Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

Vidudhala Movie Review: వెట్రిమారన్‌ ‘విడుదల పార్ట్‌-1’ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Apr 15, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Viduthala-telugu-review.jpg

టైటిల్‌: విడుదల పార్ట్‌-1 

నటీనటులు: సూరి, విజయ్‌ సేతుపతి,భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు 

నిర్మాత : ఎల్రెడ్ కుమార్

దర్శకత్వం: వెట్రిమారన్

సంగీతం: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్ 

విడుదల తేది: ఏప్రిల్‌ 15, 2023

Actor Soori In Vidudhala Part 1 Movie

కథేంటంటే.. 

పోలీసులకు, ప్రజా దళం అనే ఒక రివల్యూషనరీ గ్రూప్ కి మధ్య నడిచే కథ ఇది. కుమరేశన్‌ (సూరి) పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్‌ ఇస్తారు. అక్కడ ప్రజాదళం సభ్యులకు, పోలీసులకు నిత్యం ఎన్‌కౌంటర్‌ జరుగుతుంటాయి. ప్రజాదళం లీడర్‌ పెరుమాళ్‌(విజయ్‌ సేతుపతి)ని పట్టుకునేందుకుప్రైవేట్‌ కంపెనీతో కలిసి క్యాంపుని నిర్వహిస్తుంది పోలీసు శాఖ. ఇక డ్రైవర్‌ కుమరేశన్‌ అడవిప్రాంతంలో డ్యూటీ చేసే పోలీసులకు నిత్యం ఆహారం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో అడవిలో నివసించే యువతి తమిళరసి అలియాస్‌ పాప(భవాని శ్రీ)తో ప్రేమలో పడతాడు.

Vidudhala Part 1 Movie Images

మరోవైపు తనపై అధికారికి తెలియకుండా  కొండ ప్రాంతానికి చెందిన మహిళను కాపాడి అతని ఆగ్రహానికి గురవుతాడు. ఓసారి పెరుమాళ్‌ ఆచూకి కోసం కొండప్రాంతంలో నివసించేవారందరిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కి తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతుంటారు. అందులో కుమరేశన్‌ ఇష్టపడిన యువతి తమిళరసి కూడా ఉంటుంది. పోలీసులు పెట్టే చిత్ర హింసలు చూడలేక కుమరేశన్‌ ఏం చేశాడు? పెరుమాళ్‌ కోసం సాగించే వేటలో కుమరేశన్‌ ఎలాంటి పాత్ర పోషించాడు? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? చివరకు పెరుమాళన్‌ దొరికాడా? లేదా? అనేదే మిగతా కథ. 

Vidudhala Part 1 Movie Review In Telugu

ఎలా ఉందంటే..

కల్ట్ కంటెంట్ తో సామాజిక మూలలలోకి వెళ్లి కథలని తెర పై ఆవిష్కరించి బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టే దర్శకుడు వెట్రిమారన్‌. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సమాజంలో అణచివేయబడుతున్న ఒక వర్గం వేదన కనిపిస్తుంది. మనం ఎక్కడో విన్న, చూసిన సంఘటలనే ఆయన సినిమాగా తెరకెక్కిస్తుంటాడు. విడుదల పార్ట్‌ 1 కూడా ఆ తరహా సినిమానే. 1987 ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం లోని ఒక ప్రాంతం లో జరిగే కథ. పోలీసులకు, ప్రజాదళం అనే ఒక విప్లవ పార్టీ కి మధ్య జరిగే సంఘర్షణ ఇది.

ట్రైన్‌ యాక్సిడెంట్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. రైలు ప్రమాదపు దృశ్యాలను చాలా సహజంగా చూపించాడు. ఆ తర్వాత కథ మొత్తం కుమరేశన్‌ పాత్ర చుట్టూ తిరుగుతుంది. నిజాయితీగా ఉండే పోలీసులకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? పై అధికారులు కిందిస్థాయి అధికారులతో ఎలా ప్రవర్తిస్తారనేది కుమరేశన్‌ పాత్ర ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు కారణంగా సామాన్య ప్రజలు ఎలా నలిగిపోయారనే కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం లేదు. తమిళ నెటివిటీ మరీ ఎక్కువైంది.

కాకపోతే ప్రతి సన్నివేశాన్ని చాలా సహజంగా తీర్చిదిద్దారు. కొన్ని సన్నివేశాలు హృదయాలను కలిచివేస్తాయి. ముఖ్యంగా పెరుమాళ్‌ కోసం ఊర్లోని ఆడవాళ్లను పోలీసులు హింసించే సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి. అదే సమయంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పార్ట్‌ 2 కోసం కొన్ని అనవసరపు సన్నివేశాలను జోడించారనిపిస్తుంది.   క్లైమాక్స్‌ మాత్రం ఆట్టుకోవడంతో పాటు పార్ట్‌ 2పై ఆసక్తిని పెంచేస్తుంది.

Vijay Sethupathi In Vidudhala Part 1 Movie

ఎవరెలా చేశారంటే..

కమెడియన్‌గా ఇన్నాళ్లు నవ్వించిన సూరి.. ఇందులో కొత్త పాత్రను పోషించాడు. కుమరేశన్‌ పాత్రలో సూరి జీవించేశాడు. అసలు ఈ పాత్ర కోసం వెట్రిమారన్‌..  సూరిని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కమెడియన్‌లో ఈ యాంగిల్‌ ఎలా పసిగట్టాడనిపిస్తుంది. ఈ చిత్రంతో సూరి కేరీర్‌ చేంజ్‌ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌గా విజయ్‌ సేతుపతి అదరగొట్టేశాడు. ఆయన తెరపై కనిపించేంది కొన్ని నిమిషాలే అయితే.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. పార్ట్‌ 2లో విజయ్‌ సేతుపతి పాత్ర నిడివి ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Viduthalai Part 1 Movie Sets Photos

కొండప్రాంతానికి చెందిన యువతి పాప అలియాస్‌ తమిళరసిగా భవాని శ్రీ అద్భుతంగా నటించింది. గౌతమ్‌ మీనన్‌, రాజీవ్‌ మీనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరామెన్‌ పనితీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

రేటింగ్‌ : 2.75/5

-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Vidudhala Part1
Vetri Maaran
Soori
Vijay Sethupathi
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.