Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV
  • Tollywood
  • South India
  • OTT
  • Reviews
  • Gossips

Breadcrumb

  1. Home
  2. Movies
  3. సూర్య ‘సీన్‌’మూవీ రివ్యూ
ADVERTISEMENT

సూర్య ‘సీన్‌’మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2026 12:23 PM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
Suriya-Scene-Movie-Review.jpg

ఆవేశం’ ఫేమ్‌ జితు మాధవన్‌ దర్శకత్వంలో సూర్య, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన చిత్రం ‘సీన్‌’. నస్లేన్, ఆనంద్‌ రాజ్, లాల్, రాజ్‌ ప్రియన్‌ కీలక పాత్రలు పోషించారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్  మెంట్‌ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ దీపావళి కానుకగా నేడు(నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథేంటంటే.. 
క్రైమ్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పని చేసే ప్రేమ్ రాజ్‌ (సూర్య) తన తెలివి తేటలతో క్లిష్టమైన కేసులను ఈజీగా సాల్వ్‌ చేస్తుంటాడు. సీరియల్ కిల్లర్ విక్టర్ (టోవినో థామస్)ను అరెస్ట్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. అది పెండింగ్‌లో ఉండగానే నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ సీరియల్‌ కిల్లర్‌ విక్టర్‌ చేసిన మర్డర్స్‌ మాదిరే ఉంటాయి. విక్టర్‌ జైల్లో ఉంటే.. బయట ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది మిస్టరీగా మారుతుంది. అదే సమయంలో ప్రేమ్‌ సంబంధించిన ఓ సంచలన నిజం క్రైమ్‌ బ్రాంచ్‌ చీఫ్‌ స్టీఫెన్‌కి తెలుస్తుంది. దీంతో విక్టర్‌ని ఉద్యోగం నుంచి తప్పిస్తాడు. అయినప్పటికీ సీరియల్‌ కిల్లర్‌ కేసుని ప్రేమ్‌ సవాల్‌గా తీసుకుంటాడు. మాయ(నజ్రీయా) సాయంతో ఈ కేసులను విచారిస్తుంటాడు. అసలు ఆ హత్యలు చేస్తున్నదెవరు? ప్రేమ్‌  ఆ సీరియల్‌ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడు? పై అధికారుల దగ్గర ప్రేమ్‌ దాచిన నిజం ఏంటి? ప్రేమ్‌కు ఉన్న సమస్య ఏంటి? ఈ కేసు విచారణలో ప్రేమ్‌కి మాయ ఎలాంటి సహాయం చేసింది? ఈ కథలో ఈశ్వరన్‌ (నస్లేన్‌) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
పోలీసు అధికారిగా పనిచేయాలంటే అడ్డంకిగా మారే ఓ ఆరోగ్య సమస్యతో హీరో బాధపడుతుంటాడు. హీరోయిన్‌కు మరో సమస్య ఉంటుంది. ఇక హీరో తల్లిదండ్రులకూ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా భిన్నమైన సమస్యలతో సతమతమయ్యే వీరంతా కలిసి ఓ సీరియల్ కిల్లర్ కేసును ఎలా ఛేదించారన్నదే ఈ సినిమా కథ. సూర్యకు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా కథను రూపొందించి, అందులో కామెడీకి పెద్దపీట వేశారు దర్శకుడు జీతూ మాధవన్. క్రైమ్ థ్రిల్లర్‌కు హాస్యాన్ని జోడిస్తూ ఆయన చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు ఆకట్టుకుంటుంది.

(చదవండి: రామాయణం మూవీ రివ్యూ)

సినిమా ప్రారంభమైన తొలి పావు గంట సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌లా కథనం సాగుతుంది. అయితే హీరో దాచిన ఓ నిజం బయటపడిన తర్వాత కథ అసలు మలుపు తీసుకుంటుంది. అప్పటి నుంచి కామెడీ,  మొదలవుతాయి. ముఖ్యంగా మాయా పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. హీరో, హీరోయిన్ కలిసి చేసే ప్రయాణం, సాగించే ఇన్వెస్టిగేషన్ ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. వీరికి హీరో తల్లిదండ్రులు తోడవడంతో వినోదం మరింత పెరుగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా సాగుతూ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతాయి. ఇక ద్వితియార్థంలో కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. అయితే హీరోయిన్‌ చేసే యాక్షన్‌ సీన్‌ మాత్రం అదిరిపోతుంది.

హీరోని వేధిస్తున్న సమస్యకు అసలు కారణమేంటి? అనే ప్రశ్నలకు దర్శకుడు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. మరోవైపు హీరో సీరియల్ కిల్లర్‌ను గుర్తించే విధానం, తొలిసారి అతడిని ఎదుర్కొనే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాకు కావాల్సిన థ్రిల్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే కథ, కథనాలు, పాత్రల చిత్రీకరణ మాత్రం లాజిక్‌కు సుదూరంగా ఉంటాయి. కొన్ని సీన్లు సినిమాటిక్ ఉండటంతో నమ్మశక్యంగా ఉండవు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం, కథనంలో కొత్తదనం లేకపోవడంతో ‍కొన్ని చోట్ల సాదాసీదా సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్‌లు వెతకుండా వెళితే ఈ క్రైమ్‌ కామెడీ చిత్రం ఎంటర్‌టైన్‌  చేస్తుంది.  (ఇదీ చదవండి: నయనతార ‘మహాశక్తి’ మూవీ రివ్యూ అం‍డ్‌ రేటింగ్‌)

ఎవరెలా చేశారంటే.. 
ప్రేమ్‌రాజ్‌ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. గతంలో ఈ తరహా పాత్రను ఆయన చేయలేదనే చెప్పాలి. కామెడీతో పాటు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఇరగదీశాడు. ఇక మాయ పాత్రకు నజ్రియా పూర్తి న్యాయం చేసింది. తొలిసారి ఇందులో యాక్షన్‌  కూడా చేసింది. ఆ సీన్‌  అదిరిపోతుంది. ప్రేమలు ఫేమ్‌  నస్లేన్‌ సీరియల్‌ కిల్లర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. టోవినో థామస్‌ది అతిథి పాత్రే. పార్ట్‌ 2 మొత్తం ఆయన చుట్టూ తిరిగేలా ఉంది. హీరో తండ్రిగా ఆనంద్‌ రాజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సుశిన్‌ నేపథ్య సంగీతం బాగుంది. విజువల్స్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌  ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
2.75/5
tags Tags:
Suriya
Scene Movie
Movie News
movie reviews
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

రణ్‌బీర్ కపూర్ రామాయణ.. టాలీవుడ్ హీరో రివ్యూ

రణ్‌బీర్ కపూర్ రామాయణ.. టాలీవుడ్ హీరో రివ్యూ

శ్రీనివాస మంగాపురం... బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డ్

శ్రీనివాస మంగాపురం... బాక్సాఫీస్‌ వద్ద అరుదైన రికార్డ్

చలో జపాన్‌

చలో జపాన్‌

రాజమౌళి వారణాసి హీరోయిన్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..!

రాజమౌళి వారణాసి హీరోయిన్.. మరో మూవీకి గ్రీన్ సిగ్నల్..!

కృష్ణలో కొత్త కోణం

కృష్ణలో కొత్త కోణం

రాబిన్‌హుడ్ డిజాస్టర్.. డైరెక్టర్ రియాక్షన్

రాబిన్‌హుడ్ డిజాస్టర్.. డైరెక్టర్ రియాక్షన్

మరిన్ని వార్తలు

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

‘ఇక చాలు బాబోయ్‌’.. డేట్‌ నైట్స్‌పై కియారా రియాక్షన్‌ వైరల్‌

మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున

మేము అదృష్టవంతులం.. కొత్త హీరోలకు అదొక్కటే దిక్కు: నాగార్జున

రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..

రెజీనా కీలకపాత్రలో మైత్రీ కొత్త చిత్రం..

90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం

90 ఏళ్ల బామ వేడుకోలు.. ఏడాది చిన్నారికి సోనూసూద్‌ భారీ సాయం

కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్

కొడుకు ఫొటో రివీల్‌ చేసిన కత్రినా కైఫ్

దీపావళి రోజున.. స్టార్‌ హీరోల కొత్త అప్‌డేట్స్‌

దీపావళి రోజున.. స్టార్‌ హీరోల కొత్త అప్‌డేట్స్‌

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft