మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన 'భోళా శంకర్' సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా నచ్చలేదని చెప్పవచ్చు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు వచ్చాయి. మెగస్టార్ లాంటి పెద్ద నటుడితో సినిమా తీస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని ఆయనపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాలను మరోసారి తీయకండని ఫ్యాన్స్ కూడా కోరారు.
(ఇదీ చదవండి: సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్)
దీంతో ఆయన నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్‌లు ఎలా ఉంటాయని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇందులో భాగంగా యూవీ క్రియేషన్స్ నుంచి చిరంజీవి తర్వాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన కథను 'బింబిసార' మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ కథను రెడీ చేశారు. మెగా 157 సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటంచారు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో పంచభూతాల గుర్తులను వశిష్ట చూపించాడు.

టైటిల్ ఇదేనా..?
డైరెక్టర్ వశిష్ఠ, మెగాస్టార్ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో అనగా అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరిగా ఉండబోతోందని సమాచారం. ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి మానవుడైనా చిరంజీవిని ప్రేమించగా. అప్పుడు ఎదురైన ఇబ్బందులను చిరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో చూశాం.
(ఇదీ చదవండి: చిరంజీవిని మెప్పించిన డైరెక్టర్ వశిష్ఠ గురించి పూర్తి వివరాలు)
ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్‌తో కొందరు దేవకన్యలు భూమిపైకి రావడం వంటి ముఖ్యమైన కాన్సెప్ట్‌తో మెగా 157 ఉండనున్నట్లు సమాచారం. పంచభూతాలను చిరు ఎలా అధిగమిస్తాడనే కథాంశం మీద స్టోరీ లైన్ ఉండవచ్చు. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది అయితే తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
#Mega157 🔮
This time, its MEGA MASS BEYOND UNIVERSE ♾️
The five elements will unite for the ELEMENTAL FORCE called MEGASTAR ❤️🔥
Happy Birthday to MEGASTAR @KChiruTweets Garu ❤️@DirVassishta @UV_Creations#HBDMegastarChiranjeevi pic.twitter.com/llJcU6naqX— UV Creations (@UV_Creations) August 22, 2023