Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

చిన్నతనంలోనే గద్దర్‌ మనసుకు గాయాలు.. అడుగడుగునా అవమానాలే!

Movies Sakshi User Sakshi Sakshi Time Aug 6, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Telugu-Singer-Activist-Gaddar.jpg

పదం ఆయన కోసం కదం తొక్కుతుంది. కళామతల్లి ఆయన పేరు చెప్తే పులకరించిపోతుంది. తెలంగాణ ఉద్యమంలో మూడక్షరాల పేరు మూడు కోట్ల మందిలో చైతన్యం తీసుకొచ్చింది. ఆయనే ప్రజాకవి గద్దర్‌. అందరికీ అర్థమయ్యేలా, ముచ్చట చెప్తున్నట్లుగా, రోమాలు నిక్కబొడిచేలా, పిడికిలి బిగించి పోరాటం చేసేలా పాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో పాటలు పాడారు.

ఆయన పాటలు, కళారూపాలు దేశంలోని దాదాపు అన్ని ఆదివాసీ భాషలు సహా 15 నుంచి 20 దాకా భారతీయ భాషల్లోకి అనువాదమైన చరిత్ర కూడా గద్దర్‌దే! కోట్ల మంది మనసులు గెలుచుకున్న ఆయన గొంతు నేడు(ఆగస్టు 6) శాశ్వతంగా మూగబోయింది. గద్దర్‌ అసలు పేరు విఠల్‌ రావు. ఆయన ప్రస్థానం అంత ఈజీగా సాగలేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాలేజీలో వెంట్రుకలు కత్తిరించి అవహేళన

తను ఎదుర్కొన్న వివక్ష గురించి గద్దరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. 'నా పేరు గుమ్మడి విఠల్‌ రావు.. చిన్నప్పటినుంచి క్లాస్‌లో ఫస్ట్‌. ఓసారి తరగతిలో టీచర్‌ ఉండి.. నీదే కులమని అడిగాడు. మేము అంటరానివాళ్లం అని చెప్పాను. మరి నీకెందుకు రావు? అని పేరు చివరన దాన్ని తీసేశారు. ఇప్పుడు నా పేరు రికార్డుల్లో గుమ్మడి విఠల్‌ అని మాత్రమే ఉంది. చదువులో నేను ముందుండేవాడిని. ఉస్మానియా కాలేజీలో చేరినప్పుడు నా వెంట్రుకలు కత్తిరించేవారు. మొజంజాహీ మార్కెట్‌లోని హాస్టల్‌ నుంచి ఉస్మానియా కాలేజీకి నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఓ పూట తిండి కోసం, కాలేజీ ఫీజు కోసం హోటల్‌లో పనిచేశాను' అని పేర్కొన్నారు.

(చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత)

గోచీ కట్టి, గొంగడి భుజాన వేసుకుని

ఊళ్లో మొదటి బెంచీ కుర్రాడైన గద్దర్‌ ఇక్కడ మాత్రం చివరి బెంచీలో కూర్చున్నారు. ఈ వివక్షే అతడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. సమాజాన్ని మార్చాలనుకున్నారు. పాటను తన ఆయుధంగా మలుచుకున్నారు. గోచీ కట్టి, గొంగడి భుజాన వేసుకుని ఎర్రజెండా చేతపట్టుకుని గద్దర్‌ పాట పాడుతూ నృత్యం చేస్తుంటే చూసేవాళ్లకు సాక్షాత్తూ శివుడు తాండవం చేస్తున్నట్లుగా అనిపించేది. అయితే దేవుడి గుడిలో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్దలు.. దళితుడైన విఠల్‌ రావును వేదిక మీది నుంచి కాకుండా కింద ప్రదర్శన ఇవ్వాలనే షరతు పెట్టారు.

బ్యాంకు ఉద్యోగం చేసిన తొలినాళ్లలో విమలను పెళ్లి చేసుకున్నాక ఆయన కులం తెలిసి ఎవరూ అద్దెకిచ్చేవారు కాదు. దీంతో వేరే కులం పేరు చెబుతూ అద్దె ఇళ్లలో కాపురం చేసేవారు. ఈ అసమానతల ప్రపంచంలో ఉనికిని చాటుకునే క్రమంలో గద్దర్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. బుర్ర కథ కళాకారునిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం (1969)లో పాల్గొని అరెస్టు కావడం, గుడిసెవాసుల పోరాటంలో పాల్గొనడం, అంబేద్కర్‌ విగ్రహ స్థాపన ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తినటం... ఈ అనుభవాలతో ఆయనకు రాజ్య హింస గురించి తెలిసి వచ్చింది. తాను ఎంచుకున్న మార్గం కష్టాలతో కన్నీటిమయంగా ఉంటుందని తెలిసినా ప్రజల కోసం ఆయన నిలబడ్డారు.  నిర్భయంగా, నిక్కచ్చిగా ముందుకు వెళుతూ పాటతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు.

చదవండి: గద్దర్‌ ఏ సినిమాల్లో నటించారో తెలుసా?

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Singer
poet
Gaddar
Tollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

కాజల్ ఆలోచనని మార్చేసిన కొడుకు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.