Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌!

Movies Sakshi User Sakshi Sakshi Time May 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
operation-sindoor_0.jpg

పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్‌ దర్శకుడు ఉత్తమ్‌ మహేశ్వరీ(Uttam Maheshwari) ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. దీనిపై నెటిజన్స్‌ మండిపడ్డారు. ఒకవైపు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే..ఈ సమయంలో పోస్టర్‌ రిలీజ్‌ చేయడం అవసరమా అంటూ దర్శకుడిని ట్రోల్‌ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చిరవకు దర్శకుడు ఉత్తమ్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అందులో పేర్కొన్నాడు. 

(చదవండి: భారత్‌పై ప్రశంసలు.. హీరోయిన్‌కి బెదిరింపులు!)

‘ఈ సమయంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతున్నాను. డబ్బు కోసం లేదా ఫేమస్‌ అవ్వడం కోసమే ఇలాంటి పని చేయలేదు. మన సైనికుల ధైర్య సాహసాలను, త్యాగాలను ప్రపంచానికి తెలియజేసేలా ఓ పవర్‌ఫుల్‌ కథగా వెండితెరపై తీసుకురావాలనుకున్నాను. దేశంపట్ల గౌరవంతో నేను ఈ సినిమా చేయాలనుకున్నాడు. అంతేకాని డబ్బుకి ఆశపడి సినిమా ప్రకటన చేయలేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా ప్రకటన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి నా క్షమాపణలు చెబుతున్నాను. ఇది సినిమా మాత్రమే కాదు దేశ ప్రజల ఎమోషన్‌’ అని ఉత్తమ్‌ మహేశ్వరీ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

కాగా, ఏప్రిల్‌ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై పాక్‌ ఉగ్రవాదులు విచక్షణ రహితంగా దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు.  పహల్గాం ఘటనకు ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్‌ దాడి చేసింది. 26 మంది భారత మహిళల నుదుటిన‌ సిందూరం తుడిచేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సిందూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై దేశ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఇదే పేరుతో సినిమాను నిర్మించడానికి పలు నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి. టైటిల్‌ కోసం విఫల ప్రయత్నాలు చేశాయి. చివరకు నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్‌ పతాకంపై ఉత్తమ్‌ మహేశ్వరీ దర్శకత్వంలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తెరకెక్కిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో డైరెక్టర్‌ పై విధంగా స్పందించాడు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Operation Sindoor
India-Pak war
India-Pak tensions
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

రాజమౌళి-చరణ్ కాంబినేషన్ రిపీట్‌?

రాజమౌళి-చరణ్ కాంబినేషన్ రిపీట్‌?

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

రజనీ Vs మాజీ అల్లుడు.. ఆసక్తికర పోరు

ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!

ఆమె దుస్తుల ధర రూ.40వేలు.. కానీ చెప్పులు రూ.1 లక్ష పైనే!

విజయ్‌ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!

విజయ్‌ దర్శకుడితో సూర్య కొత్త సినిమా!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.