Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌.. ముగిసిన తొలిరోజు సెషన్..
ADVERTISEMENT 

పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌.. ముగిసిన తొలిరోజు సెషన్..

National Sakshi User Sakshi Sakshi Time Feb 1, 2023 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Budget_650x400.jpg

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. 

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు సెషన్ ముగిసింది.  5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని అమృతకాలంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

కేంద్ర బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు

రక్షణశాఖ - రూ.5.94 లక్షల కోట్లు

రోడ్డు, హైవేలు - రూ.2.70 లక్షల కోట్లు

రైల్వే శాఖ - రూ.2.41 లక్షల కోట్లు

పౌరసరఫరాల శాఖ - రూ.2.06 లక్షల కోట్లు

గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.1.6 లక్షల కోట్లు

వ్యవసాయ శాఖ - రూ.1.25 లక్షల కోట్లు

రూపాయి రాక..

►2023-24 మొత్తం బడ్జెట్‌ రూ.45.03 లక్షల కోట్లు

►మొత్తం టాక్స్‌ల రూపేణా వచ్చే ఆదాయం రూ.33.61 లక్షల కోట్లు

►కేంద్ర ఆదాయంలో రాష్ట్ర పన్నుల వాటా రూ10.22 లక్షల కోట్లు

►ఇన్‌కం టాక్స్‌ రూపేణా వచ్చేది రూ.9.01 లక్షల కోట్లు

►GST ద్వారా కేంద్రానికి వచ్చే  ఆదాయం రూ.9.57లక్షల కోట్లు

రూపాయి పోక..

►ప్రణాళికేతర వ్యయం రూ.25.59 లక్షల కోట్లు

►వివిధ పథకాల కోసం ప్రణాళిక ద్వారా చేసే వ్యయం రూ.19.44లక్షల కోట్లు

►వివిధ రంగాల్లో కేంద్ర పథకాల కోసం రూ.14.68 లక్షల కోట్లు

►పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా రూ.5.13లక్షల కోట్లు

  • వేతన జీవులకు ఊరట

►ప్రస్తుతమున్న 6 శ్లాబులను 5 శ్లాబులకు తగ్గింపు

►ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను

►0-3 లక్షల వరకు నిల్‌

► 3 - 6 లక్షల వరకు 5% పన్ను

►6 - 9 లక్షల వరకు 10% పన్ను

►9 -12 లక్షల వరకు 15% పన్ను

►12- 15 లక్షల వరకు 20% పన్ను

►రూ.15 లక్షలు ఆదాయం దాటితే 30% పన్ను

►రూ.9లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు

►రూ.15లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి చెల్లించాల్సిన పన్ను రూ.లక్షా 5వేలు

►2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి

►దేఖో అప్నా దేశ్ పేరుతో పర్యాటక అభివృద్ధి

►ఎంఎస్‌ఎంఈల రుణాల వడ్డీ రేటు ఒక శాతం తగ్గింపు

►బ్యాంకింగ్‌ సేవలు మరింత సులభతరం.. చట్ట సవరణకు అనుమతి

►మహిళా సమ్మాన్ సేవింగ్‌ స్కీమ్ కింద 2లక్షల సేవింగ్స్‌పై 7% వడ్డీ

►సీనియర్ సిటిజన్‌ సేవింగ్ స్కీమ్ పరిమితి రూ.15లక్షల నుంచి 30లక్షలకు పెంపు

►సేవింగ్ అకౌంట్ పరిమితి రూ.4.5లక్షల నుంచి 9లక్షలకు పెంపు

►ఈ ఏడాదికి సవరించిన ద్రవ్యలోటు 6.4 శాతం

►వచ్చే ఏడాది ద్రవ్యలోటు 5.9% ఉండే విధంగా చర్యలు

►2026 నాటికి ద్రవ్యలోటు 5శాతం దిగువకు తీసుకురావాలని లక్ష్యం

►గతేడాది 31 కోట్ల ఫోన్లు భారత్‌లో తయారయ్యాయి..

►భారత్‌లో తయారైన ఫోన్ల విలువ రూ.2.75లక్షల కోట్లు

►లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీ 21% నుంచి 13% తగ్గింపు

►తగ్గనున్న టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు

►టీవీ ప్యానల్స్‌పై కస్టమ్ డ్యూటీ 2.5 శాతం తగ్గింపు: నిర్మల

►రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే వడ్డీ రహిత రుణ సదుపాయం మరో ఏడాది పాటు పొడిగింపు

►మరిన్ని ప్రాంతాలకు ఎయిర్‌ కనెక్టివిటీ, దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో 50 కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీ ప్యాడ్లు

► నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కోసం రూ.19,700 కోట్లు

►ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం రూ.38వేల కోట్లు

►లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ.20,700 కోట్లు

►గోబర్ధన్ స్కీమ్‌ కింద 200 బయోగ్యాస్‌ ప్లాంట్లు

►సేంద్రీయ వ్యవసాయం వైపు కోటి మంది రైతులు

►తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత

►మిస్టీ పథకం ద్వారా మడఅడవుల అభివృద్ధి

►వాహనాల తుక్కు కోసం మరిన్ని నిధుల కేటాయింపు..

►యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన 4.0

►రైల్వేలకు రూ.2.40లక్షల కోట్లు కేటాయింపు

►50 ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టుల పునరుద్ధరణ

►ట్రాన్స్‌పోర్ట్‌ రంగానికి ప్రాధాన్యత

►నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్‌

►ఏడాదికి అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్‌ రూ.10వేల కోట్లు

►మేక్‌ ఎ వర్క్‌ మిషన్‌ ప్రారంభం

►ఈ-కోర్టు ప్రాజెక్టు విస్తరణ కోసం మూడో విడత రూ. 7 వేల కోట్లు

►5 జీ సర్వీసుల కోసం 100 ల్యాబ్‌ల ఏర్పాటు

►2070 నాటికి కార్బన రహిత భారత్‌ లక్ష్యం

►త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట

►కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం

►రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం కోసం రూ.13.7లక్షల కోట్లు

►పేద ఖైదీలు బెయిల్ పొందేందుకు ఆర్ధిక సాయం

►మూడు కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సెంటర్లు

►సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..

►నేషనల్ డేటా గవర్నెన్స్‌ పాలసీ ద్వారా కేవైసీ విధానం మరింత సులభతరం

►వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్, పాన్‌కార్డ్‌, డిజీలాక్‌

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్ 

►సమ్మిళిత అభివృద్ధి

►చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు

►భారీగా పెట్టుబడులు, మెరుగైన మౌలిక సదుపాయాలు

►దేశ ప్రజల సామర్థ్యానికి పెద్ద పీట

►పర్యావరణ అనుకూల అభివృద్ధి

►యువ శక్తి

►పటిష్టమైన ఆర్థిక రంగం

► మిల్లెట్లతో ఆరోగ్య జీవితం..  శతాబ్దాల నుంచి భారతీయుల ఆహారమైన మిల్లెట్లకు పెద్దపీట. ప్రపంచ స్థాయిలో మిల్లెట్‌ హబ్‌గా భారత్‌ను రూపొందించడమే లక్ష్యంగా.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు.





► ఆరోగ్యమే మహాభాగ్యం.. వ్యవసాయానికి పెద్దపీట, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి

► 102 కోట్ల మందికి 220 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్

► భారత ఆర్థిక వ్యవస్థ సరైన మార్గంలోనే పయనిస్తోంది. ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకెళ్తోంది.   దేశ ఆర్థిక వృద్ధి రేటు 7 శాతంగా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మల ప్రకటించారు.





► పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను  ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రగతిని.. ఈ దఫా వార్షిక బడ్జెట్‌ పలు రంగాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని వినిపిస్తున్నారు.

►75 ఏళ్ల స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుస్తున్న వేగుచుక్క ఈ బడ్జెట్‌

►కష్ట కాలంలో మేం తెచ్చిన ఆర్థిక విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి

►ప్రపంచంలో మనది ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ

►ప్రపంచ వేదికపై భారత్‌ పాత్ర బలోపేతానికి జీ20 సమావేశాలు దోహదపడతాయి

►ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల కంటే మనదేశ వృద్ధిరేటు ఎక్కువ

►ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఖాతాల సంఖ్య రెట్టింపై రూ. 27 కోట్లకు చేరింది.

►11.7 కోట్ల గృహాలకు కొత్తగా టాయిలెట్లు నిర్మించాం

►భారత తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు

►2024 వరకు ఉచిత ఆహార పంపిణీ పథకం కొనసాగింపు

►మా ప్రాధాన్యత అంశాలు యువతకు ప్రాధాన్యత, అభివృద్ధి-ఉద్యోగాల కల్పన, సుస్థిరత మా లక్ష్యం

►మహిళల ఆర్థిక స్వావలంబన మా ప్రాధాన్యత అంశం

►రాష్ట్రాల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

►వృత్తి కళాకారులకు మరింత చేయూత

►11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్ల రూపాయలు అందించాం

►గ్రీన్‌ ఎనర్జీ మా ప్రభుత్వ ప్రాధాన్యత

►జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

►యువత కోసం నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీలు

►క్లీన్‌ప్లాంట్‌ కార్యక్రమానికి రూ. 2వేల కోట్లు

►చిరు ధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

►ఉద్యానవన పంటలకు ఆర్థిక చేయూత

►చిన్న, మధ్య తరహా రైతులకు సహకార సంఘాల ద్వారా రుణాలు

►ఫిషరీస్‌ కోసం ప్రత్యేక నిధి

►సప్తరిషి పేరుతో 7 రంగాలకు ప్రాధాన్యనిస్తూ బడ్జెట్‌

►2047 నాటికి రక్తహీనత రూపుమాపడం కోసం ప్రత్యేక ప్రణాళిక

►50 ఏళ్ల పాటు రాష్ట్రాలకు ఇచ్చే వడ్డీలేని రుణాలు కొనసాగింపు

►రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు కేటాయింపు

►మూలధన వ్యయం 33% పెంపు రూ. 10లక్షల కోట్లు

►ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన

►మత్స్యశాఖకు రూ. 6 వేల కోట్ల నిధులు

►18 లక్షల సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులను ఏర్పాటు చేస్తాం

►చిన్నారుల కోసం నాణ్యమైన పాఠ్యాంశాలు, ఉత్తమ పుస్తకాలతో కూడిన డిజిటల్ లైబ్రరీ

►ఫార్మా రంగంలో పరిశోధనల కోసం కొత్త కార్యక్రమం

►దేశవ్యాప్తంగా సహకార సంఘాల వివరాలతో నేషనల్  కో ఆపరేటివ్ డాటాబేస్

►సేంద్రీయ సాగుకు పెద్దపీట, కోటి మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేలా మార్గదర్శకాలు

►ప్రధాని ఆవాస్‌  యోజన కింద రూ.79వేల కోట్లతో దేశవ్యాప్తంగా బడుగులకు ఇళ్ల నిర్మాణం



►ఉపాధ్యాయులకు శిక్షణ కోసం ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొత్త సంస్థ

►740 ఏకలవ్య స్కూల్స్‌ ఏర్పాటు, 3.50లక్షల మంది విద్యార్ధులకు బోధన

►ఏకలవ్య స్కూల్స్‌లో 38,800 టీచర్ల నియామకం

►2023-24 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

►ప్రారం‍భమైన పార్లమెంట్‌



► కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌-2023ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. బడ్జెట్‌ ద్వారా భారీగా ఊరట ఉండొచ్చని గంపెడాశలు పెట్టుకున్నారు జనం.

► బడ్జెట్‌ 2023కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

► బడ్జెట్‌ 2023-24.. బడ్జెట్‌కు ఆమోదం దృష్ట్యా కేంద్ర కేబినెట్‌ సమావేశం నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా తదితరులు 

► పార్లమెంట్‌కు చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. 

►రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌

►పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసిన ఆర్థికమంత్రి

► కాసేపట్లో పార్టమెంట్‌కు ఆర్థికమంత్రి



కేంద్ర పద్దుపై కోటి ఆశలతో జనం..

► కేంద్ర బడ్జెట్‌ 2023-24.. వచ్చే సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ లేదు. కాబట్టి.. గత ఐదేళ్లుగా ఊరట దక్కని వర్గాలు.. ఈసారి బడ్జెట్‌పై అంచనాలు పెంచుకున్నాయి. అయితే.. ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి.. ఆ ప్రభావం మన దేశ పద్దుపైనా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. 

► కేంద్ర బడ్జెట్‌ 2023-24.. ఉదయం 11 గంటల ప్రాంతంలో పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. పేపర్ లెస్ బడ్జెట్ కాబట్టి.. ఎక్కువ టైమ్ పట్టదు. మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడ్జెట్ ప్రసంగం ముగిసే అవకాశాలు ఉన్నాయి. 

► కేంద్ర బడ్జెట్‌ 2023-24.. ప్రధాని అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే కేంద్ర బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది. 

► కేంద్ర బడ్జెట్‌ 2023-24.. రాష్ట్రపతితో భేటీ ముగిసిన తర్వాత పార్లమెంట్‌కు చేరుకుంటారు ఆర్థిక మంత్రి నిర్మల. 

► కేంద్ర బడ్జెట్‌ 2023-24.. ముందుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. రాష్ట్రపతికి బడ్జెట్‌ సమాచారం ఇస్తారు.  

► పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా..  నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌-2023ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది ఐదవసారి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Nirmala Sitharaman
Budget
Union Budget 2023-24
Parliament Budget session
Union Budget
Union Budget of India 2023-24
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్‌లో బీజేపీ తొలి బడ్జెట్‌లో వరాల జల్లు

మధ్యతరగతిపై ధరల భారం

మధ్యతరగతిపై ధరల భారం

యూకే రక్షణ మంత్రి జాన్‌ హీలే రాజీనామా

యూకే రక్షణ మంత్రి జాన్‌ హీలే రాజీనామా

జన్‌ధన్‌తో ఆర్థిక సాధికారత 

జన్‌ధన్‌తో ఆర్థిక సాధికారత 

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

'అంత మాట అనేశారేంటి?'.. వారణాసి, రామాయణపై మనోజ్ షాకింగ్ కామెంట్స్

'అంత మాట అనేశారేంటి?'.. వారణాసి, రామాయణపై మనోజ్ షాకింగ్ కామెంట్స్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.