Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Aug 10, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jailer-review.jpg

టైటిల్‌: జైలర్

నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్, వసంత్ రవి, యోగిబాబు తదితరులు

నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్

నిర్మాత: కళానిధి మారన్

దర్శకుడు: నెల్సన్ దిలీప్ కుమార్

సంగీతం: అనిరుధ్ రవిచందర్

ఎడిటర్‌: ఆర్.నిర్మల్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్

విడుదల తేది: 2023 ఆగస్టు 10

'జైలర్' కథేంటి?

ముత్తు(రజినీకాంత్) అలియాస్ టైగర్ ముత్తువేల్ పాండియన్ రిటైర్డ్ జైలర్. కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తుంటాడు. అందరూ ఇతడిని టీజ్ చేస్తుంటారు. ఇకపోతే ముత్తు కొడుకు అర్జున్(వసంత్ రవి) అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). చాలా నిజాయతీగా పనిచేస్తుంటాడు. ఎవరెన్ని చెప్పినా సరే విగ్రహాలు చోరీ చేసే ముఠాతో తలపడతాడు. దీంతో కొన్నాళ్లకు అతడు కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే కొడుకు ఆచూకీ కోసం ముత్తు అన్నిచోట్లకు వెళ్తాడు. అలాంటి ముత్తు.. కనిపించకుండా పోయిన కొడుకుని కనిపెట్టాడా లేదా? చివరకు ఏం నిజం తెలుసుకున్నాడు? ఈ స్టోరీలో వర్మ(వినాయగన్), బ్లాస్ట్ మోహన్(సునీల్), కామ్నా(తమన్నా) ఎవరు? అనేది తెలియాలంటే 'జైలర్' చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

ముత్తు అదేనండి రజినీకాంత్.. విలన్ డెన్‌లోకి వెళ్లి, అతడికి వార్నింగ్ ఇస్తాడు. స్టైల్‌గా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు. సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగిస్తాడు. ఇంటర్‌కట్‌లో మరో రెండు చోట్ల శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ కూడా అదే టైంకి సిగరెట్స్ స్టైల్‌గా వెలిగిస్తారు. దీనికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇదంతా చెప్పడానికి చాలా నార్మల్‌గా ఉన్నాసరే.. స్క్రీన్‌పై ఈ సీన్ చూస్తున్నప్పుడు మీరు రజినీకాంత్ మేనియాలోకి వెళ్లిపోతారు. ఇలాంటి సీన్స్ సినిమాలో బాగానే ఉన్నాయి.

ఫస్టాప్ విషయానికొస్తే.. అరక్కోణం అనే ఊరిలోని ఓ గుడిలో పూజారిని మర్డర్ చేసి, విగ్రహాం దొంగతనం చేసిన సీన్‌తో సినిమా ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ముత్తు(రజినీకాంత్), అతడి ఫ్యామిలీ గురించి చూపిస్తారు. పాపం.. రిటైర్ అయి ఇంట్లో ఉండేసరికి మనవడితో సహా అందరూ ముత్తుని ఆడేసుకుంటూ ఉంటారు. చివరకు అదే వీధిలో ఉండే క్యాబ్ డ్రైవర్(యోగిబాబు) కూడా ఏడిపిస్తుంటాడు. కొన్నాళ్లకు తన కొడుకు కనిపించకుండా పోవడం.. పోలీసుల దగ్గరకెళ్లి ముత్తు ప్రాధేయపడటం.. ఇలా సీన్ బై సీన్ మంచి ఫ్లోలో వెళ్తుంది. ఇక ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ అయితే మంచి హై ఇస్తుంది. 

ఇంటర్వెల్ వరకు రజినీకాంత్ ఇమేజ్, స్టోరీని బాగా హ్యాండిల్ చేసిన డైరెక్టర్ నెల్సన్.. సెకండాఫ్‌లో మాత్రం గందరగోళానికి గురిచేశాడు. అప్పటివరకు ఓ టెంపోలో వెళ్లిన కథ.. సెకండాఫ్‌లో ఎటెటో పోతుంది. అసలేం జరుగుతుందని ప్రేక్షకుడు అనుకుంటాడు. ఫైనల్లీ క్లైమాక్స్ వచ్చేసరికి మళ్లీ స్టోరీ గాడిన పడుతుంది. ఓ మంచి హై ఇచ్చే యాక్షన్ సీన్, ఊహించని సీన్‌తో ఎండ్ కార్డ్ పడుతుంది. 'జైలర్' కథ కొత్తదేం కాదు. ట్విస్టులు కూడా ఊహించేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలంటే స్టోరీలో రజినీకాంత్ హీరోయిజం తప్ప ఇంకేం లేదు!

డార్క్ కామెడీ తీయడంలో స్పెషలిస్ట్ అయిన నెల్సన్.. 'జైలర్' విషయంలోనూ అదే ఫార్ములా పాటించాడు. ఫస్టాప్‌లో రజినీకాంత్-యోగిబాబు మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్క్రీన్ పై కనిపించే యాక్టర్స్ అందరూ సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. మనకు మాత్రం నవ్వొస్తుంటుంది. అదే 'జైలర్'‌లో మ్యాజిక్. 

ఎవరెలా చేశారంటే?

'జైలర్'లో రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. మాస్-క్లాస్-యూత్-ఫ్యామిలీ.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కవర్ చేస‍్తూ ఎంటర్‌టైన్ చేశారు. ఆయనకు ఇలాంటివన్నీ కొత్తేం కాదుగా! తన మార్క్ మేనరిజమ్స్‌తో.. విజిల్స్ వేయించే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో రజినీ యాక్టింగ్ మీకు కచ్చితంగా హై ఇస్తుంది. రజినీకి భార్యగా రమ‍్యకృష్ణ హుందాగా నటించింది. కొడుకు అర్జున్‌గా వసంత్ రవి డిఫరెంట్ పాత్రలో ఓకే అనిపించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ నిడివి చాలా తక్కువ. కానీ ఉన్నంతలో వీళ్లకు ఎలివేషన్స్ బాగా పడ్డాయి. 

విలన్‌గా మలయాళ నటుడు వినాయగన్ బాగానే చేశాడు. కానీ అతడు పాత్రలో తమిళ నేటివిటి కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. సునీల్ ఇందులో బ్లాస్ మోహన్ అనే సినిమా హీరో పాత్రలో నటించాడు. కానీ ఇతడిని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. తమన్నా.. ఓ పాట, రెండు మూడు సీన్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. యోగిబాబు, వీటీవీ గణేశ్ ఉన్నంతసేపు నవ్వించారు. మిగిలిన వాళ్లు తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. 

టెక్నికల్ విషయాలకొస్తే ఈ సినిమాలో రజినీకాంత్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరో అని చెప్పొచ్చు. పాటల సంగతి పక్కనబెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో రజినీకాంత్‌ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేశాడు. మ్యూజిక్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు. ఓవరాల్‌గా చెప్పుకుంటే నార్మల్ ఆడియెన్స్‌కి 'జైలర్' నచ్చుతుంది. రజినీకాంత్ అభిమానులకు అయితే ఇంకా బాగా నచ్చేస్తుంది!

-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్

ADVERTISEMENT
ADVERTISEMENT
2.5/5
Tags:
Jailer Movie
Movie review
Rajinikanth
Anirudh Ravichander
Nelson Dilipkumar
Tollywood
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

Director Venkatesh Maha Shares Proud Moments Of Asha Pasham Song

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

పలు దేశాల్లో నిషేధం.. సినిమా తెలుగు రివ్యూ

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

అందుకే ఇన్నాళ్లు తిరుమలకు రాలేదు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.