ADVERTISEMENT
Nirmala Sitharaman
న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాల రూపంలో 58 కోట్ల మందికి పైగా ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంక్షేమ పథకాలు, తక్కువ ప్రీమియంకే బీమా రక్షణ...
న్యూఢిల్లీ: బ్యాంకులు తమ అసలు వ్యాపారం అయిన డిపాజిట్లు సమీకరించడం, రుణాలు ఇవ్వడం, తక్కువ వ్యయాలతో కూడిన కాసా డిపాజిట్లను పెంచుకోవడంపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అంతేకానీ...
భారతదేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా...
బంగారం ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులకు భారత్ స్థిరమైన, నమ్మకమైన వాతావరణం కలి్పస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ), ఐరోపా, యూకే, యూఎస్‌తో చేసుకున్న...
న్యూఢిల్లీ: వాణిజ్య ఒప్పందం పేరిట దేశాన్ని మోదీ సర్కారు అమెరికాకు అమ్మేసిందన్న విపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ‘‘దేశ ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)...
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
దేశ ప్రజలను భౌతిక బంగారం నుంచి పేపర్ గోల్డ్ వైపు మళ్లించేందుకు ఒకప్పుడు ఫ్లాగ్షిప్ పథకంగా నిలిచిన సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇప్పుడు ఆర్థిక బిల్లులో ప్రతిపాదించిన కొత్త పన్ను మార్పుల నేపథ్యంలో...
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు...
భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని...
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచుతూ, వృద్ధికి దోహదపడే సాధనంగా పెట్టుబడులను ప్రభుత్వం పరిగణిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఈ ధోరణినే ప్రతిఫలిస్తోందని పేర్కొన్నారు. నిర్దేశిత ద్రవ్య...
ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం...
ఇప్పటికే అమలులో ఉన్న నిర్మాణాత్మక సంస్కరణల కొనసాగింపు, మౌలిక సౌకర్యాల కల్పనను వేగవంతం చేయడం, తయారీ రంగాన్ని పటిష్ఠపరచడం, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడం దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక...
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద పారిశ్రామిక, లాజిస్టిక్ కారిడార్లలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు, ప్రతీ జిల్లాలో ఒక బాలికల హాస్టల్, 15 వేల స్కూళ్లు, 500 కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర...
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈసారి క్రీడలకు కాస్త ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోలిస్తే సుమారు రూ.1133 కోట్లకు పైగా నిధుల్ని పెంచారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో క్రీడలు, యువజన...
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజైన నేడు (సోమవారం) ఉభయ సభలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను కొనసాగిస్తున్నాయి. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ లోక్‌సభలో ఈ...
రానున్న ఆర్థిక సంవత్సరానికి (2026–27) కేంద్ర సర్కారు రూ.17.2 లక్షల కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. జీడీపీలో ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికి నిధులను వినియోగించనుంది. 2025–26 సంవత్సరానికి స్థూల రుణ సమీకరణ...
కొత్త ఆదాయపు పన్ను.. జీఎస్టీ మార్పుల వంటి అనూహ్య నిర్ణయాలు చూస్తున్న వీక్షకులంతా... బడ్జెట్ కూడా ఈ వారంలో మొదలయ్యే టి–20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లా ఉంటుందనుకున్నారు. తొలి బంతి నుంచే సిక్సర్ల వర్షాన్ని ఆశించారు...
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27వ సంవత్సరానికి సంబంధించి ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2026–27 ఆర్థిక సంవత్పరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమె ప్రకటించారు. దేశ తయారీ రంగానికి...
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ సెగ్మెంట్లో భారీ స్థాయి స్పెక్యులేషన్‌ని కట్టడి చేసే దిశగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ని (ఎస్టీటీ) పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఫ్యూచర్స్‌పై ప్రస్తుతం 0.02 శాతంగా...
2026 బడ్జెట్ మ్యాచ్‌లో నిర్మలా సీతారామన్ వేసిన తొలి ఓవర్‌కే స్టాక్ మార్కెట్ డకౌట్ అయింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ పై ఆర్థిక మంత్రి వేసిన పన్నుల ఫుల్ టాస్‌కి బ్రోకరేజీలు క్లీన్...
సాక్షి, అమరావతి : ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్...
సాక్షి, అమరావతి: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే భవిష్యత్తు ఇంధనాలుగా పిలిచే అరుదైన ఖనిజాలు ఆంధ్ర ప్రదేశ్‌కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన...
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేని అత్యాధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైస్పీడ్ రైల్, రవాణా సామర్థ్యం పెంపు, భద్రత విభాగాలపై మరింత దృష్టి కేంద్రీకరించింది. ఇందులోభాగంగా దేశంలో ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్...
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్లు కేటాయించారు. 2025–26 సవరించిన అంచనాల (రూ. 1,51,853 కోట్లు) కంటే ఈసారి 7.12 శాతం మాత్రమే కేటాయింపులు పెంచారు. దీంతో వ్యవసాయ రంగంలో...
న్యూఢిల్లీ : ఆరోగ్య రంగంలో సదుపాయాలను విస్తరించడం, వైద్య విద్య, ఫార్మా రంగాలకు ప్రోత్సాహం, హెల్త్‌కేర్‌లో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడం లక్ష్యంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే...
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలాంటి గ్రామీణ భారతావనిపై మరింత దృష్టి సారించింది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి, ఇళ్ల నిర్మాణం, అందరికీ స్వచ్ఛమైన తాగునీరు...
న్యూఢిల్లీ : పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా మిలటరీ ఆధునీకరణపై కేంద్రం ఫోకస్ పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆదివారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రక్షణ రంగానికి...
‘‘ఇదొక విశిష్టమైన, ప్రతిష్టాత్మకమైన బడ్జెట్. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్. ప్రపంచ వేదికపై మనదేశ ప్రతిష్ట మరింత పెరగడం ఖాయం. ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అనే పేరుతో 140 కోట్ల...
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26)...
న్యూఢిల్లీ: రైతులు, యువత, తయారీ దారులు, కుటుంబాల వ్యథలను పట్టించుకోకుండా బడ్జెట్‌ను తయారుచేశారని విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మల మీడియా భేటీలో తిప్పికొట్టారు. ‘‘ రాహుల్‌గాంధీ ఏం మాట్లాడుతున్నారో...
న్యూఢిల్లీ: సామాన్యుడికి కొంత మోదం.. స్టాక్ మార్కెట్లకు, మదుపర్లకు ఖేదం.. స్టార్టప్‌లకు కాస్త నిరాశ.. పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి.. విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తయారీరంగం వారికి ఊరట.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో...
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే కాకుండా.. ఆమె ధరించే చీరలు కూడా ఏటా ఆసక్తికి కేంద్రంగా మారుతుంటాయి. నిర్మల వరుసగా తొమ్మిదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతిసారీ ప్రత్యేకమైన చీరలో...
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు...
కేంద్ర బడ్జెట్ 2026-27లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రపంచ స్థాయి ‘ఛాంపియన్స్’గా తీర్చిదిద్దేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వినూత్నమైన మూడంచెల వ్యూహాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక...
ఫిబ్రవరి 1 ఆదివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026 చాలామందిని నిరాశపర్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొమ్మిదో యూనియన్ బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా, ప్రతిపక్ష...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించడమే కాకుండా 75 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2026లో చాలా అంశాలను వెల్లడించారు. ఈ కథనంలో బడ్జెట్ తరువాత చౌకగా లభించే వస్తువులు ఏవి...
దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం రూ.53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో...
ఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 140కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈబడ్జెట్. వికసిత్ భారత్ నిర్మాణానికి...
కేంద్ర బడ్జెట్ రోజున, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చీర ఎపుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మరో విధంగా చెప్పాలంటే బడ్జెట్లో లభించే కేటాయింపులు, ఊరటలు, తాయిలాలతో నిర్మలమ్మ చీరపై కూడా అంతే ఆసక్తి ఉంటుంది...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు. మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో...
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్‌సభలో తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం...
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను పాలన, పరిశ్రమల అభివృద్ధికి కీలక శక్తిగా అభివర్ణించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. నైపుణ్యం, పోటీతత్వం, ఉత్పాదకతతో భారత్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తామన్నారు...
కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక స్వరూపాన్ని మార్చే దిశగా ఉన్నాయి. ముఖ్యంగా మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచడం దేశాభివృద్ధికి...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ దేశాభివృద్ధికి సంబంధించి కీలకమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కర్తవ్య భవన్లో రూపొందించిన తొలి బడ్జెట్‌గా దీన్ని అభివర్ణిస్తూ యువతను కీలకంగా...
ఏడు దశాబ్దాలకు పైగా మన బడ్జెట్ ప్రసంగాలు ఆర్థిక క్రమశిక్షణను మాత్రమే కాకుండా, మన దేశపు గొప్ప సాహిత్య వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి! వివేకానందుడి ధీరత్వం, తిరువళ్ళువర్ నైతికత, చాణక్యుడి వ్యూహం; గాలిబ్...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్లో తన తొమ్మిదో బడ్జెట్‌ను (2026-27) ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆమె ధరించిన ‘కాంజీవరం చీర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆర్థిక లెక్కలు, మరోవైపు రాజకీయ...
దేశ ఆర్థిక దిశను నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు సమయం దగ్గరపడింది. ‘డిజిటల్ బహీ-ఖాతా’తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్తవ్య భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంట్లో బడ్జెట్ చదవడానికి ముందు ఆమె...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే 2026-27 కేంద్ర బడ్జెట్ (Union Budget 2026-27) గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా...
గ్రేటర్ నగరానికి ఊతం.. పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.. సుస్థిర ఆర్థిక వృద్ధికి సాయం.. ఇలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై మహా నగరం ఎన్నో ఆశలు...
భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను సమర్పిస్తున్న...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది...
2024 – 25 కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల అప్పు తప్ప రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. నిర్మలమ్మ వరాలన్నీ బీహార్‌కు ఇచ్చేస్తే...
అమెరికా టారిఫ్‌లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం ఓవైపు.. జీడీపీ వృద్ధి మందగమనం, ప్రపంచ దేశాల్లో అనిశి్చతితో రూపాయి పతనం, భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు, ఉపాధిని మింగేస్తున్న ఏఐ ద్వారా ఎదురవుతున్న సవాళ్లు...
మంచి టీమ్‌కి హెడ్‌గా ఉండటం, మంచి హెడ్ కింద టీమ్‌లో ఉండటం, రెండూ ఒకే విధమైన బాధ్యతలు! టీమ్‌లోని వాళ్లు టీమ్‌లో ఉంటూనే హెడ్‌గా పని చేయాలి, హెడ్‌గా ఉన్నవాళ్లు హెడ్‌గా ఉంటూనే టీమ్‌లో...
కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు...
మరో రికార్డ్ క్రియేట్ చేయబోతున్న FM నిర్మల సీతారామన్
కేంద్రం ఫోకస్ ఇదే..! భార్యాభర్తల కోసం ప్రత్యేక జాయింట్ ట్యాక్స్
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో విడత పాలన...
యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న...
మరో మూడు రోజుల్లో...!! 2026-27 బడ్జెట్ పై పార్లమెంట్ సమావేశాలు Union Budget 2026-27: Nirmala Sitharaman Presents 3-Day Budget Plan in Parliament!
లక్ష కోట్లు టార్గెట్..! కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధితో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రస్థానం కొనసాగుతుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి...
ప్రపంచవ్యాప్తంగా అలముకున్న అనిశ్చితికి తోడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు, పడిపోతున్న రూపాయి విలువ, ఉపాధి లేమి తదితరాలు హడలెత్తిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దేన్నయినా అంచనా వేయటమంటే కత్తి మీద...
కేంద్ర బడ్జెట్ 2026-27: జమిలీ బిల్లుతో పాటు కీలక బిల్లులు ఇవే!
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను (2026–27 ఆర్థిక సంవత్సరం) వచ్చే నెల (ఫిబ్రవరి) 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. గతేడాది జీఎస్టీలో శ్లాబులను క్రమబద్ధీకరించడం ద్వారా వినియోగానికి ఊతమిచి్చనట్టుగానే...
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28నుంచి మొదలుకానున్న దృష్ట్యా, సభా కార్యక్రమాల అజెండాపై చర్చించేందుకు కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు...
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నకేంద్ర బడ్జెట్ 2026ను మరికొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం వ్యయం, పన్నులు, అభివృద్ధి ప్రణాళికలపై తన దిశానిర్దేశాన్ని వెల్లడిస్తుంది...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రజెంటేషన్‌కు ముందు అనేక సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. అందులో ఒకటి హల్వా...
న్యూఢిల్లీ: జనవరి 28వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగా 27వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో ఎజెండాతోపాటు ఇతర...
దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం కొత్త పార్లమెంట్ భవనానికి మారినప్పటికీ, బడ్జెట్...
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కేంద్ర బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలని, రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఉప ముఖ్యమంత్రి...
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఇవి...
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA).. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కీలక తేదీలను ఆమోదించింది. పార్లమెంట్ క్యాలెండర్ ప్రకారం.. ఆర్థిక మంత్రి నిర్మలా...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీల ప్రకటన నేపథ్యంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆనవాయితీ ప్రకారం.. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అయితే ఈసారి ఆదివారం కావడంతో ఆ తేదీ మారవచ్చనే ఊహాగానాలు...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాన్యుడి నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ‘కేంద్ర బడ్జెట్’ ఈసారి ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 ఆర్థిక సంవత్సరం...
కేంద్ర ప్రభుత్వం ద్రవ్య నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, అమలు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో రుణభారం గణనీయంగా తగ్గిందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు కూడా...
న్యూఢిల్లీ: దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్కా బీమా సబ్కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లును మంగళవారం...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం టారిఫ్‌లు, ఇత ర రూపాల్లో ఆయుధాలు గా మారుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ కేవలం టారిఫ్‌లను ఎలా ఎదుర్కోవాలన్న దానికే పరిమితం కాకుండా, ఈ...
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ విద్యారంగ అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విద్యారంగం సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం...
న్యూఢిల్లీ: భారత్ డెడ్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను డెడ్...
ప్రైవేటీకరణ ఆపండి నిర్మలా సీతారామన్‌కు YSRCP ఎంపీల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వేగంగా చేయాలని ప్రయత్నిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఆపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరుతున్నారు. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల...
భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆదాయ...