బాస్ వచ్చాడు.. బాక్సాఫీస్ బద్ధలు కొడుతున్నాడు. పూనకాలు లోడింగ్ కాదు.. రికార్డులు హంటిగ్ అన్నట్లుగా కలెక్షన్ల వేట మొదలుపెట్టాడు. ముచ్చటగా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేశాడు మెగాస్టార్ చిరంజీవి. రికార్డుల్లో నా పేరుండటం కాదు, నా పేరు మీదే రికార్డులు ఉంటాయన్న మాటను అక్షరాలా నిజం చేస్తున్నాడు.
చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టైటిల్‌కు తగ్గట్టుగా మాస్ కంటెంట్‌తో అభిమానులను తెగ అలరిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించడంతో సినిమా మరింత సూపర్ హిట్టయింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైన వాల్తేరు వీరయ్య ఇతర స్టార్ హీరోల సినిమాలకు గట్టి పోటీనిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు రాబట్టిందీ చిత్రం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.
#WaltairVeerayya takes over the Box Office like BOSS 😎🔥
108 Crores Gross in 3 days for MEGA MASS BLOCKBUSTER #WaltairVeerayya 🔥💥
- https://t.co/KjX8J7HFFi
MEGA⭐ @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP #ArthurAWilson @SonyMusicSouth pic.twitter.com/n8PszOFt5u— Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023
చదవండి: వారం కాకముందే సెంచరీ కొట్టిన వారిసు
మరో అవార్డు దక్కించుకున్న నాటు నాటు, ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్