Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. National
  3. కుర్చీకి అతుక్కోకు.. రోగాలు తెచ్చుకోకు
ADVERTISEMENT 

కుర్చీకి అతుక్కోకు.. రోగాలు తెచ్చుకోకు

National Sakshi User Sakshi Sakshi Time Jun 28, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sitting.jpg

8 గంటలకు మించి కూర్చుంటే ముప్పే

ఊబకాయం మొదలు కేన్సర్లూ రావొచ్చు

చిన్నచిన్న విరామాలు, నడక వంటివి మేలు

రోజులో గంటల తరబడి కూర్చుని ఉండేవాళ్లలో.. అల్జీమర్స్‌ వంటి మెదడు సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు చాలా ఎక్కువట. అమెరికాలోని వాండర్‌బిల్ట్‌ యూనివర్సిటీ మే నెలలో విడుదల చేసిన అధ్యయనం చెప్పిన విషయమిది. ఎక్కువసేపు కూర్చుని ఉండే ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్, ఊబకాయం సమస్యలు వస్తున్నాయని ఫిబ్రవరిలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన వెల్లడించింది. 

రోజులో 8 గంటలు అంతకుమించి ఎక్కువ సమయం కూర్చుని ఉండిపోయేవాళ్లు మానసిక అనారోగ్యాలు, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్లు, ఒత్తిడి.. ఇంకా అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఎక్కువసేపు కూర్చోవడం అన్నది టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదాన్ని దాదాపు రెట్టింపు చేస్తుందట. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

గంటల తరబడి.. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులు, టీవీలకు అతుక్కుపోయేవాళ్లంతా పారాహుషార్‌. కూర్చున్నంతసేపూ సుఖంగానే ఉంటుంది కానీ.. తరువాత్తరువాత అనారోగ్యాలతో కష్టం తెలుస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు, పరిశోధకులు. ఎక్కువసేపు కూర్చోవడం లేదా శారీరక కదలికలు బొత్తిగా లేకపోవటం అన్న­వి శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్యాలకు దారి తీస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తం­గా వైద్య పరిశోధకులు గుర్తించారు. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కేలరీలు కరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. దాంతో బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మందగిస్తుంది. కొవ్వుల్ని, చక్కెరలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, శరీరానికి శక్తిని అందించే సామర్థ్యం తగ్గి అనారోగ్యాలు దరిచేరతాయి.

ఎక్కువసేపు కూర్చుంటే వచ్చేవి..
హృద్రోగాలు..: రక్త ప్రవాహం తగ్గడం, రక్త నాళాలలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం రక్తపోటుకు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.

టైప్‌ 2 మధుమేహం..: మన శరీరంలోని క్లోమం తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయలేకపోవడం లేదా శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం లేదా ఈ రెండింటి వల్లా టైప్‌ 2 మధుమేహం వస్తుంది. దీనివల్ల దాహం, అలసట, మసక దృష్టి, పుండ్లు గాయాల వంటివి నెమ్మదిగా నయమవడం లాంటివి జరుగుతాయి.

మస్క్యులోస్కెలెటల్‌ (అస్థి–కండరాల నొప్పి)..: కోర్‌ (ఉదరం, వీపు కటిభాగం సహా ప్రధాన దేహం), నడుము, కాళ్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో కదలికలు కష్టం అవుతాయి. వెన్ను, మెడ దృఢత్వాన్ని కోల్పోతాయి. వెన్నెముక అమరిక దెబ్బతింటుంది.

రక్త ప్రసరణ, రక్తనాళ సమస్యలు..: రక్త ప్రసరణ సాఫీగా జరగదు. దాంతో కాళ్లు, పాదాలలో రక్తం ఒక చోట చేరటం జరుగుతుంది. వాపు, కాళ్లలో ఉబ్బిన (వెరికోస్‌) సిరలు, రక్తం గడ్డకట్టటం లాంటివి  సంభవించవచ్చు.

కేన్సర్‌ ప్రమాదం..: పెద్దపేగు, రొమ్ము, మహిళల్లో గర్భాశయ సంబంధ కేన్సర్‌ల వంటివి వచ్చే ప్రమాదం ఉంది. తగ్గిన రక్త ప్రసరణ, జీవక్రియ మందగమనం కణుతుల పెరుగుదలకు, వ్యాప్తికి  దోహదం చేయవచ్చు.

మానసిక అనారోగ్యాలు..: ఎక్కువసేపు కూర్చోవటం అన్నది మొదట శరీరంపై ప్రభావం చూపి, మెల్లిగా మానసిక అనారోగ్యాల వైపు కూడా దారి తీయవచ్చు. మెదడు పరిమాణం తగ్గడం, (సెరిబ్రల్‌ ఎట్రొఫీ)  మెదడు కుంచించుకుపోతుంది, మతిమరుపు వస్తుంది.

వ్యాయామం చేస్తే సరిపోదా?
సరిపోతుంది. అయితే అది కొంతవరకు మాత్రమే. ప్రతిరోజూ 60 నుంచి 75 నిమిషాలు తేలికైన లేదా కఠినమైన వ్యాయామం చేయగలిగిన వారు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇది వైద్యులు సాధారణంగా సిఫార్సు చేసే దానికంటే ఎక్కువ వ్యాయామం. చాలామంది అంత చేయలేరు కూడా. అంత మాత్రాన నిరాశ చెందనవసరం లేదు. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయగలిగినా కూడా కూర్చోవటం వల్ల ముప్పిరిగొనే వ్యాధుల నుండి చాలావరకు తప్పించుకోవచ్చు. 

అయితే, అరగంట వ్యాయామం చేశాం కదా అని 6 గంటలపాటు కదలకుండా కూర్చుంటాం అంటే కుదరదు. రోజంతా కదులుతూ ఉండటం కూడా ముఖ్యమేనని పరిశోధకులు అంటున్నారు. అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకోవాలి. కనీసం అరగంటకోసారి లేచి నిల్చోవడం, కాసేపు నడవడం, ఫోన్‌ కాల్స్‌ సమయంలో నడుస్తూ మాట్లాడటం, ఒళ్లు సాగదీసుకోవడం వంటివి చేయాలి.

ఏ యూనివర్సిటీ ఏం కనుగొంది?
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐటీ ఉద్యోగుల మీద ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించాయి. ఎక్కువసేపు కూర్చోవటం, అధిక పనిగంటలు, పని ఒత్తిడుల కారణంగా వారిలో ఊబకాయం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (ఫ్యాటీలివర్‌ – ఎమ్‌ఏఎఫ్‌ఎల్‌డి) వంటి సమస్యలతో బాధపడుతున్నారట.

గంటల తరబడి కూర్చోవడాన్ని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఏకంగా ధూమపానంతో సమానమని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని పేర్కొంది.

ఎక్కువసేపు కూర్చుంటే వచ్చే దుష్ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. ఎలాంటి సమస్యలు వస్తాయని వారు చెప్పారంటే..

» యూనివర్సిటీ ఆఫ్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ (బ్రిటన్‌): హృద్రోగాలు, మధుమేహం
» యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో (అమెరికా) : చురుగ్గా ఉండే యువతలోనూ గుండె జబ్బులు, ఊబకాయం. 
» హార్వర్డ్‌ టి.హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (అమెరికా): టైప్‌ –2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్‌
»  యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌ (బ్రిటన్‌) : టైప్‌ 2 డయాబెటిస్, గుండె జబ్బులు. 
»  ఘెంట్‌ యూనివర్సిటీ (బెల్జియం) : (12–14 ఏళ్ల పిల్లల్లో) నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తక్కువ సేపు నిద్ర పోవడం
» యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ (ఆస్ట్రేలియా) : ఊబకాయం, హృద్రోగాలు, టైప్‌ – 2 డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల కేన్సర్లు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Alzheimers
study
sitting
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

మా ఆయన పాత ఫోన్‌ దాచేస్తున్నాడు!

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

ఏఐకి సిలబస్‌ తెలుసు! టీచర్‌కు నువ్వు తెలుసు!!

గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

గంటలతరబడి కుర్చీలో కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

అడపా దడపా సిగరెట్‌ కాలుస్తారా? ఈ విషయం తెలిస్తే...!

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.