Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

కిచ్చా సుదీప్ ‘మాక్స్‌’ మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kiccha-Sudeep-Max-Movie-Review.jpg

టైటిల్‌ : మాక్స్‌ 
నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులు
నిర్మాత: కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: విజయ్‌ కార్తికేయ
సంగీతం: అజనీష్‌ లోకనాథ్‌
సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్ర
ఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబు
విడుదల తేది: డిసెంబర్‌ 27, 2024

కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
సస్పెండ్‌ అయిన సీఐ అర్జున్‌ అలియాస్‌ మాక్స్‌(సుదీప్‌ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్‌ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్‌ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్‌లో ఉన్న మంత్రుల  కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్‌ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్‌ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్‌ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూప(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌), గ్యాంగ్‌స్టర్‌ గని(సునీల్‌) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్‌(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఏదైనా ఒక సినిమా సూపర్‌ హిట్‌ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్‌ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్‌ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్‌ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.

మాక్స్‌ కూడా కార్తి సూపర్‌ హిట్‌ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి.  అలా అని సినిమా బోర్‌ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్‌ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్‌ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.

సీఐగా  బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్‌ భారీ ఎలివేషన్‌ ఇస్తూ డైలాగ్‌ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్‌ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్‌ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్‌ మాదిరి తెరపై ఒక్క సీన్‌ కూడా లేకపోవడం మైనస్‌.  విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్‌ కాలేడు.  

పోలీసు స్టేషన్‌..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్‌ మొత్తం ఇలానే సాగుతుంది.  ఒకటి రెండు యాక్షన్‌ సీన్‌ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్‌ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్‌ మాత్రం కథనం పరుగులు పెడుతుంది.  టైమ్‌ కౌంట్‌ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్‌ చేయలేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్‌, యాక్షన్‌ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్‌ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్‌ మీల్స్‌ పెట్టాడు. 

ఎవరెలా చేశారంటే.. 
కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్‌, మాస్‌ చిత్రాలన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.  యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూపగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్‌.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది. 

రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్‌ గనిగా సునీల్‌ రొటీన్‌ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్‌ లోకనాథ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్‌ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
2.75/5
Tags:
Kiccha Sudeep
Varalakshi Sarath Kumar
max
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

అమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులకు స్పెషల్ ట్రీట్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.