Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

'ప్రేమంటే' రివ్యూ.. థ్రిల్‌ ఇస్తుందా?

Movies Sakshi User Sakshi Sakshi Time Nov 21, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
premante_20movie_20review.jpg

ప్రియదర్శి (Priyadarshi Pulikonda), ఆనంది (Anandhi) హీరో హీరోయిన్లుగా, సుమ కనకాల ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘ప్రేమంటే..’ థ్రిల్‌ ప్రాప్తిరస్తు ఉపశీర్షికను చేర్చారు. రానా స్పిరిట్‌ మీడియా సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్స్‌లోకి వచ్చేసింది. మల్లేశం, బలగం, కోర్ట్‌ సినిమాలతో ప్రియదర్శికి క్రేజ్‌ బాగానే ఉంది. కొత్త దర్శకుడు నవనీత్‌ శ్రీరామ్‌ తెరకెక్కించిన ఈ మూవీపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగమ్మాయి ఆనంది ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రేమ, పెళ్లి జీవితంతో ముడిపడిన కథతో  తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటి..?
ప్రేమంటే కథ సాధారణంగానే మొదలైనప్పటికీ కేవలం 15 నిమిషాల తర్వాత యూనిక్‌ కాన్సెప్ట్‌గా ఉందే అనిపిస్తుంది. ప్రియదర్శి (మధు సూదన్‌/మది) సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్‌ బిజనెస్‌ చేస్తుంటాడు. ఆనంది (రమ్య) చదువు పూర్తి చేసి ఉద్యోగంలో  ఉంటుంది. అయితే, వీరిద్దరు పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని సంబంధాలు కూడా రిజెక్ట్‌ చేస్తుంటారు. అయితే ఒక పెళ్లిలో అనుకోకుండా మధి, రమ్య కలుసుకుంటారు. ఇద్దరి అభిరుచులు కలుస్తాయి. ఆపై వారి కుటుంబాలు కూడా కలిసిపోతాయి. తర్వాత పెళ్లితో ఒక్కటైపోతారు. 

రమ్యకు థ్రిల్లింగ్‌ అనిపించే పనులు చేయాలంటే ఇష్టం.. మధి తన కుటుంబం కోసం ఏమైనా చేయాలనే మనస్థత్వంతో ఉంటాడు. సీసీటీవీ సెక్యూరిటీ సర్వీస్‌ బిజనెస్‌ చేసే మధి రాత్రి సమయంలో తన టీమ్‌తో దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని రమ్య గుర్తిస్తుంది. అయితే, మధి గురించి అసలు విషయం తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుంది. ఇలాంటి సమయంలో రమ్యకు ఏం చెప్పి మధి ఒప్పించాడు..? మధి ఎందుకోసం దొంగతనాలు చేస్తున్నాడు..? ఫైనల్‌గా రమ్య కూడా మధితో పాటు చోరీలు చేయడానికి కారణం ఏంటి..? పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ జోడీ వేస్తున్న స్కెచ్‌ ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రేమంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?
పెళ్లి తర్వాత తమ జీవితం ఎలా ఉండాలో అని ముందే ఊహించుకుంటాం. కానీ, అందుకు విరుద్దంగా లైఫ్‌ కొనసాగితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చక్కగా చూపించారు.  ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రయాణం  థ్రిల్లింగ్‌గా, ఓ సాహసోపేతమైన ప్రయాణంలా ఉండొచ్చు. కానీ, ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారన్నది ప్రమంటేలో దర్శకుడు  చూపించారు. కథలోని పాయింట్‌ కాస్త యూనిక్‌గా ఉన్నప్పటికీ చెప్పిన విధానం మాత్రం రెగ్యులర్ సినిమా కథలాగే ఉంటుంది. లాజిక్స్‌ వెతుకుతే సినిమా నచ్చకపోవచ్చు. ఫస్టాఫ్‌ ఫుల్‌ కామెడీగా మంచి  ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. దొంగతనం అంటే ఇష్టం లేని రమ్య తన భర్త మధితో పాటు చేసేందుకు రెడీ అవుతుంది..  ఎందుకు అనేది బలమైన కారణం ఉండదు. 

కానీ, చోరీ చేసే ప్లాన్స్‌, సన్నివేశాలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి.  నగరంలో వరుసగా చోరోలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ కేసును ఛేదించేందుకు హెడ్‌ కానిస్టేబుల్‌ సుమ (ఆశ) రంగంలోకి దిగుతుంది. ఆమెకు పై అధికారిగా వెన్నెల కిషోర్‌ (సంపత్‌) ఉంటాడు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ అందరినీ మెప్పిస్తాయి. దొంగతనాల వెనుక  ఎవరున్నారని తెలుసుకునేందుకు  ఆశ జరిపిన విచారణ ప్రేక్షకులను మెప్పించేలా సరదాగానే కొనసాగుతుంది. థ్రిల్‌ ప్రాప్తిరస్తు  క్యాప్షన్‌కు న్యాయం చేసేలా ప్రీఇంటర్వెల్‌ సీన్‌ అదరగొడుతుంది. ముఖ్యంగా సుమ, వెన్నెల కిషోర్, ఆది,  రామ్ ప్రసాద్ సరదా సంభాషణలు నవ్వులను తెప్పిస్తే.. ప్రియదర్శి, ఆనంది చేసే చోరీలు తప్పకుండా థ్రిల్‌ను పంచుతాయి. పాటలు పెద్దగా మెప్పించవు. సెకండాఫ్‌ కొంచెం మైనస​్‌. ఫైనల్‌గా ప్రేమంటే సినిమా అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ రైడ​్‌ అని చెప్పొచ్చు.

ఎవరెలా చేశారంటే..?
ప్రియదర్శి కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌లలో చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ నటించారు. తెలుగమ్మాయి ఆనంది తన నటనతో దుమ్మురేపింది. ఫుల్‌ ఎనర్జీగా స్క్రీన్‌పై కనిపించడమే కాకుండా భావోద్వేగ సీన్స్‌లలో మెప్పించింది. ఈ మూవీకి మరో ప్రధాన బలం సుమ, వెన్నెల కిషోర్‌ జంట.. వీరిద్దరి మధ్య మరికొన్ని సరదా సీన్లు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. సుమ వేసే పంచ్‌లకు వెన్నెల కిషోర్‌ ఇచ్చే రియాక్షన్‌ పంచ్‌లకు అదిరిపోయేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సీన్స్‌కు తగ్గట్లు సంగీతం ఉండటంతో ప్రెక్షకులు కనెక్ట్‌ అవుతారు. కొత్త దర్శకుడు నవనీత్‌ శ్రీరామ్‌ ప్రేమంటే చిత్రంతో తన టాలెంట్‌ చూపించాడు. దొంగతనం సీన్స్‌ తెరకెక్కించిన తీరు భేష్‌ అనిపించేలా ఉంటాయి. 'ప్రేమంటే' థ్రిల్‌ ఉంటది.

ADVERTISEMENT
ADVERTISEMENT
2.5/5
Tags:
Premante Movie
Priyadarshi Pulikonda
Anandhi
movie reviews
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

 నాగబంధం మూవీ రివ్యూ

నాగబంధం మూవీ రివ్యూ

ఇసకపట్నం వెబ్‌ సిరీస్‌ రివ్యూ

ఇసకపట్నం వెబ్‌ సిరీస్‌ రివ్యూ

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)

ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్‌.. ఈ వారం హిట్‌ బొమ్మ ఏది?

ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్‌.. ఈ వారం హిట్‌ బొమ్మ ఏది?

‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ

‘బాలన్‌- ది బాయ్‌’ మూవీ రివ్యూ

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.