మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'శివం భజే', 'తిరగబడరా సామీ', 'ఉషా పరిణయం', 'బడ్డీ' సినిమా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ ఒక్క దానిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 20 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓవరాల్ లిస్టులో నాలుగు మాత్రం ఉన్నంతలో చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి.
(ఇదీ చదవండి: హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత)
ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. రాజమౌళి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ 'మోడ్రన్ మాస్టర్స్', త్రిష 'బృందా' సిరీస్‌తోపాటు కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ పార్ట్ 2 లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలు కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఉన్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది దిగువన లిస్ట్ చూసేద్దాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 29 నుంచి ఆగస్టు 4 వరకు)
నెట్‌ఫ్లిక్స్
-
ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01
-
బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేసియన్ మూవీ) - ఆగస్టు 01
-
లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 01
-
మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ సినిమా) - ఆగస్టు 01
-
అన్ స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01
-
మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ) - ఆగస్టు 02
-
సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02
-
జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్) - ఆగస్టు 03
అమెజాన్ ప్రైమ్
-
ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29
-
బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 01
హాట్‌స్టార్
-
ఫ్యుచరమా సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 29
-
నో వే ఔట్ (కొరియన్ సిరీస్) - జూలై 31
-
కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 02
బుక్ మై షో
-
ద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 02
జియో సినిమా
-
డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 01
-
గుహ్డ్ చడీ (హిందీ మూవీ) - ఆగస్టు 01
-
టరోట్ (ఇంగ్లీష్ ఫిల్మ్) - ఆగస్టు 03
-
దస్ జూన్ కీ రాత్ (హిందీ సిరీస్) - ఆగస్టు 04
సోనీ లివ్
-
బృందా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 02
ఆపిల్ ప్లస్ టీవీ
-
ఉమెన్ ఇన్ బ్లూ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 31
(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))