ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్)
రాజమౌళి ట్వీట్ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు సైతం సిరాజ్ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.
Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻
And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗— rajamouli ss (@ssrajamouli) September 17, 2023