Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Guest Columns
  3. ప్రత్యర్థులనే సహచరులుగా మలిచిన నాయకుడు
ADVERTISEMENT

ప్రత్యర్థులనే సహచరులుగా మలిచిన నాయకుడు

Guest Columns Sakshi User Sakshi Sakshi Time Nov 4, 2026 04:36 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
abraham_20lincoln.jpg

పజాస్వామ్య పాలనలో లింకన్‌ నెలకొల్పిన విలువలు నేటి పాలకులకు విలువైన పాఠాలు. 

చరిత్రకారిణి డోరిస్‌ కెర్న్స్‌ గుడ్‌విన్‌ రచించిన ‘టీమ్‌ ఆఫ్‌ రైవల్స్‌: ద పొలిటికల్‌ జీనియస్‌ ఆఫ్‌ అబ్రహాం లింకన్‌’ కేవలం లింకన్‌ జీవిత చరిత్ర మాత్రమే కాదు; భిన్నమైన అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు, రాజకీయ ఆశయాలు కలిగిన వ్యక్తులను ఒకే లక్ష్యం కోసం ఎలా సమన్వయం చేయ వచ్చో వివరించే నాయకత్వ పాఠం. 1860లో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ఎంపిక సమయంలో విలియం హెచ్‌.సీవర్డ్, సాల్మన్‌ పి.చేజ్,  ఎడ్వర్డ్‌ బేట్స్‌ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. రాజకీయ అనుభవం, పేరు ప్రఖ్యాతుల్లో వారు లింకన్‌కంటే ముందున్నట్లు అప్పట్లో అనుకునే వారు. అయినప్పటికీ, లింకన్‌ అభ్యర్థిగా ఎంపికై అధ్యక్షుడయ్యారు. తనను వ్యతిరేకించిన వారిని దూరంగా ఉంచే నాయకులకు భిన్నంగా, లింకన్‌ ఆ ముగ్గురికీ ప్రభుత్వంలో కీలక పదవులు అప్పగించారు. సీవర్డ్‌ను విదేశాంగ కార్యదర్శిగా, చేజ్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శిగా,  బేట్స్‌ను అటార్నీ జనరల్‌గా నియమించారు. ప్రత్యర్థుల ప్రతిభను వ్యక్తిగత కక్షలకు బలి చేయకుండా, దేశ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమే ఆయన నాయకత్వంలోని విశిష్టత.

లింకన్‌ తన మంత్రివర్గ సభ్యులంతా తన అభిప్రాయాలతో ఏకీభవించాలని కోరుకోలేదు. కొందరు ఆయన నిర్ణయాలను విమ ర్శించేవారు. ముఖ్యంగా సీవర్డ్‌ తొలినాళ్లలో లింకన్‌ నాయకత్వ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. లింకన్‌ ఆయన అనుభవా నికి విలువనిచ్చి, సీవర్డ్‌ సలహా లను స్వీకరించారు. కాలక్రమంలో సీవర్డ్‌ ఆయ నకు అత్యంత విశ్వసనీయమైన సలహాదారుల్లో ఒకరిగా మారారు. ఈ పరిణామం నాయకత్వంలోని కీలక సత్యాన్నితెలియజేస్తుంది. సమర్థుడైన నాయకుడు తనను పొగిడే వారితోనే బృందాన్ని నిర్మించుకోడు; తన నిర్ణయాల్లోని లోపాలను ఎత్తిచూపగల వారికీ స్థానం కల్పిస్తాడు. విమర్శను వ్యక్తిగత అవ మానంగా భావించకుండా, అందు లోని విలువైన అంశా లను స్వీకరించడం ద్వారా నిర్ణయాలను మెరుగుపరుచు కుంటాడు.

ఉమ్మడి లక్ష్యమే ముఖ్యం
లింకన్‌ అధ్యక్షుడైన సమయంలో అమెరికా తీవ్ర సంక్షోభంలో ఉంది. బానిస త్వంపై ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య పెరిగిన విభేదాలు 1861లో అంతర్యుద్ధానికి దారితీశాయి. దేశ ఐక్యతను కాపాడటం, యుద్ధాన్ని ఎదుర్కోవడం, బానిసత్వ నిర్మూలన దిశగా ముందుకు సాగడం ఆయన ముందున్న సవాళ్లు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ సభ్యుల మధ్య విభేదాలు, సైనికాధికారుల వైఫల్యాలు, రాజకీయ విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ, లింకన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో చేజ్‌ అనుభవాన్ని, విదేశాంగ విధానంలో సీవర్డ్‌ సామర్థ్యాన్ని ఉపయోగించుకున్నారు. ఇతరుల ప్రతిభను గుర్తించడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం, విభేదాల మధ్య కూడా ఉమ్మడి లక్ష్యాన్ని మరచిపోక పోవడం ఆయన నాయకత్వంలోని ప్రధాన లక్షణం.

నిజమైన నాయకుడు పుట్టుకతోనే సంపూర్ణుడిగా ఉండడు. అనుభవాల నుంచి నేర్చుకుంటూ, విమర్శలను స్వీకరిస్తూ, తప్పు లను సరిదిద్దు కుంటూ ఎదుగుతాడు. తనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్న వారిని చూసి అసూయపడకుండా, వారి సామర్థ్యాన్ని సంస్థ అభివృద్ధికి ఉపయోగించు కుంటాడు. విజయం వచ్చినప్పుడు బృందానికి గుర్తింపు ఇస్తాడు, వైఫల్యం ఎదురైనప్పుడు ఇతరులపై నిందలు వేయకుండా కారణాలను విశ్లేషించి పరిష్కారాలను అన్వేషిస్తాడు. సంక్షోభ సమయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. టీమ్‌ ఆఫ్‌ రైవల్స్‌ (ప్రత్యర్థుల బృందం) అందించే అసలైన పాఠం ఇదే. 

ప్రజాస్వామ్య పాలనలో లింకన్‌ నెలకొల్పిన ఈ విలువల పాఠం నేటి  పాలకులకు మరింత అవసరం. ప్రజల సమస్యలను వినడం, విమర్శల్లోని వాస్తవాలను గుర్తించడం, తప్పులను సరి దిద్దుకోవడం ద్వారానే ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకో గలవు. ప్రత్యర్థులను అణచి అధికారాన్ని కాపాడుకోవాలనుకునే పాలకుడి కంటే, వారిని గౌరవించి ప్రజల కోసం కలిసి పని చేసే నాయకుడే చరిత్రలో నిలిచిపోతాడు.

ఇదీ చదవండి: ఒకే భూమి – ఒకే ఆరోగ్యం



– శేఖర్‌ శర్మ ఏటూరి, రిటైర్డ్‌ జిల్లా విద్యాశాఖాధికారి 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Guest Column
Abraham Lincoln
Political Affairs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎన్నికల్లో మానవ హక్కులు ఎక్కడ?

ఎన్నికల్లో మానవ హక్కులు ఎక్కడ?

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

జీవిత పాఠాలు ఎవరికి తెలియవు?

జీవిత పాఠాలు ఎవరికి తెలియవు?

యువత గొంతును విందాం!

యువత గొంతును విందాం!

చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి!

చెబుతున్నదొకటి చేస్తున్నదొకటి!

ప్రపంచానికి ప్రాచీన వెలుగు

ప్రపంచానికి ప్రాచీన వెలుగు

మరిన్ని వార్తలు

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వారి ప్రస్తావన లేకపోవడం యాదృచ్ఛికమా లేక డిప్లమసీనా?

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

వ్యవస్థల సంక్షోభంతోనే తిరుగుబాట్లు

ఎన్నికల్లో మానవ హక్కులు ఎక్కడ?

ఎన్నికల్లో మానవ హక్కులు ఎక్కడ?

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

జీవిత పాఠాలు ఎవరికి తెలియవు?

జీవిత పాఠాలు ఎవరికి తెలియవు?

యువత గొంతును విందాం!

యువత గొంతును విందాం!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft