థియేటర్లలో రిలీజైన సినిమాలు మహా అయితే నెల, అది కాదంటే ఓ రెండు నెలల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్న రోజులివి. అలాంటిది రెండేళ్ల క్రితం తీసి, పలు అవార్డులు దక్కించుకున్న ఓ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అందరూ ఈ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలోకి రానుంది?
సినిమా సంగతేంటి?
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా అద్భుతమైన క్రేజ్. మరోవైపు భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. వీళ్లిద్దరూ కలిసి ఓ నిర్మాణ సంస్థ కూడా స్థాపించారు. అలా తీసిన సినిమానే 'పెబ్బల్స్'. 2021లో పలు అవార్డులు దక్కించుకుని.. గతేడాది ఆస్కార్‌కి నామినేట్ కూడా అయింది. ఆస్కార్ రాకపోయినా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు మాత్రం దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమానే అక్టోబరు 27న సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
(ఇదీ చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?)

సినిమా కథేంటి?
వేలు (చెల్లపాండి) స్కూల్‌కి వెళ్లే కుర్రాడు. ఇతడి తండ్రి (కరుత్తాడియన్) తాగుబోతు. ఇతడి తాగుడు తట్టుకోలేక భార్య, తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోతుంది. దీంతో భార్య, కూతురిని తీసుకొచ్చేందుకు కొడుకుని తీసుకుని తండ్రి వెళ్తాడు. అలా తండ్రి-కొడుకు కలిసి చేసిన ఈ జర్నీలో ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు? చివరకు వేలు.. తల్లి-చెల్లిని కలిశాడా? వాళ్లని ఇంటికి తీసుకొచ్చాడా లేదా అనేదే మెయిన్ పాయింట్.

దర్శకుడు పీఎస్ వినోద్ రాజ్ ఈ సినిమా తీశారు. 2015లో ఇతడి అక్కని, బావ ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు. దీంతో దాదాపు 13 కిలోమీటర్ల నడిచొచ్చిన ఆమె, పుట్టింటికి చేరుకుంది. ఈ సంఘటన తర్వాత 'పెబ్బల్స్' ఆలోచన వచ్చింది. ఈ మూవీ చాలా రియలిస్టిక్‌గా ఉండటం, కొన్ని గగుర్పాటు కలిగించే సీన్లు ఉన్నప్పటికీ మనసుని హత్తుకుంటుంది. 2021లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు గానీ థియేటర్లలో రిలీజ్ చేయలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి తీసుకొస్తుండటంతో మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
(ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా)
The journey of this father and son is waiting to touch your heart. Catch this Award-winning movie on #SonyLIV from Oct 27.
#Koozhangal #KoozhangalOnSonyLIV #Pebbles @PsVinothraj @VigneshShivN @NayantharaU @Rowdy_Pictures @ParthiDOP@thisisysr @thecutsmaker @Hari_pebbles pic.twitter.com/dRlGmyQEUw— Sony LIV (@SonyLIV) October 21, 2023