీడియాలో వచ్చేవి. తొలి రెండు మూడేళ్లలోనే కొన్ని సవరణలు ప్రతిపాదించి, చట్టాన్ని బలహీన పరచడానికి జరిగిన యత్నాన్ని పౌరసమాజం అడ్డుకుంది. 

స్వచ్ఛంద వెల్లడి ‘సెక్షన్‌ 4’కు గ్రహణం
చట్టం అమలు బలహీనపడుతున్న క్రమంలోనే 2019లో, కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించి మరింత బలహీన పరిచింది.స్థూలంగా పారదర్శకత పైనే పెద్ద వేటు వేసింది. ‘వ్యక్తిగత గోప్యత సమాచార భద్రత (డీపీడీపీ) చట్టం’ తెచ్చే క్రమంలో, ఆర్టీఐ చట్టానికి వర్తించేలా రూపొందించిన నిబంధనలు, ప్రభుత్వాల తదనంతర ఉత్తర్వులు, ఆదేశాలు ఆర్టీఐ ప్రభావాన్ని మరింత నీరుగార్చాయి. సమాచార హక్కు చట్టానికి ఆయువు పట్టు, స్వచ్చంద సమాచారాన్ని వెల్లడించే ‘సెక్షన్‌–4’. పాలనా వ్యవస్థల్లో అతి చిన్న యూనిట్‌ అయిన గ్రామ సచివాలయం నుంచి అత్యున్నత కార్య క్షేత్రాలయిన రాష్ట్రపతి భవన్, ప్రధాని ఆఫీస్‌ వరకు ప్రతి పౌర కార్యాలయం (పబ్లిక్‌ అథారిటీ)కు బాధ్యతను ఈ చట్టం నిర్దేశించింది. 

ఎవరూ అడగకుండానే నిర్దిష్ట సమాచారాన్ని స్వచ్ఛందంగా, తప్పనిసరిగా వెల్లడి చేయాలనే అందులోని 4 (1), (బి) సబ్‌ క్లాజ్‌ ఎంతో ముఖ్య మైంది. దీని ప్రకారం ప్రతి కార్యాలయం... అక్కడ ఏం పని జరుగు తోంది? అధికారులు–సిబ్బంది ఎవరెవరుంటారు? వారి విధులు– బాధ్యతలేంటి? ఆ వార్షిక సంవత్సరం నిధులు, గ్రాంట్స్, సబ్సిడీలు వంటి బడ్జెట్‌ ఎంత? లబ్దిదారులెవరు? ఏ ప్రాతిపధికన వారినిఎంపిక చేస్తారు? ఏయే చట్టాలు–నిబంధనలు వర్తిస్తాయి... ఇలా మొత్తం 17 నిర్దిష్ట అంశాల్లో ఆ సమాచారాన్ని స్వచ్చందంగా వెల్లడించాలి. స్థానిక భాషలో, స్థానిక మీడియాలో ప్రచురించడమే కాకుండా ఒక ప్రతిని కార్యాలయంలో అందుబాటులో ఉంచాలి. ఎన్ ఐసీవంటి ఎజెన్సీలు, ఇతర మార్గాల్లో ఆన్ లైన్ లో ఉంచాలి. అడిగిన వారికి, కాగితం ఖర్చులు తీసుకొని ప్రతులు అందజేయాలి. 

అంటే, దాదాపు ఎనభై, తొంబై శాతం సమాచారం ఏ దరఖాస్తుతో పని లేకుండా పౌరులకు అందుబాటులోకి రావాలి. అప్పుడు, నిర్దిష్టంగా తనకు ఏ సమాచారం అవసరమో... ఆ మిగిలిన పది, ఇరవై శాతం సమాచారానికి మాత్రమే ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవసరం ఏర్పడుతుంది. ప్రతి కార్యాలయం తన 4 (1) (బి) సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలని కూడా చట్టం నిర్దేశిస్తోంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేంద్ర స్థాయిలో కూడా ఈ ఆధునీకరించడం అన్నది సవ్యంగా జరగటం లేదు. ‘సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్ ’ అనే స్వచ్చంద సంస్థ దేశ వ్యాప్త పరిస్థితిని సమీక్షించగా దేశంలోని 29 కమిషన్ల పరిధిలో 4.13 లక్షల అప్పీళ్లు–ఫిర్యాదులు పెండింగ్‌ లో ఉన్నట్టు తేలింది.

లెక్కలు చూపని పబ్లిక్‌ అథారిటీలు!
పదిహేడు అంశాల్లోనే కాకుండా మరికొంత అదనపు సమాచా రాన్ని ఈ స్వచ్ఛంద వెల్లడితో జోడించాలని కేంద్ర ప్రభుత్వసిబ్బంది–శిక్షణ (డీవోపీటీ) మంత్రిత్వ శాఖ గతంలోనే ఉత్తర్వు లిచ్చింది. పబ్లిక్‌–ప్రయివేట్‌ భాగస్వామ్య వ్యవహారాలు, భారీ కొనుగోళ్లు (ప్రొక్యూర్మెంట్‌), ఆర్టీఐ దరఖాస్తులు–స్పందన–విశ్లేషణ వంటి మరో 8 అనుబంధ అంశాల్ని ఇందుకు జతచేసింది. కానీ ఇవేవీ సవ్యంగా అమలు కావటం లేదన్నది, కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల ఆన్ లైన్‌ వ్యవస్థపై జరిపిన తాజా పరిశీలనలో వెల్లడయింది. ఆర్టీఐ చట్ట నిబంధన, 4 (1), (బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారం, అదనంగా జోడించిన అంశాల విషయంలోనే కాకుండా మొత్తం పారదర్శకతపైనే తటస్ఠ (మూడో) పక్షంతో ఆడిటింగ్‌ జరిపించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. 

సదరు ‘పారదర్శకత తనిఖీ’ నివేదిక ప్రతిని కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) కి పంపించాలన్న ఆదేశాన్ని కూడా మెజారిటీ పౌర కార్యాల యాలు (పబ్లిక్‌ అథారిటీలు) పాటించడం లేదని సీఐసీ వార్షిక నివేదికే వెల్లడిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విభిన్న విభాగాలకు చెందిన 2,303 పౌర కార్యాలయాల్లో (పీఏలు) 1,446 మాత్రమే సదరు నివేదికల్ని సీఐసీతో పంచుకున్నాయి. 37 శాతం పీఏలు అసలు నివేదికల్నే సమర్పించకుంటే, సమర్పించిన (63 శాతం) వాటిలో, సగం కన్నా ఎక్కువ పీఏలు అరకొరగా, మొక్కుబడి సమాచారాన్ని పొందుపరిచినట్టు ఒక మీడియా సంస్థ జరిపిన అధ్యయనం– విశ్లేషణలో వెల్లడయింది. 

సమాచార కమిషన్‌ ఆదేశాలూ బేఖాతరు
‘‘మీరూ పౌర కార్యాలయాలే’’ అని కేంద్ర సమాచార కమిషన్‌ పదే పదే నొక్కి చెప్పినా, దేశంలోని ఆరు అగ్రశ్రేణి రాజకీయ పార్టీలు ‘‘మావి పౌర కార్యాలయాలు కావు, మేం ఆర్టీఐ కిందకు రాము’’ అని మొండిగా ససేమిరా అన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తే ఒక కేసు విచారణ సందర్భంగా ‘‘ఫేక్‌ డిగ్రీల వాళ్లు, పనిలేని వారు, పరాన్నబుక్కులుగా బొద్దింకల్లాగా మారి, అందులో కొందరు ఆర్టీఐ కార్యకర్తలవుతున్నారు’’ అని చులకనగా మాట్లాడిన వైనానికి దేశం విస్మయం చెందింది. 

అంతకు చాలా ఏళ్లముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి గవర్నర్‌ ఒకరు ఇలాగే ఆర్టీఐ కార్యకర్తలపై చులకనగా మాట్లాడేవారు. ఇలా పెద్ద పెద్ద హోదాల్లోని వారే ఆర్టీఐని చిన్న బుచ్చి మాట్లాడటం కూడా చట్టం అమలుపట్ల అధికారయంత్రాంగం నిర్లక్ష్యానికి కారణాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. అధికా రులు, రాజకీయ పక్షాలు, సమాచార కమిషన్లు... ఇలా కీలక వ్యవస్థ లకు చెందిన కొంతమంది కూడబలుక్కున్నట్టు తమ చర్యల ద్వారా ఆర్టీఐ చట్టాన్ని అటకెక్కిస్తున్న జాడలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి శత్రువులెక్కువ. సామాన్యులు, సగటు పౌరులు, కార్యకర్తలు తప్ప ఈ చట్టానికి చుట్టాలే లేరు. అందుకే, చట్టం అమల్లోకి వచ్చి 21 యేళ్లు పూర్తయినా ఆశించిన ఫలితంకనిపించటం లేదు.


-వ్యాసకర్త సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్, పీపుల్స్‌ పల్స్‌ రిసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌
- దిలీప్‌ రెడ్డి

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Right to Information Act (RTI)
information
Commissions
study
Guest Column
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నూరు వసంతాల భారతరత్నం

నూరు వసంతాల భారతరత్నం

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

ఆఫ్రికాలో పాగా వేయటానికి పోటీ

ఆఫ్రికాలో పాగా వేయటానికి పోటీ

ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం

ప్రతీ ఓటు పరిరక్షణకే ఈ పోరాటం

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

ప్రత్యర్థులనే సహచరులుగా మలిచిన నాయకుడు

ప్రత్యర్థులనే సహచరులుగా మలిచిన నాయకుడు

మరిన్ని వార్తలు

యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ సీఎం) - రాయని డైరీ

యోగి ఆదిత్యనాథ్‌ (యూపీ సీఎం) - రాయని డైరీ

నూరు వసంతాల భారతరత్నం

నూరు వసంతాల భారతరత్నం

బియ్యం ధరల పెరుగుదల మతలబు

బియ్యం ధరల పెరుగుదల మతలబు

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

శ్రీకాకుళ గిరిజనోద్యమం ఏం నేర్పింది?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft