యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ దీపికా పదుకొణె నటించిన 'కల్కి 2898 AD'. ఈ మూవీకి సంబంధించి ఇవాళ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. శాన్ డియాగోలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్‌కి హాజరైన చిత్రబృందం.. ఈ మూవీ టైటిల్‌ను 'కల్కి 2898 AD' గా ఖరారు చేసింది. టైటిల్‌తో పాటు హాలీవుడ్‌ను తలపించేలా గ్లింప్స్ వీడియోను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయిపోతున్నారు. తాజాగా ప్రాజెక్ట్-కె గ్లింప్స్‌పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!)
రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ.. ' గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్‌పై సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టమైన పని. కానీ మీరు ఆ సాహసం చేశారు. అంతే కాదు సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇక ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్.' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. 'కల్కి' చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
(ఇది చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్)
Great job Nagi and Vyjayanthi movies. Creating an authentic futuristic movie is such a difficult task and you guys made it possible..👏🏻👏🏻
Darling looks smashing..
Only one question remains...
Release date...🥰 #Kalki2898AD https://t.co/kKefpCvovr— rajamouli ss (@ssrajamouli) July 21, 2023