Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

'జయం' నుంచి బన్నీని తీసేశారు.. ఆ కోపంతోనే 'గంగోత్రి': చిన్నికృష్ణ

Movies Sakshi User Sakshi Sakshi Time Aug 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Chinni-Krishna.jpg

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. 'పుష్ప' రెండు సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఇలాంటి నటుడికి కెరీర్ ప్రారంభం కాకముందే ఎదురుదెబ్బ తగిలిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. స్వయానా ఈ విషయాన్ని రచయిత చిన్నికృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. గంగోత్రి, ఇంద్ర లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు కథలు అందించిన ఈయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీని జయం నుంచి తీసేయడం, 'గంగోత్రి'తో పరిచయం చేయడం లాంటి విషయాన్ని చెప్పారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్.. ఆ నలుగురు!)

చిన్నికృష్ణ ఏం చెప్పారంటే?
'ఓ రోజు ఉదయం నాకొక ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా పరిచయమవుతున్నాడని చెప్పారు. అశ్వనీదత్ ఆఫీసులో చిన్న పార్టీ పెట్టడంతో అందరం కలిశాం. తేజ అనే డైరెక్టర్.. అల్లు అర్జున్‌ని అరంగేట్రం చేయిస్తున్నాడని చెప్పడంతో అందరూ కంగ్రాట్స్ చెప్పి ఇంటికెళ్లిపోయాం. అదే తేజ.. డిస్ట్రిబ్యూటర్ కొడుకు నితిన్ అనే అబ్బాయిని పెట్టి 'జయం' అనే సినిమా తీస్తున్నాడని ఆ తర్వాత పేపర్‌లో చూసి షాకయ్యాను. ఆ మార్పు ఎలా జరిగిందనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అల్లు అర్జున్‌తో అనుకున్న మూవీని మరో హీరోతో తీస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో ఫీలయ్యాం'

'మన దేశంలోని పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. అలాంటి స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో సినిమా చేస్తానని చెప్పి, ఆ విషయం పేపర్‌లో వచ్చిన తర్వాత తీసేయడంతో అల్లు అర్జున్ చాలా ఫీలయ్యాడు. అలా చేస్తే ఎవరైనా ఫీలవుతారు అది సహజం. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్లలో ఒకడిని కాబట్టి నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత అర్జున్ నా దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో రాఘవేంద్రరావు గారు.. తన 100వ సినిమాకు పనిచేయమని నన్ను అడుగుతున్నారు. దీంతో రజినీకాంత్ కోసం రాస్తున్న స్టోరీ ఆపేశారు. అల్లు అర్జున్‌కి వెంటనే మాటిచ్చి అల్లు అరవింద్‌కి ఫోన్ చేశా'

(ఇదీ చదవండి: మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ సర్కారు కీలక బాధ్యతలు)

'365 రోజుల్లో మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అవుతుంది, ఇది రాసిపెట్టుకోండి అని ఆయనతో చెప్పాను. అలా కథ రాసి ఇచ్చాను. అదే 'గంగోత్రి'. 175 రోజులు ఆడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కొన్ని చోట్ల 'ఇంద్ర' మూవీ కలెక్షన్ కూడా దాటేసింది' అని రైటర్ చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం మెగా, బన్నీ అభిమానుల మధ్య చర్చకు కారణమైంది.

'జయం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని బన్నీ చేజార్చుకున్నప్పటికీ.. 'గంగోత్రి'తో హిట్ కొట్టాడు. కానీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్స్ విషయమై అప్పట్లో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. కానీ మూవీ మూవీకి ఓవైపు యాక్టింగ్ మెరుగుపరుచుకుంటూనే మరోవైపు లుక్ కూడా మార్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు బన్నీ ఎదిగాడు. 'పుష్ప' తొలి భాగానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నాడు.

(ఇదీ చదవండి: లైఫ్‌ అంతా అల్లు అర్జున్‌కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Allu Arjun
chinni krishna
Gangotri
jayam
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.