Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ప్రధాని నామినేషన్‌
ADVERTISEMENT 

ప్రధాని నామినేషన్‌

National Sakshi User Sakshi Sakshi Time May 15, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
modi_9.jpg

వారణాసికి తరలివచ్చి న కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ పక్ష నేతలు 

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసి నుంచి ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్‌ దాఖలుచేశారు. మూడోసారి వారణాసి నుంచి బరిలో దిగిన మోదీకి మద్దతుగా కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని నామినేషన్‌ను ప్రతిపాదించిన నలుగురిలో ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు ఓబీసీలు, ఇక దళితుడు ఉన్నారు. పండిట్‌ జ్ఞానేశ్వర్‌ శాస్త్రి, బైజ్‌నాథ్‌ పటేల్, లాల్‌చంద్‌ కుష్వాహా, సంజయ్‌ సోంకర్‌లు మోదీ నామినేషన్‌ను ప్రతిపాదించారు. అయో« ద్యలో బాలరామాలయం ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండితుల్లో జ్ఞానేశ్వర్‌ శాస్త్రి కూడా ఒకరు. బైజ్‌నాథ్‌ పటేల్, లాల్‌చంద్‌ కుష్వాహా ఓబీసీలు కాగా, సోంకార్‌ బీజేపీ వారణాసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న దళిత నేత.

కలెక్టరేట్‌ నిండా ప్రముఖులే
బీజేపీ చీఫ్‌ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్, హర్‌దీప్‌సింగ్‌ పురీ, అనుప్రియా పటేల్, రాందాస్‌ అథవాలే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, మేఘాలయ సీఎం కాన్రాడ్‌ సంగ్మా, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, హిందుస్తానీ అవామ్‌ మోర్చా(ఎస్‌) వ్యవస్థాపకుడు జితన్‌ రాం మాంఝీ, రాష్ట్రీయ లోక్‌మోర్చా చీఫ్‌ ఉపేంద్ర కుష్వాహా, నిషద్‌ పార్టీ చీఫ్‌ సంజయ్‌ నిషద్, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీ చీఫ్‌ ఓంప్రకాశ్‌ రాజ్‌భర్, ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ జయంత్‌ చౌదరి, ఎల్‌జేపీ(రాంవిలాస్‌) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అన్బుమణి రాందాస్, తమిళ మానిల కాంగ్రెస్‌ చీఫ్‌ జీకే వాసన్, బీజేపీ నేత దేవనాథన్‌ యాదవ్, భారతధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి, అసోమ్‌ గణపరిషత్‌ అధ్యక్షుడు అతుల్‌ బోరాలు వారణాసి కలెక్టరేట్‌లో మోదీ నామినేషన్‌ కార్యక్రమా నికి హాజరయ్యారు.

 మోదీ నామినేషన్‌ వేయడానికి వస్తున్నారని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో వారణాసి కలెక్టరేట్‌కు వచ్చారు. నామినేషన్‌ వేశాక మోదీ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ఎన్‌డీఏ నేతలు మద్దతు గా ఇక్కడకు రావడం నాకు గర్వకారణం. దేశ ప్రగతికి, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఎన్‌డీఏ కూటమి కంకణబద్దమైంది. భవిష్యత్తు లోనూ ఇలాగే దేశ ప్రగతికి పాటుపడతాం’ అని మోదీ అన్నారు.  

దశశ్వమేథ్‌ ఘాట్‌లో పూజలు
నామినేషన్‌ వేయడానికి ముందు మోదీ మంగళవారం ఉదయం కాశీలో గంగా తీరాన దశశ్వమేథ్‌ ఘాట్‌లో పూజలు చేశారు. ఘాట్‌ వద్ద వేదమంత్రాల మధ్య గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పడవలో నమో ఘాట్‌కు వెళ్లారు. అక్కడి కాలభైరవ ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లారు. 

బూత్‌కు ‘370’ ఓట్లు ఎక్కువ పడాలి
నామినేషన్‌ తర్వాత కాశీలోని రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో కాశీ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమయ్యారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో రద్దయిన ఆర్టికల్‌ 370కి గుర్తుగా కాశీలోని ప్రతి బూత్‌లో గతంతో పోలిస్తే నాకు 370 ఎక్కువ ఓట్లు పడేలా చేసే బాధ్యత మీదే’ అని మోదీ అన్నారు. కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి మరింతగా ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలకు మోదీ విజయమంత్రాలను ఉపదేశించారని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్‌ యూపీ చీఫ్‌ అజయ్‌ రాయ్, బీఎస్పీ నేత అథ్‌హర్‌ జమాల్‌ లారీ మోదీకి పోటీగా బరిలో నిలబడ్డారు.

సొంత ఇల్లు, కారు లేదు  మోదీ అఫిడవిట్‌
మోదీ తన స్థిరచరాస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు. అఫిడవిట్‌ ప్రకారం.. మోదీకి సొంత భూమి, ఇల్లు, కారు లేవు. చేతిలో రూ.52,920 నగదు ఉంది. రూ.3.02 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2018–19లో రూ.11,14,230గా ఉన్న ఆదాయం 2022–23 వచ్చేసరికి రూ.23,56,080కు పెరిగింది. గాంధీనగర్‌ ఎస్‌బీఐ బ్రాంచీలో రూ.73,304, వారణాసి ఎస్‌బీఐ బ్రాంచీలో రూ. 7,000 నగదు ఉంది. ఎస్‌బీఐలో రూ.2.85 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. రూ.2.67 లక్షల విలువైన, 45 గ్రాముల బరువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి.

9.12 లక్షల విలువైన నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్లు ఉన్నాయి. నామినేషన్‌ పత్రాల్లో భార్య పేరును జశోదాబెన్‌గా పేర్కొన్న మోదీ ఆమె ఆస్తుల వివరాలు తనకు తెలియదని పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు. ఆయనకు అప్పులు కూడా లేవు. 1967లో ఎస్‌ఎస్‌సీ, 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ డిగ్రీ, 1983లో గుజరాత్‌ యూనివర్సిటీలో ఎంఏ పూర్తిచేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక ప్లాట్‌ ఉందని పేర్కొన్న మోదీ ఈసారి దానిని ప్రస్తావించలేదు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Lok Sabha Elections 2024
bjp
Narendra Modi
Nomination Files
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

బెంగాల్‌లో పొలిటికల్‌ ట్విస్ట్‌.. బీజేపీ యూటర్న్‌

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం.. మోదీ ఐదు సంకల్పాలు ఇవే..

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్‌.. ఏం జరుగుతోంది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

NEET ఎగ్జామ్‌ మిస్‌.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.