మెగాపవర్ స్టార్ రామ్చరణ్- ఉపాసన దంపతులకు పుట్టిన పాపాయికి పేరు పెట్టేశారు. 'క్లీంకార కొణిదెల' అని నామకరణం చేశారు. అలానే బారసాల కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక పూర్తయిన తర్వాత పాపాయి ఊయల్లో ఉన్న ఫొటోని తాత అయిన మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. తన మనవరాలి పేరు వెనక సీక్రెట్ కూడా ఆయనే బయటపెట్టేశారు.
పేరు వెనక సీక్రెట్
రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పాప డీటైల్స్ ఇవే
రామ్ చరణ్- ఉపాసన 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన 11 ఏళ్లకు అంటే గతేడాది ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా ఉపాసన బేబీ బంప్ తో చాలాసార్లు బయట కనిపించింది. జూన్ 20న హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసనకు డెలివరీ అయింది. ఇప్పుడు పుట్టిన పాపకు పేరు పెట్టారు. దీంతో మెగాఫ్యాన్స్ ఈ పేరుని వైరల్ చేస్తున్నారు.
And the baby’s name is ‘Klin Kaara Konidela ‘..
Taken from the Lalitha Sahasranama Nama.. ‘Klin Kaara’ represents an Embodiment of Nature.. Encapsulates the supreme power of divine Mother ‘Shakthi’ .. and has a powerful ring and vibration to it ..
All of us are sure the… pic.twitter.com/vy3I0jaS4o— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023
(ఇదీ చదవండి: హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో చూశారా? రీఎంట్రీపై క్లారిటీ!)