Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Movies Sakshi User Sakshi Sakshi Time Jan 15, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nari-nari-naduma-murai-revi.jpg

టైటిల్‌: నారీ నారీ నడుము మురారి
నటీనటులు: శర్వానంద్‌, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్‌, వెన్నెల కిశోర్‌, సత్య, సుదర్శన్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు
నిర్మాత: అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు
సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌
విడుదల తేది: జనవరి 14, 2026

ఈ సంక్రాంతికి చివరగా వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్‌ చేయలేదు. కానీ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత ఈ చిత్రంపై కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ప్లాఫులతో సతమతవుతున్న  శర్వా.. ఈ చిత్రంతో హిట్‌ ట్రాక్‌ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఆర్కిటెక్ట్‌ గౌతమ్‌(శర్వానంద్‌).. నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..ఆయన తండ్రి కార్తిక్‌(నరేశ్‌)కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్‌ రాజ్‌) తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్‌ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. 

తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్‌ ఈ రిజిస్టర్‌ పెళ్లికి ఒప్పుకుంటాడు.  పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్‌ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? అదేంటి?  దియా(సంయుక్త) ఎవరు? గౌతమ్‌కి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్దాల కారణంగా కార్తీక్‌-పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. చివరకు గౌతమ్‌-నిత్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ కథకి లవకుశ(సత్య), సత్యమూర్తి(సునీల్‌), గుణశేఖర్‌(వెన్నెల కిశోర్‌)ల పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Nari Nari Naduma Murari Review).

ఎలా ఉందంటే..
కామెడీ సినిమాలకు కథ-కథనం ఎలా ఉన్నా సరే.. కడుపుబ్బా నవ్విస్తే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక బలమైన కథ.. ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారీ నారీ నడుము మురారీ సినిమా అవుతుంది. సామజవరగమన లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత దర్శకుడు రామ్‌ అబ్బరాజు..మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమాను తెరెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా.. స్క్రీన్‌ప్లేతో మరోసారి  మ్యాజిక్‌ చేశాడు. ముఖ్యంగా డైలాగులు అదిరిపోతాయి.  కథనం మొత్తం కరెంట్‌ పంచ్‌ డైలాగులతో హిలేరియస్‌ యాంగిల్‌ లో సాగుతుంది.

ఆరు పదుల వయసులో హీరో తండ్రి.. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి.. పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్‌-నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెడుతూ  చాలా హిలేరియస్‌గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్‌ ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. 

దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కామెడీ డోస్‌ మరింత పెరగుతుంది.  వెన్నెల కిశోర్‌ ఎంట్రీ..శ్రీమంతం ఎపిసోడ్‌..విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా.. అన్ని నాన్‌స్టాఫ్‌గా నవ్విస్తాయి. ముఖ్యంగా నరేశ్‌ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు..ఆయన చెప్పే డైలాగులకు పడి పడి నవ్వుతారు. ఆయన పర్సనల్‌ లైఫ్‌పై కూడా పంచ్‌లు వేసుకోవడం..మరింత ఫన్‌ని జనరేట్‌ చేసింది. ప్రీక్లైమాక్స్‌ నుంచి కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో కూడా మళ్లీ నరేశ్‌పై పంచ్‌ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ఒకటి రెండు డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూతు సీన్లు లేకుండా క్లీన్‌ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే..హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకోవచ్చు((Positive And Negatives Of Nari Nari Naduma Murari Movie).

ఎవరెలా చేశారంటే...
గౌతమ్‌ పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వా పాత్ర టెన్షన్‌ పడే ప్రతిసారి ప్రేక్షకుడి నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేశ్‌. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తిక్‌ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్రకు మధ్య పోలికలు ఉండడం.. డైలాగులు కూడా అలానే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. సెకండాఫ్‌లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి. 

ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త.. ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా.. సత్య కామెడీ బాగా వర్కౌట్‌ అయింది. గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్‌గా వెన్నెల కిశోర్‌ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్‌ రాజు, సునీల్‌, సుదర్శన్‌.. ఇలా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. భాను భోగవరపు అందించిన కథ.. డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాదు సినిమాలో అన్నిపాత్రలకు అదిరిపోయే డైలాగులు ఉంటాయి. రామ్‌ మంచి స్క్రీన్‌ప్లేతో ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. విశాల్‌​ చంద్రశేఖర్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. జ్ఞానశేఖర్‌, యువరాజ్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
3.25/5
Tags:
Nari Nari Naduma Murari Movie
Sharwanand
samyuktha
Sakshi Vaidya
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.