దేశ ఆర్థిక దిశను నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు సమయం దగ్గరపడింది. ‘డిజిటల్ బహీ-ఖాతా’తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్తవ్య భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంట్లో బడ్జెట్ చదవడానికి ముందు ఆమె నేరుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి కారణాలేమిటి? సూట్‌కేస్ స్థానంలో వచ్చిన ‘డిజిటల్ బహీ-ఖాతా’ కథేంటి? వంటి వివరాలు మీకోసం..
రాష్ట్రపతిని ఎందుకు కలుస్తారు?
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక రాజ్యాంగ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి.
-
రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 112): భారత రాజ్యాంగం ప్రకారం, బడ్జెట్‌ను (వార్షిక ఆర్థిక నివేదిక) పార్లమెంట్లో ప్రవేశపెట్టే బాధ్యత నిజానికి రాష్ట్రపతిదే. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. అందుకే బడ్జెట్ ప్రసంగం చదవడానికి ముందు రాష్ట్రపతి నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
-
బడ్జెట్ అనేది ఒక ‘మనీ బిల్లు’. రాజ్యాంగం ప్రకారం ఏదైనా మనీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.
-
సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ‘పెరుగు-చక్కెర’ తినిపిస్తారు. ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇది దేశీయంగా ఒక శుభసూచకంగా భావిస్తారు.
-
రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు చేరుకుని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి (Cabinet) సమావేశంలో బడ్జెట్‌కు తుది ఆమోదం పొందుతారు.
#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary 'dahi-cheeni' (curd and sugar) ahead of her ninth consecutive Union Budget presentation. pic.twitter.com/WouiznFEMr
— ANI (@ANI) February 1, 2026
ఏంటి ఈ ‘డిజిటల్ బహీ-ఖాతా’?
బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న ‘లెదర్ బ్రీఫ్‌కేస్’ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ 2019లో నిర్మలా సీతారామన్ ‘బహీ-ఖాతా’ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎర్రటి వెల్వెట్ క్లాత్‌తో చేసిన బ్యాగ్. దీనిపై బంగారు రంగులో మన జాతీయ చిహ్నం (అశోక చక్రం) ముద్రించి ఉంటుంది. 2021 నుంచి కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్‌ను పేపర్‌లెస్‌గా మార్చారు. ఇప్పుడు ఆ ఎర్రటి బహీ-ఖాతా లోపల కాగితపు పత్రాలకు బదులుగా ఒక డిజిటల్ టాబ్లెట్ ఉంటుంది.
ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్‌కు వేళాయె..