Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV
  • Tollywood
  • దక్షిణ భారత
  • OTT
  • Reviews
  • Gossips
  • Hollywood
  • Bollywood

Breadcrumb

  1. Home
  2. Movies
  3. Cinema Home
ADVERTISEMENT

BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ

Movies Sakshi User Sakshi Sakshi Time Jul 29, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Telugu-Movie-Review.jpg

టైటిల్‌: బ్రో

నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, . కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ , బ్రహ్మానందం తదితరులు

నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్

నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌

స్క్రీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

దర్శకత్వం: సముద్రఖని

సంగీతం: తమన్‌

ఎడిటర్‌: నవీన్‌ నూలి

విడుదల తేది: జులై 28, 2023

BRO Movie Star Cast

‘బ్రో’కథేంటంటే..

మార్కండేయులు అలియాస్‌ మార్క్‌(సాయి ధరమ్‌ తేజ్‌) ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి(రోహిణి), ఇద్దరు చెల్లెలు(ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, యువ లక్ష్మీ), అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదే తనలోకం. చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు తనే చూసుకుంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం డబ్బు సంపాదన మీదే పెడతాడు. చివరకు తన ప్రియురాలు రమ్య(కేతిక శర్మ)తో కూడా సరదాగా గడపలేడు. అలా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న మార్క్‌ ఓ రోజు ప్రమాదానికి గురై చనిపోతాడు. అతని ఆత్మ అంధకారంలోకి వెళ్తుంది. అక్కడ ఓ వెలుగు ద్వారా టైంగాడ్‌ టైటాన్‌(పవన్‌ కల్యాణ్‌) ప్రత్యక్షమవుతాడు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని, కొన్ని రోజులు బతికే చాన్స్‌ ఇవ్వమని టైటాన్‌ని వేడుకుంటాడు మార్కండేయ. టైటాన్‌ అతనికి 90 రోజుల సమయం ఇస్తాడు. మరి ఈ 90 రోజుల్లో మార్కండేయ తన బాధ్యతలు నెరవేర్చాడా? ఈ క్రమంలో అతను ఏం నేర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. 

BRO Movie Review In Telugu<br />

ఎలా ఉందంటే..

మూడేళ్ల క్రితం విడుదల విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. జీవితంలో ఓ వ్యక్తికి రెండో చాన్స్‌ వస్తే ఎలా ఉంటుంది? దానిని సద్వినియోగం చేసుకుంటాడా? ఆయన అనుకున్న పనులన్నీ జరుగుతాయా? లేదా? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అయితే మాతృకకు, తెలుగు ‘బ్రో’కు చాలా వ్యత్యాసం ఉంది. పవన్‌ కల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు.

అక్కడ రెండో చాన్స్‌ వయసు అయిపోయిన ఓ ముసలాయనకు వస్తే.. ఇక్కడ రెండో చాన్స్‌ ఓ యువకుడికి వస్తుంది. అలాగే అక్కడ టైంగాడ్‌ పాత్ర నిడివి చాలా తక్కువ, కానీ తెలుగులో టైంగాడ్‌ దాదాపు సినిమా మొత్తం ఉంటాడు. అయితే ఈ మార్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. లుక్స్‌ పరంగా మాత్రం వింటేజ్‌ పవన్‌ కల్యాణ్‌ని తెరపై చూస్తారు.

BRO Telugu Movie Wallpapers

సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్‌ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథ ప్రారంభమవుతుంది. సాయితేజ్‌ తో కలిసి పవన్‌ కల్యాణ్‌ భూమి మీదకు వచ్చకా..అక్కడ జరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్‌ సీన్స్‌ సోసోగా ఉంటాయి. ప్రతిసారి పవన్‌ని ఎలివేట్‌ చేస్తూ చూపించడం ప్యాన్స్‌ని అలరిస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకుడికి అతిగా అనిపిస్తుంది.

ఈ  సినిమాలో ఎక్కువ శాతం పవన్ కల్యాణ్ పాత పాటలను పెట్టడం కూడా మైనస్సే. ఒకటి రెండు సన్నివేశాలు అంటే ఓకే కానీ, సినిమా మొత్తం అదే ఉంటే చూసే ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిత్రం విషయం లోను అదే జరిగింది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా ఫ్యాన్స్‌ కోసమే చేశారు. సెకండాఫ్‌ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే సాయితేజ్‌ పాత్ర పడే సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథ, కథనం బాగున్నప్పటికీ.. ఏదో మిస్‌ అయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది.

Sai Dharam Tej Image In BRO

ఎవరెలా చేశారంటే..

ఈ చిత్రంలో హీరో సాయి తేజ్‌ అయినప్పటికీ సినిమా మొత్తం పవన్‌ కల్యాణ్‌ పాత్ర ఉంటుంది. టైంగాడ్‌ టైటాన్‌గా పవన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై వింటేజ్‌ పవన్‌ను చూస్తారు. ఇక మార్క్‌ పాత్రకు తేజ్‌ న్యాయం చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తేజ్‌ బాడీలో మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా అయ్యాడు.అది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్‌ కూడా ఆకట్టుకునేలా చేయలేకపోయాడు.

మార్క్‌ లవర్‌ రమ్యగా కేతికా శర్మ ఉన్నంతలో పర్వాలేదు. హీరో చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్‌ వారియర్‌ చక్కగా నటించింది. బ్రహ్మానందం ఒకే​ ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. హీరో తల్లిగా రోహిణి, బాస్‌గా వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

Pawan Kalyan Image In BRO

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం జస్ట్‌ ఓకే. కొన్ని పాటలు బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌లో తివిక్రమ్‌ మార్క్‌ అంతగా కనిపించదు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
2.5/5
Tags:
BRO Movie
Pawan Kalyan
Sai Dharam Tej
movie reviews
Movie News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘చెన్నై లవ్‌ స్టోరీ’ రివ్యూ

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

‘భాయ్‌కి ఏమైంది?..’ సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర ట్వీట్‌

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

సింగ్ గీతం మూవీ.. ఓరి జీవుడా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

48 గంటల్లోనే నిషేదం.. ‘సట్లజ్‌’ వివాదం ఏంటి?

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

ఈ సిరీస్ చూస్తే ఫోన్ వాడాలంటే భయపడతారు

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.