మలయాళంలో తెరకెక్కిన 'కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు' (kerala crime files season 2) ట్రైలర్ విడుదలైంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. 2023లో జియో హాట్‌స్టార్ వేదికగా 'కేరళ క్రైమ్ ఫైల్స్' వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా దర్శకుడు అహ్మద్ కబీర్ తెరకెక్కించాడు. పార్ట్ 1లో ఒక్క మర్డర్ కేసుకు సంబంధించి చూపించి ఆపై పోలీసుల విచారణ సమయంలో మీడియా ఫోకస్, రాజకీయ జోక్యం అనేవి లేకుండా కథ చెప్పాడు. అలాంటి కేసును పోలీసులు సవాలుగా తీసుకుని ఎలా పూర్తి చేస్తారనేది చాలా ఆసక్తిగా చెప్పాడు. అప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ రావడంతో మేకర్స్ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. ఇప్పుడు పార్ట్2 కూడా క్రైమ్ కథాంశంతోనే నిర్మించారు. అజు వర్గీస్, లాల్,నివాస్ వాలిక్కున్ను, జిన్జ్ షాన్, శ్రీజిత్ వంటి వారు ఇందులో నటించారు. త్వరలో విడుదల కానున్నట్లు ప్రకటించారు.
ADVERTISEMENT
ADVERTISEMENT