Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్‌ ఎక్కడ?

Movies Sakshi User Sakshi Sakshi Time Jul 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Tini-Tom-Apologises.jpg

ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే మన హీరోలు అపసోపాలు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి వారు ఏడాదికి ఆరేడు సినిమాలు ఈజీగా చేసేవారు. తర్వాతి తరం హీరోలు కూడా మొదట్లో అదే ఫాలో అయ్యారు. నెమ్మదిగా ఇప్పుడా సంఖ్య ఒకటీరెండుకు వచ్చేసింది. ఈ తరం హీరోలైతే ఏకంగా ఏడాదికో, లేక రెండుమూడేళ్లకో ఒక సినిమా చేస్తున్నారు.

ఒక్క హీరోయిన్‌తో 130 చిత్రాలు
అప్పట్లో మలయాళ స్టార్‌ హీరో ప్రేమ్‌ నజీర్‌ (Prem Nazir) ఏడాదికి ఒకటీరెండు కాదు ఏకంగా 30 సినిమాలు చేసేవారు. ఆ లెక్కన ఆయన ఏడువందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు. తన కెరీర్‌లో దాదాపు 80 మంది హీరోయిన్లతో కలిసి పని చేశారు. అందులోనూ ఓ హీరోయిన్‌(షీల)తో ఏకంగా 130 సినిమాలు చేయడం విశేషం! ఈయన తెలుగులో ఆకలి, తండ్రి చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలిగిన నజీర్‌ 1989లో కన్నుమూశారు. 

సినిమా ఛాన్స్‌ కోసం కన్నీళ్లు
అయితే నజీర్‌ చివరి రోజుల్లో అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్నారని నటుడు టిని టామ్‌ వ్యాఖ్యానించాడు. ఛాన్సులిప్పించమని అడూర్‌ భసి, బహదూర్‌ వంటి నటుల ఇళ్లకు వెళ్లి కన్నీళ్లతో వేడుకునేవారని ఆయన పేర్కొన్నాడు. ఈ కామెంట్స్‌పై సీనియర్‌ నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ భాగ్యలక్ష్మి మండిపడింది. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. 1985 వరకు మేమందరం నజీర్‌తో కలిసి పని చేసినవాళ్లమే! ఆయన జీవితాన్ని దగ్గరి నుంచి చూసిన మా అందరికీ టినీ కామెంట్స్‌ బాధ కలిగించాయి. 


చివరి రోజుల్లో..
ప్రేమ్‌ నజీర్‌ చనిపోవడానికి ముందు కూడా ఆయన్ను కలిశాను. తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు.  ప్రశాంత జీవనం గడిపాడు. తనకు సినిమా అవకాశాలు వచ్చినా సరే.. వేరొకరికి ఇవ్వమని సూచించేవాడు. అలాంటిది చివరి రోజుల్లో అవకాశాల్లేక ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడని చెప్పడం కరెక్ట్‌ కాదు. నజీర్‌ బతికున్నప్పుడు టిని ఇంకా సినిమాల్లోకే రాలేదు. వాళ్లూవీళ్లు అనుకునే మాటలను నిజమని నమ్మి ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదు. 

ఎవరినీ అడుక్కోలేదు
యూట్యూబ్‌లో వ్యూస్‌ కోసం దివంగత నటుల గురించి లేనిపోని కథలు అల్లేస్తున్నారు. కనీసం ఇండస్ట్రీలో ఉన్నవారైనా వారి గురించి నిజాలు మాట్లాడితే బాగుంటుంది. ప్రేమ్‌ నజీర్‌ సినిమా ఛాన్సుల కోసం ఎప్పుడూ ఏడవలేదు. ఎవరినీ అడుక్కోలేదు. అలాంటి గొప్ప మనిషి గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయకండి అని ఘాటుగానే స్పందించింది.

క్షమించండి
దీంతో నజీర్‌ గురించి అలా మాట్లాడినందుకు టిని టామ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా క్షమాపణలు తెలిపాడు. నజీర్‌ సర్‌ను అభిమానించేవారిలో నేనొకరిని. ఆయన స్థానమెక్కడ? నేనెక్కడ? తనను ఒక్కసారి కూడా కలవనేలేదు. ఆయన గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తిని కాదు. తన ఇమేజ్‌ను చెడగొట్టాలన్న దురుద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో ఓ వ్యక్తి చెప్పినదాన్ని మీతో పంచుకున్నానంతే.. అయినప్పటికీ నావల్ల పొరపాటు జరిగింది కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నాడు.

చదవండి: 11 ఏళ్ల వయసులో స్కూల్‌ నుంచి పారిపోయిన కాజోల్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Malayalam actor
prem
Mollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.