Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

‘వనవీర’ మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Jan 1, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
moviereview.jpg

టైటిల్‌: వనవీర
నటీనటులు : అవినాష్ తిరువీధుల, సిమ్రాన్ చౌదరి, నందు, ఖడ్గం పృథ్వీ, కోన వెంకట్, సత్య, ఆమని, శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి, తదితరులు
నిర్మాణ సంస్థ: సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్
నిర్మాతలు : అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి
దర్శకత్వం: అవినాష్ తిరువీధుల
సంగీతం: వివేక్‌ సాగర్‌
విడుదల తేది: జవవరి 1, 2026

కథేంటంటే..
అగ్ర కులానికి చెందిన దేవా(నందు).. ఈ సారి గోదావరి జిలాల్లోని వనపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటాడు. సీనియర్‌ నేత మనోహర్‌(కోన వెంకట్‌) చెప్పడంతో నవ నిర్మాణ పార్టీ అదిష్టానం దేవాకి టికెట్‌ ఇస్తుంది. ప్రచారంలో భాగంగా బైక్‌ ర్యాలీ నిర్వహిస్తాడు. ఈ ర్యాలీకి అదే ప్రాంతానికి చెందిన రఘు(అవినాష్‌ తిరువీధుల) బైక్‌ని బలవంతంగా తీసుకెళ్తారు. మరుసటి రోజు నుంచి తన బైక్‌ ఇవ్వమని పార్టీ నేత బసవన్న(ప్రభాకర్‌) చుట్టూ తిరుగుతాడు. బైక్‌ కోసమే పార్టీలో చేరతాడు. తన తరుపున మరో 250 మందిని పార్టీలో చేరిపిస్తాడు. ఇష్టం లేకపోయినా..పార్టీ ఆఫీసులో టీ సప్లై చేస్తాడు. అయినప్పటికీ బైక్‌ ఇవ్వకపోవడంతో చివరకు దేవాతో కూడా గొడవకు దిగి..అతనిపై పోటీగా మరో వ్యక్తిని బరిలోకి దింపుతాడు. కేవలం బైక్‌ కోసమే రఘు..దేవాతో వివాదానికి దిగాడా? లేదా వేరే కారణం ఏమైనా ఉందా? రఘు అన్నయ్యకు దేవాకు ఉన్న సంబంధం ఏంటి? రఘు తండ్రి(శివాజీ రాజా)కి ఏమైంది? ఈ కథలో ఆమని పాత్ర ఏంటి? రామాయణ గాథకు హీరో చేసే పోరాటానికి మధ్య ఉన్న సంబంధం ఏటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఎలాంటి కథకైనా పురాణాల‌తో ముడిపెడుతూ సినిమాలు తీయ‌డం ఇప్పుడో ట్రెండ్‌. వనవీర కూడా అలాంటి ప్రయత్నమే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్‌ డ్రామాకి పురాణాల టచ్‌ ఇచ్చి రొటీన్‌ కథనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో కులం, రాజకీయాలు వంటి సున్నిత అంశాలను చర్చించారు. తండ్రి-కొడుకు బంధాన్ని కూడా అద్భుతంగా చూపించారు.

రామాయణం, వానరసైన్యం గొప్పదనాన్ని తెలియజేస్తూ.. ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి యుగంలో వనవీరుడు పుడుతూనే ఉంటారంటూ ఈ సినిమా కథను ప్రారంభించారు. పెద్ద చదువులు చదువకొని ఊర్లో ఖాలీగా ఉంటున్న యువకుడిలా హీరో పాత్ర పరిచయం.. తండ్రితో అతనికి ఉన్న అనుబంధం.. మరదలు (సిమ్రాన్ చౌదరి)తో ప్రేమాయణం..ఇలా రొటీన్‌ సీన్లతో ఫస్టాఫ్‌ అంతా సాదాసీదాగా సాగుతుంది. బైక్‌ కోసమే హీరో చేసే పనులన్నీ తొలుత సిల్లీగా అనిపిస్తాయి కానీ సెకండాఫ్‌ చూశాక..ఆశ్చర్యం కలుగుతుంది. ఇంటర్వెల్‌ వరకు కథనం సాదాసీదాగా సాగుతుంది. 

అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. హీరో చేసే ప్రతి చిల్లర పని వెనుక ఓ కారణం ఉండడం.. ఒక్కో ట్విస్టు రివీల్‌ అవుతుంటే ప్రేక్షకుల్లో కథనంపై ఆసక్తి అమాంతం పెరిగిపోతుంది. చివరిలో ఊహించని ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఓ క్యామియో రోల్‌ కూడా సినిమా స్థాయిని పెంచేలా చేసింది.  ఇప్పటికీ కొన్ని చోట్ల కుల వివక్ష ఉందని, గ్రామాల్లో అగ్రకులం వాళ్లు తక్కువ కులం వాళ్లను ఎలా చూస్తారనేది ఇందులో కాస్త లోతుగానే చూపించారు. చివరిలో మన ఇతిహాసాలకు ఈ కథకు ముడిపెట్టిన విధానం బాగుంది. తక్కువ బడ్జెట్‌ సినిమా అయినప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి..  వానర సైన్యం విజువల్స్‌ని వండర్‌ఫుల్‌గా చూపించారు. అయితే కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగడం.. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అవ్వడం కాస్త మైనస్‌ అని చెప్పొచ్చు. 

ఎవరెలా చేశారంటే..
హీరోగా, దర్శకుడిగా అవినాష్ మంచి ప్రతిభను కనబరిచాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. నందు విలనిజం బాగా పండించాడు. గ్రామీణ యువతీగా సిమ్రాన్‌ బాగా చేసింది. హీరోగా తండ్రిగా శివాజీ రాజా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కోన వెంకట్‌, ఆమని, దేవి ప్రసాద్, ప్రభాకర్.. మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్: 2.75/5

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
avinash
simran
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.