Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

పటాకులు.. బిర్యానీ, ఈ రెండూ ఉంటేనే పండగ: వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Oct 20, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Varalaxmi-Sarathkumar.jpg

‘‘దీపావళి అంటే దీపాలు... రంగు రంగుల ముగ్గులు... లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌. అది మాత్రమే కాదు... తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చెప్పారు. ఈ విశేషాలతో పాటు దీపావళి ముచ్చట్లను ‘సాక్షి’తో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు.

⇒ నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు... బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ... ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను... జస్ట్‌ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).

⇒ మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్‌ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు... ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీపావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో... చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.

⇒ దీపావళి అంటే రంగు రంగుల లైట్లు... బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్‌కి కాస్త దూరం అని చెప్పాను కదా... నా హజ్బెండ్‌ (నికొలయ్‌ సచ్‌దేవ్‌) కూడా క్రాకర్స్‌కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్‌. 

⇒ నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్‌ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్‌గా ఉంటారు. డైరెక్షన్‌ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్‌ చేశారు. నిక్‌ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది.                                              

దీపావళి స్పెషల్‌ డైరెక్షన్‌
ఈ దీపావళికి నా కెరీర్‌ పరంగా స్పెషల్‌ అంటే ‘డైరెక్షన్‌’. దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అయితే టైమ్‌ కుదరాలి. ఇప్పుడు సెట్‌ అయింది. దోస డైరీస్‌ బేనర్‌పై నా డైరెక్షన్‌లో ‘సరస్వతి’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాని నా∙సోదరి పూజా శరత్‌కుమార్‌ నిర్మిస్తారు. ఈ సినిమాలో నేను నటిస్తాను కూడా. థ్రిల్లర్‌ మూవీగా ‘సరస్వతి’ ఉంటుంది. త్వరలో షూటింగ్‌ ఆరంభిస్తాం.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
varalakshmi sarathkumar
interview with sakshi
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.