సినిమా రీరిలీజ్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. హీరోల కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మొన్నామధ్య పవన్ కల్యాణ్ ఖుషి, మహేశ్‌బాబు ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేయగా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఈమధ్యే ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేయగా దానికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈసారి మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం. తాజాగా అల్లు అర్జున్ బర్త్‌డే(ఏప్రిల్ 8) సందర్భంగా దేశముదురును రీరిలీజ్ చేశారు.
బర్త్‌డేకు రెండు రోజుల ముందే ఏప్రిల్ 6న గ్రాండ్‌గా రీరిలీజ్ చేశారు. సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన అభిమాన హీరో మాస్ సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ ఊరుకుంటారా? థియేటర్లకు వరుసకట్టారు. ఈ క్రమంలో సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌కు అభిమానులు భారీగా తరలివచ్చారు. డైలాగులు, పాటలు వచ్చిన ప్రతిసారి ఈలలు, కేకలు, అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు. అక్కడివరకు బానే ఉంది అంతటితో ఆగకుండా పేపర్లు చింపుతూ థియేటర్ లోపలే టపాసులు పేల్చారు.
ఈ విషయం తెలిసిన పోలీసులు షో ఆపేసి లోనికి వెళ్లి అభిమానులను హెచ్చరించారు. ఈ విషయం గురించి నిర్మాత శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. 'సంధ్య థియేటర్ లోపల టపాసులు పేల్చడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దయచేసి అభిమానులు సీట్లకు, థియేటర్‌కు డ్యామేజీ చేయవద్దని కోరుతుతున్నాను. సినిమాను ఎంజాయ్ చేయండి. అలాగే దేవాలయాలుగా భావించే థియేటర్లను రక్షించండి' అని ట్వీట్ చేశాడు.
కాగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన దేశముదురు 2007 జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రంలో హన్సికా మొత్వానీ కథానాయికగా నటించింది. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సంగీతం అందించారు.
Police interpreted the show due to the hugeee crowds and bursting crackers inside Sandhya 70 mm
Request fans don't damage seats and burst crackers inside theaters
Enjoy the single screen Euphoria Respect and protect theaters which r our temples 🤗❤️#Desamuduru4KSpecialShows pic.twitter.com/YtgCKRFABz— SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 6, 2023
RTC X Road Sandhya 70MM #Desamuduru4K Celebrations!! 💥💥
Maku support chesina parthi team member ki thank you ♥️🔥
Next #Aarya2 ki ready ayipoindi .#Desamuduru4kSpecialShows#DesamuduruCelebrations pic.twitter.com/Oc5CuJYJQi— Allu Arjun Fan™ (@UrsAlluSai) April 7, 2023
BLOCK BUSTER #Desamuduru 💥
Telugu states witnessed never before MASS JATHARA on Working Day!!!!
Just @alluarjun cults things🛐 🙏#DesamuduruCelebrations#Desamuduru4KSpecialShows pic.twitter.com/wEMky9z6jL— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) April 7, 2023