టాలీవుడ్ హీరోల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన వ్యక్తి వెంకటేశ్. ఆయన సినిమా వచ్చిందంటే కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటుంది. కానీ తొలిసారి అలాంటి పాత్రలకు చెక్ పెడుతూ రానా నాయుడులో కొత్త రోల్లో కనిపించాడు వెంకీ. ఈ సిరీస్‌లో నాగ నాయుడిగా తండ్రి పాత్రలో నటించాడు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దయచేసి కుటుంబంతో కలిసి చూడొద్దని మొదటి నుంచి యూనిట్ అంతా మొత్తుకుంటోంది. వాళ్లెందుకు అలా చెప్తున్నారో ఒక్క ఎపిసోడ్ చూసినా అర్థమైపోతుంది.
డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులతో నిండిపోయిందీ సిరీస్. వెంకటేశ్ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్ ఆడియన్స్ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. బూతులు తప్ప కథ లేదని మండిపడుతున్నారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం, కానీ డిజాస్టర్ అవడం ఖాయం అని రివ్యూలు ఇస్తున్నారు.
మరికొందరు మాత్రం.. ఇన్నిరోజులు కుటుంబ విలువల గురించి చెప్పారు కదా, ఎంతమంది నిజజీవితంలో పాటించారు? మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే మానేయండి. కానీ నటులు ఎలాంటి పాత్రలు పోషించాలనేది కూడా మీరే నిర్ణయిస్తారా? అని వెనకేసుకొస్తున్నారు. ఊరికే తిడుతున్నారు కానీ సిరీస్ మాత్రం కిరాక్‌గా ఉంది అని పొగుడుతున్నారు.
Venky ki intha criticize chestunnaru but do even see him doing a kissing scene in the entire show?? NO!! Yes he uttered cuss word & some filthy dialogues but that's how the character is even in the original!! #RanaNaidu
— Sunny Kesh (@Sunnykesh) March 11, 2023
i dont know whats wrong with these film and webseries makers. Too many verbal abusing words being used making speaking foul language look cool and normalizing those words .imagine kids watching speaking same in house with parents and siblings
#RanaNaiduOnNetflix #RanaNaidu— kiran kumar (@shiningkiran) March 11, 2023
5 Episodes chusaa story peddaga am ledh.
Asalu expect eh cheyale Elati web series thisthadu ani @VenkyMama .
Mirzapur chusinatu vundhii 🙏😂.#RanaNaidu https://t.co/mNS2kC6te7— Rishi Royal 🌐 (@iamNarasim) March 11, 2023
@RanaDaggubati గారు ఫ్యామిలీ కలిసి చూడవలసిన సినిమా కాదు అని ముందుగానే చెప్పారు చాలా సంతోషం 🙏
కానీ ఇలాంటి సొల్లు, చెత్త సినిమాలు తీయకపోయుంటే ఇంకా బాగుండేది కదా. @VenkyMama గారు ఫ్యామిలీ మాన్ అయ్యుండి ఇంత దిగజారి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది అర్ధంకాలేదు. #RanaNaidu 🖕🏽 Film— The SAI NIKHIL ✊🏽 (@SaiNikhil1022) March 11, 2023
Sorry to say but fact#DuniyaVijay ela ayithe EP #VeeraSimhaReddy lo alage mana #VenkyMama character kuda alage undi😭#RanaNaidu worst web series I have ever seen
Worst Characterization for every actor pic.twitter.com/O3h7fdbIvN— Sanju (@sanjaysudula) March 11, 2023
#RanaNaidu enti ippudu venkatesh anthe ga anthe ga antu regressive content cheskovala life long??
What is this Gatekeeping…. Show was always an adult show and was marketed like that !
All of you are adults only..so stop getting surprised at some adult scenes…— HitWicket! (@WalkingXception) March 11, 2023