Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
madha-gaja-raja-movie-review.jpg

టైటిల్‌: మదగజరాజా
నటీనటులు:విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్ తదితరులు
నిర్మాణ సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సి
తెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్
సంగీతం: విజయ్ ఆంటోని
ఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.
విడుదల తేది: జనవరి 31, 2025

తమిళ స్టార్‌ విశాల్‌ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మదగజరాజా’(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్‌లో రిలీజై పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్‌ సినిమా రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది.  అయితే సంకాంత్రి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో తెలుగులో రిలీజ్‌ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌ మాదిరే ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచిందా? మదగజరాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.


కథేంటంటే..?
అరకు చెందిన మదగజరాజా( అలియాస్‌ ఎంజీఆర్‌(విశాల్‌)(Vishal) ఓ కేబుల్‌ ఆపరేటర్‌. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై. తండ్రికి తోడుగా ఉంటూ.. ఊర్లోనే ఉంటుంటాడు. ఓ కేసు విషయంలో అరకు వచ్చిన అగ్గిపెట్ట ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మాధవి కూడా ఎంజీఆర్‌ని ప్రేమిస్తుంది. కానీ ఓ కారణంగా ఆమె తండ్రితో కలిసి అరకు నుంచి వెళ్లిపోతుంది(Madha Gaja Raja Review)

రాజా ఈ బాధలో ఉండగానే.. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్‌ నుంచి ఫోన్‌ కాల్‌వస్తుంది. ఈ పెళ్లి వేడుకలో బాల్య స్నేహితులంతా కలుస్తారు. పెళ్లి అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో తన స్నేహితులకు ఏవో సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. ఈ సమస్యలకు మీడియా బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న కాకర్ల విశ్వనాథ్‌(సోనూసూద్‌) కారణమని తెలిసి రాజా హైదరాబాద్‌ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీడియాను అడ్డుపెట్టుకొని కాకర్ల ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? తన స్నేహితులకు కాకర్ల చేసిన మోసం ఏంటి? చివరకు తన స్నేహితుల సమస్యలను తీర్చాడా లేదా? ఈ కథలో మాయ(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉందంటే.. 
ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు. 12 ఏళ్ల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండితెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్‌సెట్‌ కూడా మారిపోయింది. డిఫరెంట్‌ కంటెంట్‌, కొత్త పాయింట్‌ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసింది మదగజరాజా. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్‌ అయిన సుందర్‌ సి. ఈ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. లాజిక్స్‌ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే సినిమాను నిలబెట్టింది. రొటీన్‌ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడుగా సంతానం పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడే సంబాషణలు ఇబ్బందికరంగా ఉన్నా.. ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు.


కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓ వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలోకి దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో అసలు కథేమి ఉండదు. కానీ ఎక్కడా బోర్‌ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీనే. సంతానం వేసిన ప్రతి పంచ్‌ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల శ్రుతిమించినట్లు అనిపించినా సంతానం ట్రాక్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇక సెకండాఫ్‌ని సీరియస్‌గా మార్చే అవకాశం ఉన్నా.. మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. కాకర్లను బురిడీ కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవికానికి దూరంగా ఉంటాయి. మంత్రి సత్తిబాబు డెడ్‌బాడీతో హీరో, అతని గ్యాంగ్‌ చేసే హంగామా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తేనే బాగుంటుంది. కానీ కథగా చూస్తే అతికినట్లుగా అనిపిస్తుంది. సీన్‌ టు సీన్‌ కంటిన్యుటీ ఉండదు. ఫస్టాఫ్‌ కథకి సెకండాఫ్‌ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్‌కి పట్టించుకోకుండా కొంచెం అతి అయినా పర్లేదు భరిస్తామని అనుకుంటే.. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుంది. 



ఎవరెలా చేశారంటే..
మాస్‌ యాక్షన్‌ సినిమాలు విశాల్‌కి కొత్తేమి కాదు. కెరీర్‌ ప్రారంభం నుంచి ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మదగజరాజాలోనూ మరోసారి మాస్‌ పాత్రనే పోషించాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా ఆలపించాడు. తెరపై ఆయన చేసే కొన్ని పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఇక వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, అంజలీ ఇద్దరూ తెరపై  అందాలు ఆరబోయడంలో పోటీ పడ్డారు. వారిద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్‌ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. సోనూసూద్‌ తనకు అలవాటైన విలన్‌ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. సంతానం కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్‌ అయింది. ఆయన పండించిన కామెడీ మాస్‌ ప్రేక్షకులను అలరిస్తుంది. మనోబాలతో పాటు మిగిలిన నటీటనులు తమ  పాత్రల పరిధిమేర నటించారు.


సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్‌ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం, పాటలు 12 ఏళ్ల క్రితం వచ్చిన మాస్‌ కమర్షియల్‌ సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. డబ్బింగ్‌ విష​యంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెరపై ఒకచోట తమిళ పేర్లు..మరోచోట తెలుగు పేర్లు కనిపిస్తాయి. విశాల్‌తో సహా అందరి పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్‌ చెప్పించారు. విజువల్స్‌గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

ADVERTISEMENT
ADVERTISEMENT
2.5/5
Tags:
Madha Gaja Raja
Vishal
anjali
Varalakshi Sarath Kumar
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

సమంతకు అఖిల్ విషెస్.. ఎందుకంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.