Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

విజయాల శ్రీ‘లీల’వెనుక రహస్యాలివే...

Movies Sakshi User Sakshi Sakshi Time Apr 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sreeleela.jpg

యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్‌ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌  అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్‌ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది.  ఇప్పుడు కార్తీక్‌ ఆర్యన్‌ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్‌ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్‌ సాంగ్‌ హిట్‌ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్‌కార్పెట్‌ వేసింది. దాంతో సౌత్‌లోనూ ఆమె క్రేజ్‌ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్‌లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

ఇటీవల, ఈ చిత్రం సెట్‌ నుంచి అనేక వీడియోలు ఫొటోలు  ఆనలైన్‌ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.   ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్‌ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ  ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్‌ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్‌ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి.    

అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్‌లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్‌ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..

కన్నడ చిత్రం కిస్‌ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు  కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.

రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి.  ధమాకా (2022)లో, జింతాక్‌ పాటలో  చురుకైన  రిథమ్, గ్రేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్‌ డార్లింగ్‌గా మారింది.

పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్‌ కేసరి (2023)లో యాక్షన్‌ సీన్స్‌ వరకు శ్రీలీల తనలోని  షేడ్స్‌  స్కిల్స్‌ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023),  గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్‌కు సానబట్టింది.

భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం.  కన్నడ, తెలుగు, తమిళం  ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో  బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్‌ ఐకాన్‌గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్‌రోబ్‌  ఫ్యాషన్‌ ప్రియుల ఫేవరెట్‌ గా పేరొందింది.

అధిక ఫ్యాషన్‌తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్‌ లుక్స్‌ ఆమెను మ్యాగజైన్‌లపై, వెబ్‌సైట్స్‌లో తళుక్కుమనేలా  చేస్తున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె  స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది.  ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు  మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి   భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్‌ మోడల్‌గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Sreeleela
Kartik Aaryan
Pushpa 2: The Rule
Cinema News
Sakshi Guest Column
Satya Stories
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వింబుల్డన్ లో సందడి చేసిన.. హీరోయిన్స్ శ్రీలీల, కల్యాణి ప్రియదర్శన్ (ఫొటోలు)

వింబుల్డన్ లో సందడి చేసిన.. హీరోయిన్స్ శ్రీలీల, కల్యాణి ప్రియదర్శన్ (ఫొటోలు)

ఆగని 'గ్రేటర్‌ ఇజ్రాయెల్‌' పథకం

ఆగని 'గ్రేటర్‌ ఇజ్రాయెల్‌' పథకం

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌ హాజరు

సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌ హాజరు

శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్

శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్

‘మా నాన్నెవరో తెలుసా?’

‘మా నాన్నెవరో తెలుసా?’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.