Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

‘మనుచరిత్ర’ మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 24, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
movie-review12.jpg

టైటిల్‌: మనుచరిత్ర

నటీనటులు: శివ కందుకూరి, మేఘా ఆకాశ్‌, ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్‌, సుహాస్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు

నిర్మాణ సంస్థ: ప్రొద్దుటూరు టాకీస్‌

నిర్మాత: ఎన్‌ శ్రీనివాస రెడ్డి

దర్శకత్వం: భరత్‌ పెదగాని

సంగీతం: గోపీ సుందర్‌

సినిమాటోగ్రఫీ: రాహుల్‌ శ్రీవాత్సవ్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి

విడుదల తేది: జూన్‌ 23, 2023

మనుచరిత్ర కథేంటంటే..

వరంగల్‌కు చెందిన మను (శివకందుకూరి) ఓ బ్రిలియంట్‌ స్టూడెంట్‌. కాలికాట్‌ ఎన్‌ఐటీలో చదవాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్‌లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్‌ యూ చెబుతాడు. శ్రావ్య, ఆయేషా, జాను.. ఇలా చాలా మందికి ఐ లవ్‌ యూ చెప్పి కొన్నాళ్ల తర్వాత చిన్న చిన్న కారణాలతో బ్రేకప్‌ చెబుతుంటాడు. సిన్సియర్‌గా ప్రేమించే మను ఎందుకు అలా బ్రేకప్‌ చేబుతాడు? బ్రిలియట్‌ స్టూడెంట్‌గా ఉన్న ఆయన ఎందుకు మద్యానికి బానిసైనాడు? అసలు జేన్నీ(మేఘ ఆకాశ్‌) ఎవరు? ఆమెకి మనుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?  స్థానిక రౌడీ రుద్ర (డాలి ధనంజయ)తో  కలసి  మను ఎలాంటి పనులు చేశాడు? చివరకు మను జీవితం ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 

వరంగల్‌ నేపథ్యంలో సాగే ఓ కుర్రాడి ప్రేమకథే ఈ చిత్రం. తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి, ఆమె ప్రేమని మరో అమ్మాయిలో వెతుక్కునే ఓ కుర్రాడి కథ ఇది. ఇలాంటి ప్రేమ కథకు అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100 తరహాలో గుండాయిజాన్ని తగిలించి కొంచెం కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఓ మర్డర్ సీన్ తో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత ఓ ఫైట్‌ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే అసలు కథ ప్రారంభమయ్యాకే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతిసారి ఓ అమ్మాయికి ఐ లవ్‌ యూ చెప్పడం.. అర్థంలేని కారణాలతో బ్రేకప్‌ చెప్పడం..ఇలాగే సాగుతుంది.

సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. సినిమా ప్రారంభమైన కాసేపటికే హీరోకి ఒక గతం ఉందనే సంగతి అందరికీ అర్ధమవుతుంది. ఆ ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ మొదలయ్యాక కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది.

జేన్నీ, మనుల మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. ఇద్దరి ప్రేమని పెద్దవాళ్లకి చెప్పడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం, ఇక లైఫ్‌లో అంతా హ్యాపీ అనుకునే సమయంలో చోటు చేసుకున్న సంఘటనలు, ఎదురైన ట్విస్ట్ లు ఉత్కంఠ క్రియేట్‌ చేస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం నడపడానికి కథే ఉండదు. ఫస్టాఫ్‌లో చూపించిన సన్నివేశాల చుట్టే కథను నడిపాడు. హీరో రౌడీయిజంలోకి దిగడం..ఆ తర్వాత జాను అనే మరో పాత్రని ప్రవేశపెట్టి ఇంకో లవ్ స్టొరీ ని చూపించడం.. కథంతా రొటీన్‌గా ఉంటుంది. అక్కడక్కడ `అర్జున్‌రెడ్డి` `ఆర్‌ఎక్స్ 100` సినిమాలను గుర్తుచేసేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. 

ఎవరెలా చేశారంటే..

మను పాత్రకు శివ కందుకూరి పూర్తి న్యాయం చేశాడు. ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన ఈ యంగ్‌ హీరో.. ఈ చిత్రంతో మాస్‌ లుక్‌ ట్రై చేసి మెప్పించాడు. జెన్నీ పాత్రలో మేఘా ఆకాశ్‌ ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ప్రియ వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్‌ పాత్రల నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో పర్వాలేదనిపించారు. విలన్‌ రుద్రగా ధనుంజయ్‌ మెప్పించాడు. హీరో స్నేహితుడిగా సుహాన్‌ మరోసారి అదరగొట్టేశాడు. మధు సూదన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. 

గోపీ సుందర్‌ సంగీతం బాగుంది. చంద్రబోస్‌ రాసిన ‘ఎక్కడ ఉంటదిరో ఆ పిల్ల’ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. రాహుల్‌ శ్రీవాత్సవ్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, రిచ్‌ లుక్‌నిస్తున్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
2.5/5
Tags:
Manu Charitra Movie
Shiva Kandukuri
Megha Aakash
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.