Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. బద్దలైన హిమ సరస్సు.. భారత్‌ వైపు దూసుకొస్తున్న వరద ముప్పు!
ADVERTISEMENT

బద్దలైన హిమ సరస్సు.. భారత్‌ వైపు దూసుకొస్తున్న వరద ముప్పు!

National Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2026 09:23 AM IST Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
bhutan.jpg

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల ఘటన మరువకముందే.. ఇప్పుడు భూటాన్‌లో మరో హిమ సరస్సు బద్దలైనట్లు సమాచారం వెలువడటం ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతంలో ఒక్కసారిగా విరుచుకుపడిన ప్రకృతి విపత్తు.. ఇప్పుడు భారత్‌లోని నదీ పరివాహక ప్రాంతాలను వణికిస్తోంది. భూటాన్‌లోని షింటాఫు హిమ సరస్సు బద్దలవడంతో భారీగా వరద నీరు దిగువకు ప్రవహించే ప్రమాదం ఏర్పడింది.

ఈ నీటి ప్రవాహం భారత్‌లోకి చేరితే సంకోష్‌ నది ఉప్పొంగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌, అసోంలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. భూటాన్‌ నుంచి వచ్చే వరద నీరు భారత్‌-భూటాన్‌ సరిహద్దుకు ఆరు నుంచి ఎనిమిది గంటల్లో చేరవచ్చని అధికారులు తెలిపారు. దీంతో నదీ తీర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

భూటాన్‌లో ఏం జరిగింది?
భూటాన్‌లోని గాసా జిల్లాలో వాకిలా పర్వతం దిగువన ఉన్న షింటాఫు హిమ సరస్సు గురువారం సాయంత్రం బద్దలైనట్లు సమాచారం. ఈ సరస్సు భూటాన్‌లో ప్రమాదకరమైనవిగా గుర్తించిన 17 హిమ సరస్సుల్లో ఒకటి. ఘటన తర్వాత నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్లు మోగించారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. సరస్సు నుంచి ఎంతమేర నీరు విడుదలైంది? దిగువ ప్రాంతాలపై దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉండనుంది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

#WATCH | Alipurduar, West Bengal: On the preparedness for the effect of a Glacial Lake Outburst Flood (GLOF) at Shintaphu Lake in Bhutan, SP Amit Kumar Shaw said, "First of all, I would like to tell the residents of the district that there is absolutely no need to panic. The situation is currently under control. We are in constant touch with the authorities in Bhutan. Our police team, the District Magistrate (DM) and the Block Development Officer (BDO) with their respective teams, along with all relevant agencies and stakeholders are working together in close coordination. Our SDRF team is present, and an NDRF team is also on its way. A Civil Defence team is also deployed. We have already moved approximately 4,000 to 5,000 people into shelters, utilizing school buildings as relief centers. Additionally, more than 6,000 people have been relocated to safe areas...based on the current flow of water—and the latest information we have received—the intensity has decreased slightly, but we remain on high alert...the police, the DM’s office, and the BDO’s office have made arrangements for dry food and drinking water. We have also ensured that other necessities, such as toilet facilities, are provided. We will wait to see what the situation looks like in two hours. We are fully prepared and ready to handle any emergency that may arise. A red alert is currently in effect for the Sankosh river system...over the next few hours, we expect to see water flowing through the Sankosh River, likely accompanied by dead fish, as well as large pieces of wood and concrete debris..."

— ANI (@ANI) October 30, 2026

భారత్‌లో ఏయే ప్రాంతాలకు ముప్పు?
షింటాఫు సరస్సు ఉన్న ప్రాంతం పునత్సాంగ్చు నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈ నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సంకోష్‌గా ప్రవహిస్తుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌, జల్‌పైగురి, కూచ్‌బెహార్‌, డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలతో పాటు అసోంలోని ధుబ్రి జిల్లాకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యంగా సంకోష్‌ నది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని అధికారులు సూచించారు. నది ఉప్పొంగితే లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు, వంతెనలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

ఖాళీ చేయాలని మంత్రి హెచ్చరిక
పశ్చిమ బెంగాల్‌ అటవీ శాఖ మంత్రి మనోజ్‌ కుమార్‌ ఒరావ్‌ సంకోష్‌ నది తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. కుమార్‌గ్రామ్‌ ప్రాంతానికి గంట నుంచి గంటన్నరలోగా నీటి ప్రవాహం చేరే అవకాశం ఉందని వీడియో సందేశంలో హెచ్చరించారు. ప్రజలు ఆలస్యం చేయకుండా అప్రమత్తం కావాలని కోరారు. డార్జిలింగ్‌ ఎంపీ రాజు బిస్తా కూడా డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలు, తెరాయ్‌, డూవార్స్‌ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కూచ్‌బెహార్‌ జిల్లాలోని తుఫాన్‌గంజ్‌, బక్సిర్‌హాట్‌ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు.

#Breaking Flood alert in West Bengal and Assam after glacial burst in Bhutan which has flooded certain areas https://t.co/5hXAajLxav

— Yeshi Seli (@YeshiSeli) October 30, 2026

ఒక్కసారిగా విరుచుకుపడే వరద.. ఏమిటీ GLOF?
హిమానీనదాలు కరిగి ఏర్పడిన సరస్సుల్లో నిల్వ ఉన్న నీటిని అడ్డుకునే సహజ కట్ట తెగిపోవడం లేదా బలహీనపడటంతో నీరు ఒక్కసారిగా బయటకు దూసుకురావడాన్ని గ్లేసియల్‌ లేక్‌ అవుట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌ (GLOF) అంటారు. ఈ వరదలు పర్వత లోయల గుండా అత్యంత వేగంగా ప్రవహిస్తూ.. దారిలో మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను కూడా తీసుకెళ్తాయి. ఫలితంగా నదీ తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం భూటాన్‌లో సరస్సు బద్దలైన ఘటనతో భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. నీటి ప్రవాహం ఎంత వేగంగా, ఎంత పరిమాణంలో దిగువకు వస్తుందన్న దానిపైనే తదుపరి పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అధికారులు నదీ నీటిమట్టాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి: గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Bhutan
Glaciares
Nepal
West Bengal
assam
flood range
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. చెన్నై పర్యాటకుడు మృతి!

గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. చెన్నై పర్యాటకుడు మృతి!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

తండ్రి కల కోసం..ఆమె 59 ఏళ్ల వయసులో బస్సు కండక్టర్‌గా!

దేశంలోనే తొలిసారి.. మొదటి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ సెంటర్

దేశంలోనే తొలిసారి.. మొదటి ప్రభుత్వ ప్రోటాన్ థెరపీ సెంటర్

Nepal: ఆరుగురు భారత ట్రెక్కర్లు అదృశ్యం!

Nepal: ఆరుగురు భారత ట్రెక్కర్లు అదృశ్యం!

మెట్రో రైలు.. హుగ్లీ నది.. కోల్‌కతా జనజీవనం

మెట్రో రైలు.. హుగ్లీ నది.. కోల్‌కతా జనజీవనం

శాస్త్ర సాంకేతికలో వెస్ట్‌బెంగాల్‌ పురోగతి

శాస్త్ర సాంకేతికలో వెస్ట్‌బెంగాల్‌ పురోగతి

మరిన్ని వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. ఇద్దరు ట్రెక్కర్ల మృతి

పెళ్లిలో సెలబ్రిటీ ఫైరింగ్‌ : ఐదేళ్ల బాలుడు మృతి

పెళ్లిలో సెలబ్రిటీ ఫైరింగ్‌ : ఐదేళ్ల బాలుడు మృతి

రైల్లో మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఒకవేళ ఎదురైతే?

రైల్లో మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? ఒకవేళ ఎదురైతే?

 20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం

20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం

కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు!

కొత్త జంటకు వింత కానుక.. పాలు, పెరుగు ప్యాకెట్లు!

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft