యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తల అహర్నిషలు కృషి చేసిన కష్టానికి ఫలితం దక్కింది. ఆగస్టు 23, 2023 భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా లిఖించబడింది. ఇంతటి ఘనత సాధించిన మన శాస్త్రవేత్తలను ఘనతను ప్రపంచ మొత్తం అభినందిస్తోంది. ఈ విజయం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(ఇది చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్ )
అయితే ఇంతకుముందు విక్రమ్ ల్యాండర్ గురించి నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఫోటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతినేలా ఇస్రో ఛైర్మన్ ఛాయ్ పోస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అంతే కాకుండా ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. చంద్రయాన్ తీసిన ప్రకాశ్ రాజ్ ఫోటో ఇదేనంటూ.. అతను బురదలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లోని ప్రకాశ్ రాజ్ క్లిప్స్‌ను షేర్ చేస్తూ నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. చంద్రయాన్-3 నుంచి రోవర్ ప్రగ్యాన్ తీసిన మొదటి చిత్రం ఇదేనంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇస్రో విజయం పట్ల కంగ్రాట్స్ చెబుతూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!)
Early Pictures coming in from Moon after landing of #Chandrayaan3. 🌕#justasking #PrakashRaj 😂😂 pic.twitter.com/c1pqizkNbC
— Keshav Soni (@ImKeshavSoni) August 23, 2023
For Prakash Raj ji,
1 Like = 1 Slap
1 Retweet = 100 Slap#justasking pic.twitter.com/zRJkdib1bm— WTF (@WeTheFukrey) August 23, 2023
BREAKING NEWS:-
First picture coming from the Moon by #VikramLander Wowww
Prakash Raj #justasking pic.twitter.com/UsinHfbzlx— Kadak (@kadak_chai_) August 21, 2023
PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking
— Prakash Raj (@prakashraaj) August 23, 2023