2003లో సంచలనం సృష్టించిన స్టాంప్ పేపర్ కుంభకోణం ఆధారంగా తుషార్ హీరానందని తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ'. హిట్ సిరీస్ ‘స్కామ్ 1992’ని తెరకెక్కించిన హన్సల్ మెహతా నిర్మించారు. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. గతనెలలో ఓటీటీలో రిలీజైన పార్ట్-1 హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
(ఇది చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్న 29 సినిమాలు)
ఈ నేపథ్యంలో పార్ట్-2 ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. పార్ట్-2 రిలీజ్‌పై సోనీలివ్ ట్వీట్ చేసింది. స్కామ్ 2003 పార్ట్-2 నవంబరు 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది. తొలిభాగంలో ఈ సిరీస్‌ను ఐదు ఎపిసోడ్స్‌లో చూపించారు. రెండో భాగంలో కూడా దాదాపు ఐదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
Sabki zubaan pe tha Telgi ka naam, par Telgi ki zubaan pe kiska? Find out on 3rd November!
Scam 2003-The Telgi Story, all episodes, streaming on 3rd November, only on Sony LIV
#Scam2003OnSonyLIV #Scam2003
Thanking @BajpayeeManoj for lending his incredible voice ✨ pic.twitter.com/wLz04HZLcW— Sony LIV (@SonyLIV) October 18, 2023