ఈమధ్యకాలంలో సోషల్మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఏది ఎప్పుడు, ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు ఊహించలేం. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎక్కువగా ట్రోల్స్ బారిన పడుతుంటారు. ఇటీవలి కాలంలో దిల్రాజు పేరు నెట్టింట బాగా వైరల్ అయ్యింది. వారీసు ప్రీరిలీజ్ ఈవెంట్లో తమిళం, ఇంగ్లీష్ కలిపి ఆయన మాట్లాడిన తీరు ఎంతలా ట్రోల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మీమ్స్, ట్రోల్స్ సహా చివరికి రివ్యూలు కూడా దిల్రాజు స్టైల్లో చెప్పి నెట్టింట తెగ హడావిడి చేశారు.
తాజాగా నిర్మాత ఎస్కేఎన్ కూడా దిల్రాజును ఇమిటేట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన ఆయన స్పీచ్ చివర్లో.. ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు ఫైట్స్ ఇరిక్కు స్టొరీ ఇరిక్కు.. అంటూ దిల్రాజును ఇమిటేట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
The Swaggg Starrrrr @SKNonline 🔥
Total auditorium maamulu response kaadu pic.twitter.com/kIgO47vOqP— AYYAPPA REDDY (@lucky59000) January 20, 2023