Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search SubscribeSubscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ
download app యాప్ Download App
download ios download android
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. National
  3. ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు
ADVERTISEMENT

ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుంటే మేలు

National Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 07:48 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
SC.jpg

పంజాబ్‌ ప్రధాన కార్యదర్శిపై కేసు కొట్టివేత

ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ బకాయిలపై వివాదం

ధిక్కరణ కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే రావాలి. అప్పుడే వారు బాధ్యతగా వ్యవహరిస్తారు’’అని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది.

ఇందులో ఒక పిటిషన్‌ పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, డీఆర్‌ బకాయిల చెల్లింపులకు సంబంధించినది. ఈ కేసులో హైకోర్టు పంజాబ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఏ.పీ సిన్హాపై క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ బకాయిలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మరో ఆదేశాన్ని సవాలు చేస్తూ ఇంకో రెండు పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

మూడింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పంజాబ్‌ ప్రధాన కార్యదర్శి సహా పలువురు అధికారులపై క్రిమినల్‌ ధిక్కార చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ కేసు విచారణను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత హాజరుపై ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనూ కొట్టివేసింది. పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమిస్తేనే వారికి నిజమైన బాధ్యత ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం పంజాబ్‌లో ఉన్న ప్రభుత్వం దాదాపు రూ.13,000 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా పొందిందని రాష్ట్రం తరఫు న్యాయవాది బెంచ్‌ దృష్టికి తీసుకురాగా.. వచ్చే ఏడాది మార్చిలోగా ఎంత మొత్తం విడుదల చేయగలరో తెలపాలని కోరింది. ‘‘మీకు కొంత వెసులుబాటు ఇస్తున్నాం. సానుకూలంగా స్పందించండి’’అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను డిసెంబరు ఒకటవ తేదీకి వాయిదా వేసింది. ఆగస్టు మూడవ తేదీన హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పిటిషనర్లుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.  

ఇలా మొదలైంది... 
పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరవు భత్యం (డీఏ) బకాయిల వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్‌–హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కీలక మలుపు తిరిగింది. డీఏ బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం సూచించిన ప్రణాళికను హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ తిరస్కరించింది. జూన్‌ 30లోపు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులకు వర్తించే రేట్ల ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ విడుదల చేయాలని ఆదేశించింది. పంజాబ్‌ ప్రభుత్వం, పంజాబ్‌ స్టేట్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ ముందు సవాలు చేశాయి. డివిజన్‌ బెంచ్‌ ఆగస్టు 3న ప్రభుత్వం అప్పీళ్లను కొట్టివేసింది.

రెండు వారాల్లో బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పత్రికలు, సోషల్‌ మీడియా వంటి మాధ్యమాల్లో భారీ ప్రకటనలపై ఖర్చులు చేయవద్దని కూడా స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు అమలు కాలేదని ఉద్యోగులు, పెన్షనర్లు కొందరు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అక్టోబర్‌ 12న, ప్రధాన కార్యదర్శి కేఏపీ సిన్హాకు నోటీసు జారీ చేసింది. క్రిమినల్‌ ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సివిల్‌ ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు క్రిమినల్‌ కాంటెంప్ట్‌ చర్యలు ప్రారంభించడం సరికాదని వాదించారు. 

ఇదీ చదవండి: తెలంగాణ హౌసింగ్‌ బోర్డుకు సుప్రీంకోర్టు అల్టిమేటం

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Supreme court of India
Contract employees
government employees
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

ఏపీ ఎన్నారై డాక్టర్‌కు సుప్రీంకోర్టు షాక్‌...

బోఫోర్స్‌ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!!!

బోఫోర్స్‌ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!!!

కోర్టు ప్రొసీడింగ్స్‌ రిపోర్టీంగ్‌కు ఓకే 

కోర్టు ప్రొసీడింగ్స్‌ రిపోర్టీంగ్‌కు ఓకే 

‘సహజీవన’ హింస నేరమే!

‘సహజీవన’ హింస నేరమే!

జంతర్‌ మంతర్‌ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం

జంతర్‌ మంతర్‌ కథే వేరు.. 300 ఏళ్ల ఆసక్తికర ప్రయాణం

జంతర్‌ మంతర్‌కు ప్రత్యామ్నాయ వేదిక?!

జంతర్‌ మంతర్‌కు ప్రత్యామ్నాయ వేదిక?!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.