Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Vanda-Devullu-Movie-Review.jpg

టైటిల్‌: వంద దేవుళ్లు
నటీనటులు: విజయ్‌ ఆంటోనీ, శ్వాసిక, అజయ్‌ దిషాన్‌, లిజోమోల్‌ జోసే, కరుణాస్‌ తదితరులు
నిర్మాణ సంస్థ:విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
నిర్మాత:రామాంజనేయులు జవ్వాజి
దర్శకత్వం: శశి
సంగీతం: బాలాజీ శ్రీరామ్‌
సినిమాటోగ్రపీ: ఎస్‌బీ దర్శన్‌ కిర్లోష్‌
ఎడిటర్‌: హరీష్‌ యువరాజ్‌
విడుదల తేది: జూన్‌ 19, 2026

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి చిత్రం  తెలుగులోనూ రిలీజ్‌ చేస్తున్నారు. అలా రిలీజ్‌ అయిన కొత్త చిత్రమే ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ట్రైలర్‌ని కట్‌ చేసి సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశారు. ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేశారు. ఇలా భారీ అంచనాలతో నేడు(జూన్‌ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


కథేంటంటే.. 
పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్‌ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్‌ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్‌(అజయ్‌ దిషాన్‌), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్‌ బీటెక్‌ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్‌ మాస్టర్‌ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్‌ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 

ఎలా ఉందంటే..
చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు.. సంసార జీవితం ఆస్వాదించే వయసుకొచ్చేసరికే భర్తను కోల్పోవడం.. తర్వాత పిల్లలే ప్రపంచంగా బతికే ఓ తల్లి కథ ఇది. కాలం మారినా ఇప్పటికీ కొన్ని కట్లుబాట్లు మాత్రం మారడం లేదు. చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఒక మహిళకు ‘వితంతువు’ అనే శిక్ష వేసి జీవితాంతం బంధీగానే ఉంచేస్తుంది ఈ సమాజం. భార్యను కోల్పోయిన భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడం సులభం కానీ భర్తను కోల్పోయిన ఒక మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ అంత ఈజీ కాదు. మగాళ్లతో పాటు తోటి ఆడవాళ్లు కూడా అదేదో పెద్ద తప్పుగానే భావిస్తున్నారు. మళ్లీ పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్లుగా చూస్తున్నారు. అదొక్కటే కాదు శారీరక అవసరాలతో పాటు ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం అని చాట చెప్పిన సినిమా వంద దేవుళ్లు. సినిమా చూస్తున్నప్పుడు ఎంతో మంది అమ్మల జీవితాలు మన కళ్లముందు మెదలుతాయి. ఇదే కాన్సెప్ట్‌తో దాదాపు 30 ఏళ్ల కిత్రం ‘మా నాన్నకు పెళ్లి’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్‌ వాళ్ల నాన్న కృష​ం రాజుకు మళ్లీ పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇందులో హీరో అజయ్‌ దిషాన్‌ తన తల్లికి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం చాలా తేడానే ఉంది. ఈ సినిమాలో చాలా సున్నితమైన అంశాలను చర్చించారు. పాతికేళ్ల వయసులోనే భర్తను కోల్పోతే.. ఆ మహిళ జీవితాంతం ఒంటరిగానే ఉండాలా? ఆమెకు కూడా శారీరక అవసరాలు ఉంటాయి కదా? దాన్ని ఎందుకు తప్పుగా చూస్తారు? తోడు వెతుక్కుంటే తప్పేంటి? అనే అంశాలను ఇక్కడ చాలా సహజంగా చర్చించారు.  ‘నేను కూడా అందరిలాగానే ఉప్పుకారం తింటున్నాను కదా? నాకు కూడా కూడా కోరికలు ఉండవా?’ అని ప్రారంభంలోనే అమ్మ పాత్రతో చెప్పించి, అసలు కథను ప్రారంభించాడు. 

పిల్లలు పెద్దయిన తర్వాత తల్లికి మళ్లీ పెళ్లి ఆలోచన రావడం..  ఒక కొడుకు ప్రేమ‌తోనూ, మ‌రొక కొడుకు పెళ్లితోనూ ఆ పెళ్లిని ముడి పెడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండాఫ్‌ మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏడు కొండలు పాత్ర ఎంట్రీ తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. యూట్యూబ్ కంటెంట్ నేప‌థ్యంలోని స‌న్నివేశాలూ న‌వ్విస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్‌ బాగుంటుంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు అలాంటి క్లైమాక్స్‌ ఊహించలేం. 


ఎవరెలా చేశారంటే..
విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో పాత్రలో జీవించేశారు. హీరోయిన్ శ్వాసిక తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్‌బీ దర్శన్‌ కిర్లోష్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా రిచ్‌గా అనిపించింది. బాలాజీ శ్రీరామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. హరీష్‌ యువరాజ్‌ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
2.75/5
Tags:
Vanda Devullu Movie
vijay antony
Movie review
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.