Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. సిక్కిం వెళ్తున్నారా? ఈ అద్భుతమైన ప్రదేశాలు మిస్‌ కావొద్దు!
ADVERTISEMENT

సిక్కిం వెళ్తున్నారా? ఈ అద్భుతమైన ప్రదేశాలు మిస్‌ కావొద్దు!

Family Sakshi User Sakshi Sakshi Time Oct 26, 2026 08:27 AM IST Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Travel_20Main.jpg

పర్యటన

గ్యాంగ్టక్‌

గ్యాంగ్టక్‌ అంటే సిక్కిం గుండె చప్పుడు. సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న క్యాపిటల్‌ సిటీ, ప్రకృతితో మనిషి కలిసి జీవించే విధానానికి ఒక చక్కని ఉదాహరణ. ఇక్కడ అంతగా ఎండ ఉండదు. మేఘాలు మెల్లగా సాగుతాయి. ప్రతి సందులో ఒక బౌద్ధారామం అంటే మోనాస్టరీ లేదా గుంపా ఉంటుంది. ప్రతి ఇంటి ముందు ఒక చిన్న పూల తోట కనువిందు చేస్తుంటుంది.

గ్యాంగ్టక్‌ను హడావిడిగా సందర్శించడం కుదరదు. అలా అనుకుంటే అక్కడి ప్రకృతి అందాలను అస్సలు ఎంజాయ్‌ చేయలేం. ప్రశాంతంగా ఫీల్‌ అవ్వడానికి తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంజీ మార్గ్‌లో అంటే అక్కడి మాల్‌ రోడ్డులో సాయంత్రం వాక్‌ చేయడం ఒక ట్రీట్‌ లా ఉంటుంది. ఈ మార్గంలో కార్లు ఉండవు. ఈ వీధిలో కాఫీ తాగుతూ, స్నాక్స్‌ తింటూ ప్రశాంతంగా నడవడం కూడా ఒక అందమైన జ్ఞాపకమే. రాత్రి సమయంలో వెలిగే దీపాలు, చిన్న చిన్న షాపుల్లో లభించే సిక్కిం హ్యాండీక్రాఫ్ట్‌ వస్తువులు, శాలువలు ఆకట్టుకుంటాయి.

సందర్శించదగినవి..

  • కొంచెం ఎత్తున ఉన్న ప్రదేశానికి వెళ్తే ఎంచే మొనాస్టరీ కనిపిస్తుంది. 200 సంవత్సరాల నాటి ఈ గుంపాలో, లామాలు చదివే మంత్రాలు వీచే చలి గాలితో కలిసి మనసుకు ప్రశాంతతనిస్తాయి. అక్కడి నుంచి చూస్తే గ్యాంగ్టక్‌ నగరం మొత్తం ఒక చిన్న బొమ్మలా కనిపిస్తుంది.

  • రుమ్టెక్‌ మొనాస్టరీ ఒక పెద్ద విశ్వవిద్యాలయంలా అనిపిస్తుంది. గోడల మీద ఉన్న రంగురంగుల చిత్రాలు, బంగారంతో చేసిన బుద్ధ విగ్రహాలు, అక్కడి సైలెన్స్‌ అన్నీ కలిసి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి.

  • 12,400 అడుగుల ఎత్తులో చుట్టూ మంచు కొండల మధ్య నీలి రంగులో అద్దంలా మెరిసే చంగు లేక్‌ (Tsomgo Lake) ఇక్కడి ప్రధాన టూరిస్ట్‌ డెస్టినేషన్లలో ఒకటి. యాక్‌ అంటే జడల బర్రెలు మెల్లగా ముందుకు నడిచే సమయంలో వాటి మెడలో ఉన్న గంటల నుంచి వచ్చే శబ్దం, నీటిపై పడిన మేఘాల రిఫ్లెక్షన్‌ ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుండి గ్యాంగ్టక్‌ ప్రయాణం ఒక మంచి అనుభవంతో మొదలవుతుంది. శంషాబాద్‌ నుండి బాగ్డోగ్రాకి డైరెక్ట్‌ ఫ్లైట్‌ ఉంది. రెండు గంటల ప్రయాణం తర్వాత, బాగ్డోగ్రాలో దిగగానే, అక్కడి నుండి ఘాట్‌ రోడ్డు మొదలవుతుంది. బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టక్‌ వరకు 125 కిలోమీటర్ల జర్నీ సుమారు 5 గంటల కారు ప్రయాణం.

  • దారి పొడవునా మొత్తం తీస్తా నది మనతో పాటు జర్నీ చేస్తున్నట్టు ఉంటుంది. ఒక వైపు పర్వతాలు, మరో వైపు లోయలు, మధ్య మధ్యలో చిన్న చిన్న జలపాతాలు, అక్కడక్కడా టీ తోటలు, ఈ దశ్యాలు చూస్తూ వెళ్తుంటే అలసటే తెలియదు.

  • విజయవాడ నుంచి వచ్చే వాళ్లు కోల్‌కతా మీదుగా బాగ్డోగ్రాకి వెళ్లవచ్చు. లేదంటే హైదరాబాద్‌ మీదుగా కూడా వెళ్లవచ్చు. రైలులో వెళ్లాలి అనుకునే వారు, హైదరాబాద్‌ నుండి ఎన్జేపీ అంటే న్యూ జల్పాయిగురి వరకు రైలులో వెళ్లి, అక్కడి నుండి గ్యాంగ్టక్‌ కి కారు తీసుకోవచ్చు. రైలు ప్రయాణంలో బెంగాల్‌ పొలాలు దాటగానే, మెల్లమెల్లగా కొండలు మొదలవుతాయి. గాలి చల్లబడుతుంది. మనసులో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. ఇక్కడే అసలు జర్నీ మొదలవుతుంది.

  • గ్యాంగ్టక్‌లో స్టేని సింపుల్‌గా ఎలాంటి హడావిడి లేకుండా, ఇంట్లో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్‌ వచ్చేలా ప్లాన్‌ చేసుకోండి. పెద్ద పెద్ద హోటల్స్‌ కన్నా, చెక్కతో కట్టిన చిన్న హోమ్‌ స్టేలు, ఫ్యామిలీ రన్‌ గెస్ట్‌ హౌస్‌లు చాలా బాగుంటాయి. ఉదయం లేవగానే బాల్కనీలోకి వస్తే, ఎదురుగా కాంచన్జంగా, కింద లోయలో తేలిపోతున్న మేఘాలు కనిపిస్తాయి. రూముల్లో చెక్క ఫ్లోరింగ్, హీటర్, చలికి తగ్గ దుప్పట్లు, బయట చిన్న తోటలో ఆర్కిడ్‌ ఫ్లవర్స్, ఈ చిన్న చిన్న విషయాలే మనసుకి హాయిని ఇస్తాయి.

  • ఎంజీ మార్గ్‌ దగ్గర ఉంటే, సాయంత్రం వాక్‌ చేయడానికి బాగుంటుంది. కొంచెం దూరంలో, తాషి వ్యూ పాయింట్‌ దగ్గర ఉంటే, ఉదయం కాంచన్జంగా ను చూడటానికి అనుకూలంగా ఉంటుంది. చాలా చోట్ల, ఇంట్లో వంట చేసి పెట్టే ఆతిథ్యం దొరుకుతుంది, వాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడితే సిక్కిం జీవన విధానం గురించి తెలుస్తుంది.

ఏం తినాలి?

  • గ్యాంగ్టక్‌లో ఫుడ్‌ అంటే సిక్కిం సంస్కృతిని తెలుసుకోవడమే. వేడి వేడి మోమోస్, లోపల చికెన్, చీజ్, లేక ఆకుకూరలతో నింపిన మోమోస్‌ని, ఎర్ర చట్నీతో తింటే చలి ఎగిరిపోతుంది అనిపిస్తుంది. తుక్పా అంటే టిబెటన్‌ స్టైల్‌ నూడిల్‌ సూప్, చాలా పెద్ద బౌల్‌లో వెజిటబుల్స్, నూడిల్స్, కొంచెం సూప్‌తో ఇస్తారు. ఈ ఫ్లేవర్‌ మనకు తెలుగు రాష్ట్రాల్లో అంత ఈజీగా లభించదు.

  • తుక్పాతో పాటు ఇక్కడ లభించే గుండ్రుక్‌ సూప్, కినెమా కర్రీ రుచి కొత్తగా ఉంటాయి. ఎంజీ మార్గ్‌లో ఉన్న చిన్న బేకరీలో, చీజ్‌ కేక్, వాల్‌నట్‌ కేక్, వేడి కాఫీతో కలిసి మేఘాలను చూడటం అనేది సింపుల్‌గా అనిపించే సూపర్‌ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోతుంది.

ఆసక్తికరమైన విషయాలు..

  • గ్యాంగ్టక్‌ సిక్కిం రాష్ట్ర రాజధాని. ఇది 1650 మీటర్ల ఎత్తులో ఉంది.

  • కాంచన్జంగా ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వతం. గ్యాంగ్టక్‌ నుండి చాలా క్లియర్‌ గా కనిపిస్తుంది.

  • చంగు లేక్‌ సముద్ర మట్టానికి 12,400 అడుగుల ఎత్తులో ఉన్న గ్లేషియర్‌ లేక్‌.

  • నాథూలా పాస్‌ 14,140 అడుగుల ఎత్తులో ఉన్న ఇండియా–చైనా బోర్డర్‌.

  • సిక్కిం ఇండియాలో తొలి ఆర్గానిక్‌ స్టేట్‌గా గుర్తింపు పొందింది.

ఇవి మిస్‌ అవ్వకండి!

  • గ్యాంగ్టక్‌లో యాక్టివిటీస్‌ లేదా అడ్వెంచర్‌ స్కోప్‌ తక్కువ. అయితే అక్కడ గడిపే ప్రతి క్షణం మనసుకు హాయినిస్తుంది. ఎంజీ మార్గ్‌లో ఏమీ కొనకుండా విండో షాపింగ్‌ చేయడం, ఒక చోట కూర్చుని అలా కొద్దిసేపు జనాన్ని గమనించడం కూడా ఒక అనుభవమే.

  • రుమ్టెక్‌ మొనాస్టరీలో లామాలు చేసే ప్రార్థన వింటూ కొంతసేపు కళ్లు మూసి కూర్చోవడం ఆధ్యాత్మిక అనుభవం. చంగు లేక్‌ దగ్గర యాక్‌ సవారీ, దాంతో ఫోటోలు దిగడం చాలా సరదాగా ఉంటుంది. రోప్‌ వేలో గ్యాంగ్టక్‌ నగరాన్ని పైనుంచి చూడటం, కింద చిన్న చిన్న ఇళ్లు, గుంపాల్లో ప్రశాంతత, స్కూల్లో పిల్లల హడావిడీ ఇవన్నీ మనం మరో ప్రపంచంలో ఉన్న అనుభూతిని అందిస్తాయి.

ఏం చూడాలి?

  • గ్యాంగ్టక్‌ వెళ్తే చెక్‌ లిస్ట్‌ పెట్టుకుని వరుసగా అన్ని ప్రదేశాలు కవర్‌ చేయడం కన్నా... అక్కడి వైబ్‌ను ఫీల్‌ అవ్వడానికి ప్రయత్నించండి. ఉదయం 5 గంటలకి తాషి వ్యూ పాయింట్‌లో నిలబడితే కాంచన్జంగాపై పడే తొలి సూర్యకిరణాన్ని, ఆ సమయంలో వచ్చే గోల్డెన్‌ షేడ్స్‌ను చూడవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్‌ సమయంలో వెళ్తే ఈ వ్యూ లభించే అవకాశం ఎక్కువ.

  • నాథూ లా పాస్‌ దగ్గర గడ్డకట్టిన మంచు కొండలు, ఇండియా–చైనా బోర్డర్‌ వద్ద దేశాన్ని రక్షణ గోడలా నిలబడి ఉన్న సైనికుల నిశ్చలమైన చూపు, అక్కడ ఎగిరే త్రివర్ణ పతాకాన్ని చూస్తే ప్రౌడ్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. బంజాక్రి ఫాల్స్‌ దగ్గర నీళ్లు పర్వతం మీద నుంచి దూకుతుంటే దాని ముందు మనిషి చాలా చిన్నవాడిలా అనిపిస్తాడు.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు

  • గ్యాంగ్టక్‌ యాత్రకి 5 రోజుల ప్లాన్‌ సరిపోతుంది. హైదరాబాద్‌ నుండి సిక్కిం వెళ్లేందుకు ఫ్లైట్‌ జర్నీయే బెటర్‌. సిక్కింలో ప్రస్తుతం ఒకే ఒక ఎయిర్‌పోర్ట్‌ ఉంది. అదే ప్యాక్యాంగ్‌ ఎయిర్‌పోర్ట్‌. అయితే ఇది అంత యాక్టివ్‌ విమానాశ్రయం కాదు. వాతావరణ మార్పుల వల్ల విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది.

  • అందుకే ఎక్కువ సర్వీసులు ఉండే బాగ్డోగ్రా కు టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఉత్తమం. హైదరాబాద్‌ నుంచి బాగ్డోగ్రాకు వన్‌ వే టికెట్‌ సీజన్‌ ను బట్టి రూ.14 వేల నుంచి రూ.26 వేల వరకు ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని బాగ్డోగ్రాకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గ్యాంగ్టక్‌ చేరుకోవచ్చు. అడ్వెంచర్‌ లవర్స్‌ కోసం హెలికాప్టర్‌ సర్వీస్‌ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.3100 కాగా 35 నిమిషాల్లో గ్యాంగ్టక్‌ చేరుకోవచ్చు.

  • ఇక స్టే విషయానికి వస్తే మీరు రూ.666 నుంచి రూ.5,600 మధ్యలో మీ బడ్జెట్‌ను, వ్యూ ఛాయిస్‌ను బట్టి రూమ్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే కాంచన్జంగా వ్యూ ఉండే హోటల్స్‌ కాస్త కాస్ట్లీగా అంటే రూ.7,000 నుంచి రూ.12,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది.

  • ఫుడ్‌ కోసం రోజుకు రూ.500 నుంచి రూ.1,300 వరకు మీ బడ్జెట్‌లో కేటాయించవచ్చు. మొత్తంగా 5 రోజుల ట్రిప్‌ కోసం మీ ట్రావెల్‌ స్టైల్‌ను బట్టి రూ.28,000 నుంచి రూ.60 వేల వరకు కేటాయించడం ఉత్తమం. విజయవాడ నుండి ప్లాన్‌ చేసే వారు అదనంగా రూ.3,000 నుండి రూ.5,000 కలుపుకోవడం బెటర్‌.

– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు

ఇదీ చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి వ్యాపార అధ్యక్షురాలి రేంజ్‌కు..!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Gangtok
sikkim
Travel
lake
Budget
tour
Life style
family
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మిగతా ఖనిజాలకు లేనిది.. బంగారానికే ఎందుకు?

మిగతా ఖనిజాలకు లేనిది.. బంగారానికే ఎందుకు?

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే!

తిట్టడు... గొడవపడడు... ఈ భర్త నాకొద్దు! కారణం తెలిస్తే షాకే!

తన ప్రజలు నరకంలో ఉంటే.. నేను స్వర్గానికి రానన్న రాజు!

తన ప్రజలు నరకంలో ఉంటే.. నేను స్వర్గానికి రానన్న రాజు!

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చిన్ననాటి ఇల్లు.. ఏం చేయబోతున్నారో తెలుసా?

నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చిన్ననాటి ఇల్లు.. ఏం చేయబోతున్నారో తెలుసా?

కాలినడకతో ప్రపంచాన్ని చుట్టి.. 28 ఏళ్ల తర్వాత తల్లి చెంతకి..

కాలినడకతో ప్రపంచాన్ని చుట్టి.. 28 ఏళ్ల తర్వాత తల్లి చెంతకి..

మరిన్ని వార్తలు

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

నీళ్ల మధ్యే లగ్జరీ జీవితం.. ఓడలో అడుగుపెడితే మరో ప్రపంచమే!

అహంభావం

అహంభావం

సత్యం శివం సుందరం

సత్యం శివం సుందరం

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

సంగీతకారుల్లో గాయాలు... వాటి గుర్తింపు, వైద్యపరీక్షలూ, చికిత్సలపై

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

నెల నెల విల విల..సివియర్‌గా ఉంటే నిర్లక్ష్యం వద్దు..!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft