Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT 

హీరోయిన్‌ అంటే గ్లామర్‌ అనుకుంటివా..ఫైర్‌.. ‘తగ్గేదే లే’

Movies Sakshi User Sakshi Sakshi Time Jun 21, 2025 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Deepika-Padukone.jpg

ఒకరు తుపాకీ పట్టుకున్నారు.... 
మరొకరు ఖడ్గం అందుకున్నారు... 
ఇంకొకరు చేతికి దొరికిన ఆయుధం తీసుకున్నారు... 
చూడ్డానికి సున్నితంగా కనిపించే ఈ భామలందరూ ఇలా ‘వెపన్స్‌’ పట్టుకున్నది విలన్లను రఫ్ఫాడించడానికే. ప్రస్తుతం బాలీవుడ్‌ పాపులర్‌ హీరోయిన్లు కొందరు ‘యిన్‌ యాక్షన్‌’ అంటూ యాక్షన్‌ రోల్స్‌ చేస్తున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై మెరుపు తీగల్లా కనిపించే ఈ తారలు మెరుపు వేగంతో ఫైట్స్‌ చేయడానికి ‘సై’ అన్నారు. ఆ పోరాటాల్లోకి వెళదాం. 

శివానీ రిటర్న్స్‌ 
శివానీ శివాజీ రాయ్‌ని తొలిసారి ప్రేక్షకులు ‘మర్దానీ’ (2014) చిత్రంలో చూశారు. ఈ పవర్‌ఫుల్‌  పోలీసాఫీసర్‌ పాత్రను రాణీ ముఖర్జీ అద్భుతంగా చేశారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘మర్దానీ 2’ (2019)లోనూ పోలీస్‌గా విజృంభించారు రాణి. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. మరోసారి శివానీ శివాజీ రాయ్‌గా ‘మర్దానీ 3’లో కనిపించనున్నారు రాణీ ముఖర్జీ. ప్రదీప్‌ సర్కార్‌ దర్శకత్వంలో తొలి భాగం ‘మర్దానీ’ని, రెండో భాగాన్ని గోపీ పుదిరన్‌ దర్శకత్వంలో నిర్మించిన యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ మూడో భాగం ‘మర్దానీ 3’ని అభిరాజ్‌ మినావాలా దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తొలి, మలి భాగాల్లో సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చేసిన రాణీ ముఖర్జీ ‘మర్దానీ 3’లోనూ ఆ పాత్ర చేస్తున్నారు. 

కాగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్‌లో రాణి చేసిన యాక్షన్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పదేళ్ల క్రితం ఫస్ట్‌ పార్ట్‌లో ఎంత ఎనర్జిటిక్‌గా కనిపించిందో ఇప్పుడూ అలానే కనిపిస్తోందనే కితాబులు ఆమెకు దక్కాయి. ఇక సినిమాలో ఏ రేంజ్‌లో విజృంభించారో చూడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ ఆగాల్సిందే. ‘‘చెడుపై పోరాటం చేసే శివానీ శివాజీ రాయ్‌ని తెరపైకి తీసుకురావడానికి హోలీ కన్నా మంచి సమయం ఏం ఉంటుంది. 2026 మార్చి 4న హోలీ. ఓ వారం ముందే ఫిబ్రవరి 27న మా శివానీ థియేటర్స్‌కి వస్తుంది’’ అని యశ్‌ రాజ్‌ సంస్థ ఓ సందర్భంలో పేర్కొంది. 



వారియర్‌ క్వీన్‌ 
సిల్వర్‌ స్క్రీన్‌పై మెరుపు తీగలా కనిపించే దీపికా పదుకోన్‌ మెరుపు వేగంగా ఫైట్‌ చేయడం కూడా చూశాం. అందుకు ఉదాహరణగా ఈ మధ్య వచ్చిన చిత్రాలు ‘పఠాన్, ఫైటర్, సింగమ్‌ ఎగైన్‌’లను చెప్పుకోవచ్చు. ఇప్పుడు సౌత్‌ సినిమాలో తన యాక్షన్‌ని చూపించడానికి రెడీ అయ్యారు దీపికా పదుకోన్‌. అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ΄పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ఎఎ22 ఎ6’ (వర్కింగ్‌ టైటిల్‌)లో దీపికా పదుకోన్‌ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె వారియర్‌ క్వీన్‌గా కనిపించనున్నారు. 

ఈ పోరాట యోధురాలికి సంబంధించిన లుక్‌ని ఇటీవల విడుదల చేయగా, దీపిక ఆ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించారు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్‌’లో దీపికా పదుకోన్‌ కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ‘ఎఎ22 ఎ6’లో పూర్తి స్థాయి కథానాయికగా వారియర్‌ క్వీన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని సమాచారం.  


 
షాపింగ్‌ మాల్‌లో ఫైట్‌ 
ఎన్టీఆర్‌–హృతిక్‌ రోషన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘వార్‌ 2’పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మాస్‌ హీరోలిద్దరూ సిల్వర్‌ స్క్రీన్‌పై ΄పోటా పోటీగా చేసిన వార్‌ని చూడ్డానికి ఇద్దరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 

కాగా... ఈ చిత్రంలో మరో లీడ్‌ రోల్‌లో నటించిన కియారా అద్వానీ కూడా ఫైట్‌ చేశారట. నిజానికి ‘వార్‌ 2’ టీజర్‌లో కియారా ఎల్లో కలర్‌ బికినీలో గ్లామరస్‌గా కనిపించి, హాట్‌ టాపిక్‌ అయ్యారు. అయితే ఇంత హాట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఇదే సినిమాలో ఓ షాపింగ్‌ మాల్‌లో డైనమిక్‌ ఫైట్‌లోనూ కుర్ర కారు గుండె లబ్‌ డబ్‌ పెంచనున్నారు. ఈ ఒక్క ఫైట్‌ మాత్రమే కాదు... మరికొన్ని ఫైట్‌ సీన్స్‌ కూడా చేశారట. ‘ఎట్రాక్షన్‌ మాత్రమే కాదు యాక్షన్‌’ కూడా అన్నమాట. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. 



లేడీ డాన్‌ 
కృతీ సనన్‌ వెండితెరపై తొలిసారి ఓ రేంజ్‌లో ఫైట్స్‌లో విజృంభించిన చిత్రం ‘గణపత్‌’ (2023). ఈ చిత్రంలో చేసిన జస్సీ సింగ్‌ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌లో ఓ కళ అయిన ‘నన్‌చాకు’ని నేర్చుకున్నారు. ఇప్పుడు రెండేళ్లకు మరోసారి ఫైట్స్‌లో స్పెషల్‌గా ట్రైనప్‌ అవుతారట. కృతీ సనన్‌కి వచ్చిన ఆఫర్‌లాంటిది మరి. ఈ బ్యూటీ లేడీ డాన్‌గా కనిపించనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్యారెక్టర్‌ కోసమే శిక్షణ తీసుకోనున్నారట. 

ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో వచ్చిన ‘డాన్, డాన్‌ 2’ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో భాగంగా రూపొందనున్న ‘డాన్‌ 3’లో ఈసారి రణ్‌వీర్‌ సింగ్‌ డాన్‌గా కనిపించనున్నారు. లేడీ డాన్‌గా కియారా అద్వానీని ఖరారు చేశారు. కానీ ఆ తర్వాత కియారా ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్‌ కావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి ఈ పాత్రకు పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కృతీ సనన్‌ పేరు కూడా ఉంది. ఫైనల్లీ కృతీ సనన్‌నే ఫిక్స్‌ చేశారట చిత్ర దర్శక–నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌. ఈ ఏడాదే ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది. 



మహిళా గూఢచారుల కథ 
ఇద్దరు మహిళా గూఢచారులు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ ప్రమాదకరమైన మిషన్లు ఎదుర్కొంటారు. తగ్గేదే లే అంటూ సాహసాలు చేస్తారు. ఈ ఇద్దరూ చేసిన సాహసాలేంటి? అనేది ‘ఆల్ఫా’ చిత్రంలో చూడాల్సిందే. ఆలియా భట్, శార్వరీ ఏజెంట్స్‌గా నటిస్తున్న చిత్రం ఇది. శివ్‌ రావైల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైఆర్‌ఆఫ్‌ (యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌) యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న చిత్రం ‘ఆల్ఫా’. ఈ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన గూఢచారుల చిత్రాల్లో హీరోలు లీడ్‌ రోల్స్‌ చేశారు. 

అయితే ఈ స్పై యూనివర్స్‌లో మహిళా గూఢచారులే ప్రధాన పాత్రలుగా వైఆర్‌ఆఫ్‌ నిర్మిస్తున్న తొలి చిత్రం కావడంతో ‘ఆల్ఫా’పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఆలియా, శార్వరీ రిస్కీ స్టంట్స్‌ చేశారట. ఈ సినిమా షూటింగ్‌ ఆరంభించే ముందు ఇద్దరు నాయికలకు ఫైట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, బాబీ డియోల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ, ఆలియా పాల్గొనగా హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్ల నేతృత్వంలో భారీ పోరాట సన్నివేశం చిత్రీకరించారని, ఇంకా బోలెడన్ని రిస్కీ ఫైట్స్‌ ఉన్నాయని బాలీవుడ్‌ టాక్‌. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో ఆలియా భట్‌ గురువు ΄ాత్రలో స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కనిపించనున్నారట. ఆదిత్యా చో్ర΄ా నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో డిసెంబరు 25న విడుదల కానుంది.  



పగ తీర్చుకోవడానికి... 
సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్‌’ చిత్రంలో బోల్డ్‌ క్యారెక్టర్‌లో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా నటించారు త్రిప్తీ దిమ్రి. తనలో మంచి గ్లామరస్‌ నటి ఉందనే విషయాన్ని నిరూపించుకున్నారామె. మళ్లీ సందీప్‌ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారీ  బ్యూటీ. అయితే ఈ చిత్రంలో త్రిప్తి పాత్ర ఏంటనే వివరాలు బయటకు రాలేదు. కాగా తనలో మంచి యాక్షన్‌ హీరోయిన్‌ ఉన్న విషయాన్ని నిరూపించుకోవడానికి రెడీ అయిపోయారు ఈ హీరోయిన్‌. ఓ హిందీ చిత్రంలో త్రిప్తి యాక్షన్‌ రోల్‌ చేస్తున్నారు. విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నారు. 

‘కమీనే, హైదర్, రంగూన్‌’ వంటి విశ్లేషకుల ప్రశంసలూ దక్కించుకున్న చిత్రాల తర్వాత మళ్లీ షాహిద్‌ కపూర్‌–విశాల్‌ భరద్వాజ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ ఫుల్‌ ΄్యాక్డ్‌ యాక్షన్‌ మూవీలో త్రిప్తీ దిమ్రి పగ తీర్చుకునే ΄ాత్రలో కనిపిస్తారట. ఎవరిపై పగ? ఏంటా కథ అనేది తెలియాల్సి ఉంది. రివెంజ్‌ తీర్చుకునే క్రమంలో ΄ోరాటాలు చేస్తారట. ఈ ΄ాత్ర కోసం త్రిప్తి ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యారని సమాచారం. ఇక ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారట షాహిద్‌ కపూర్‌. ఈ ΄ాత్ర రిస్కీ ఫైట్స్‌ చేస్తుందని టాక్‌. ఈ నేపథ్యంలో ఫైట్స్‌ కోసం షాహిద్, త్రిప్తి ఒకేసారి శిక్షణ తీసుకున్నారని బాలీవుడ్‌ ఖబర్‌. ఈ ఏడాది డిసెంబరు 5న ఈ చిత్రం రిలీజ్‌  కానుంది. 



యాక్షన్‌తో ఇంట్రడక్షన్‌ 
సిల్వర్‌ స్క్రీన్‌పై ఫస్ట్‌ టైమ్‌ కనిపించడం కనిపించడమే ఓ యాక్షన్‌ రోల్‌లో కనిపించనున్నారు షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌. తండ్రి కాంబినేషన్‌లో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ డాన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రధానాంశం గురు–శిష్యుల నేపథ్యంలో ఉంటుందని సమాచారం. తండ్రీ కూతురు షారుక్‌–సుహానా వెండితెరపై గురు–శిష్యులుగా కనిపిస్తారట. గురువు క్యారెక్టర్‌ నెగటివ్‌ షేడ్స్‌తో ఉంటుందని భోగట్టా. అంటే... షారుక్‌ గ్రే షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారని స్పష్టం అవుతోంది. నైపుణ్యం గల హంతుకుడిగా ఈ గురువు తన శిష్యురాలికి ΄ోరాటాల్లో శిక్షణ ఇస్తాడట. ఇద్దరూ కలిసి అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ని ఛేదిస్తారట. ఈ యాక్షన్‌ రోల్‌ కోసం సుహానా ఫైట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. వచ్చే ఏడాది అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి... యాక్షన్‌ రోల్‌తో ఇంట్రడ్యూస్‌ కానున్న సుహానా ఖాన్‌ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో చూడాలి.

ఇంకా సోనాక్షీ సిన్హా, తాప్సీ తదితర తారల డైరీలో యాక్షన్‌ మూవీస్‌ ఉన్నాయి. హీరోయిన్లంటే గ్లామర్‌ మాత్రమే కాదు... చాన్స్‌ వస్తే తమలోని ఫైర్‌ని బయటికి తీస్తామని యాక్షన్‌ మూవీస్‌ ద్వారా నిరూపించుకుంటుంటారు. అయితే ఒకేసారి ఈ తారలందరూ యాక్షన్‌ రోల్స్‌ చేయడం మంచి పరిణామం. కథానాయికల ప్రాధాన్యత పెరుగుతోందనడానికి ఇదో నిదర్శనం.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Deepika padukone
kiara adavani
Rani mukharji
Bollywood Actress
Cinema News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

'హైదరాబాద్ నా రెండో ఇల్లు'.. హాట్‌టాపిక్‌గా భాగ్యశ్రీ ప్రేమ పుకార్లు

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్

సిల్వర్‌ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

విమర్శించిన నోటితోనే 'గురూజీ' అని సంబోధించిన బండ్ల గణేష్

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు

లక్ష ఆఫర్‌.. కమిట్‌మెంట్‌ అడిగారు: ప్రముఖ నటి

లక్ష ఆఫర్‌.. కమిట్‌మెంట్‌ అడిగారు: ప్రముఖ నటి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.