మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి 'Mr.ఇడియట్' టైటిల్ ఖరారు చేశారు. సిమ్రాన్ శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెళ్లి సందD' చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్, ప్రీ లుక్‌ని మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. నా కెరీర్లో 'ఇడియట్' సినిమాకు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ 'Mr ఇడియట్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాలాగే తనకు కూడా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను' అని చిత్రబృందానికి రవితేజ విషెస్ చెప్పారు. ట్వీట్ కూడా చేశారు.
Happy to unveil the Title Poster of #MrIdiot & Introduce my boy @maadhav_9999 🤗
Wishing your first step bring you success and love & May you have a amazing journey with cinema.
Wishing the Entire team All the best 👍#JJREntertainments #GowriRonanki #simransharma @raamdop… pic.twitter.com/DL40FoeXbL— Ravi Teja (@RaviTeja_offl) July 9, 2023
(ఇదీ చదవండి: తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ.. హీరోయిన్ ఇలియానా ఇబ్బందులు!)