చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (84) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం (జూన్ 10న) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
వెలకట్టలేనిది
భారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. పల్లెటూరి మట్టి వాసనను, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను భారతీరాజా తెరపై అందమైన కవిత్వంగా మలిచారు. ఆయన చిత్రాలు లక్షలాది హృదయాలను తాకాయి. ఎంతోమంది దర్శకనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి.
పలు జాతీయ అవార్డులు అందుకున్న పద్మశ్రీ గ్రహీత భారతీరాజాగారు ఇండియన్ సినిమాకు అందించిన సేవలు వెలకట్టలేనిది. ఆయన దర్శకత్వంలో ఆరాధన మూవీలో పులిరాజుగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి నాపై ఎంతో ప్రభావం చూపాయి. ఆయన మనతో లేకపోయినా ఆయన తీసిన సినిమాలు మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయి. 'ఇయక్కునార్ ఇమయం' (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ఇదే నా ప్రగాఢ సానుభూతి.
- చిరంజీవి
Indian cinema has lost one of its greatest storytellers, #Bharathiraja garu.
He transformed the fragrance of village soil, the beauty of human relationships, the innocence of love, and the emotions of ordinary people into timeless cinematic poetry. His films touched millions of… pic.twitter.com/MdoUfpztji— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2026
కలగానే మిగిలిపోయింది: ఖుష్బూ
మనందరికీ ఎంతో ఇష్టమైన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన మరణం తమిళ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. భవిష్యత్తులో రాబోయే చిత్రాలకు దిశానిర్దేశంగా పని చేస్తాయి. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం ఆయన గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. నన్ను రెండు జడలతో చూపించాలని, కలిసి సినిమా చేద్దామని ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పుడది తీరని కలగానే మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
- ఖుష్బూ
Devastated to know that our most beloved, loved and respected Director, the legendary #BharathiRaaja avl is no longer with us. His demise is a gloomy cloud in tamil cinema. His films have been bench marks and shall continue to be the actual school of film making. He leaves behind… pic.twitter.com/p5a6yhn95y
— KhushbuSundar (@khushsundar) June 10, 2026
ఆయన శైలి ప్రత్యేకం
ప్రముఖ దర్శకులు భారతీరాజా గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తమిళ, తెలుగు చిత్రాలపై భారతీరాజా గారు తనదైన ముద్ర వేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను, టీనేజర్స్ కి ఉండే ఆకర్షణలు లాంటివి చూపించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ చూడదగ్గ విధంగా ఉంటుంది. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది...’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. సున్నితమైన ప్రేమ, సెంటిమెంట్ కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ లాంటి థ్రిల్లర్స్ తోను ప్రేక్షకులను మెప్పించారు. భారతీరాజా గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- పవన్ కల్యాణ్
నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి
గొప్ప పాఠాలు
హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగిన దర్శకుడా.. మీకు ముగింపు లేదు.. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. మీ పనితనం, సినిమాలే మాకు విలువైన పాఠాలు.
- కాయల్ దేవరాజ్
இயக்குனர் இமயமே!
நீ சரியவில்லை;
இன்னும் நீ
உயரமான இடத்தை நோக்கி
சஞ்சரிக்க சென்றுள்ளாய்! என்றும் உன் படைப்புகள்
எங்களுக்கு பாடங்கள்!#LegendaryDirector #Bharathiraaja #RIPBharathiraaja Sir pic.twitter.com/ZoP6ozrmAf— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 10, 2026
చదవండి: దర్శకుడు భారతీరాజా కన్నుమూత